Begin typing your search above and press return to search.

వైరల్‌ వీడియో : కీర్తి సురేష్ యాక్షన్‌ హీరో స్టంట్స్‌

ఈ రేంజ్ లో యాక్షన్ స్టంట్స్ చూపిస్తే ముందు ముందు ఈమె కోసం దర్శకులు యాక్షన్ సినిమాల స్క్రిప్ట్‌ లు రెడీ చేస్తారేమో అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   6 Nov 2023 7:21 AM GMT
వైరల్‌ వీడియో : కీర్తి సురేష్ యాక్షన్‌ హీరో స్టంట్స్‌
X

కమర్షియల్‌ సినిమాల్లో హీరోలు కార్లు జీప్ లను నడుపుతున్న సమయంలో దుమ్ము లేవడం, సడెన్ బ్రేక్ వేసిన సమయంలో వెనుక టైర్లు సర్రున జారడం వంటివి మనం చూస్తూ ఉంటాం. అయితే హీరోలు చేసిన సమయంలో కార్లు రోప్స్ తో కట్టి ఉంచడం చేస్తారు.. లేదంటే డూప్‌ లతో అలాంటి సన్నివేశాలను ఎక్కువగా చిత్రీకరిస్తారు అనే విషయం తెల్సిందే.

అలాంటి యాక్షన్‌ హీరో స్టంట్స్ ను మహానటి ఫేం అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్ చేసి అందరిని ఆశ్చర్యపరిచింది. జీప్ లో బీచ్ లో దుమ్ము రేపుతూ ఆమె చేసిన యాక్షన్ స్టంట్‌ కి అంతా కూడా నోరు పెద్దగా చేసి మరీ చూస్తున్నారు. ఆ స్టంట్‌ ను ఒకటికి పది సార్లు సోషల్‌ మీడియాలో నెటిజన్స్ చూడటంతో అది కాస్త వైరల్‌ అయింది.

కీర్తి సురేష్ అందాన్ని ఇప్పటివరకు చూశాం. ఆమె లో ఇది మరో యాంగిల్ అన్నట్లుగా నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. మొత్తానికి కీర్తి సురేష్ ఈ వీడియో తో మరో సారి వార్తల్లో నిలిచింది. ఈ రేంజ్ లో యాక్షన్ స్టంట్స్ చూపిస్తే ముందు ముందు ఈమె కోసం దర్శకులు యాక్షన్ సినిమాల స్క్రిప్ట్‌ లు రెడీ చేస్తారేమో అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఈ మధ్య కాలంలో తెలుగు లో ఈమె చేసిన భోళా శంకర్ నిరాశపరచడంతో తమిళ్ సినిమాలపై ఎక్కువ ఫోకస్ పెట్టింది. ఒక వైపు లేడీ ఓరియంటెడ్‌ సినిమాలు చేస్తూ మరో వైపు హాట్‌ లేడీగా స్టార్‌ హీరోల కమర్షియల్‌ సినిమాల్లో హీరోయిన్ గా కనిపిస్తోంది. హీరోయిన్ గా ఎంత బిజీగా ఉన్నా ఇలాంటి చిల్‌ మూమెంట్స్ ను సోషల్‌ మీడియాలో కీర్తి రెగ్యులర్‌ గా షేర్‌ చేస్తూ ఉంటుంది.