Begin typing your search above and press return to search.

భోళా శంకర్ కోసం కీర్తి రెమ్యునరేషన్ ఎంతంటే?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి వస్తోన్న చిత్రం భోళా శంకర్

By:  Tupaki Desk   |   11 Aug 2023 4:43 AM GMT
భోళా శంకర్ కోసం కీర్తి రెమ్యునరేషన్ ఎంతంటే?
X

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి వస్తోన్న చిత్రం భోళా శంకర్. మెహర్ రమేష్ దర్శకత్వంలో సిద్ధమైన ఈ మూవీ ప్రీమియర్ షోలతో సందడి షురూ అయ్యిందని చెప్పొచ్చు. అనిల్ సుంకర ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు. మూవీలో తమన్నా మెగాస్టార్ చిరంజీవికి జోడీగా నటించింది. కీర్తి సురేష్ చెల్లెలు పాత్రలో కనిపించబోతోంది.

ప్రస్తుతం కీర్తి సురేష్ సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతోంది. ఈ ఏడాది దసరా మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. అలాగే తమిళంలో కూడా ఉదయనిధి స్టాలిన్ తో చేసిన నాయకుడు మూవీ సూపర్ హిట్ అయ్యింది. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు కూడా సొంతం చేసుకుంది. ప్రస్తుతం చేతినిండా హీరోయిన్ గా సినిమాలు ఉన్నాయి.

అయితే మిగిలిన హీరోయిన్స్ కంటే కీర్తి సురేష్ భిన్నం అని ఎప్పటికప్పుడు ప్రూవ్ చేసుకుంటూ ఉంటుంది. క్యారెక్టర్ కి దమ్ముంది అంటే చెల్లెలు పాత్రలు చేయడానికి కూడా సై అంటుంది. అలాగే నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్స్ లో కనిపించడానికి కూడా సిద్ధంగా ఉంటుంది. రజినీకాంత్ అన్నాత్తై మూవీలో చెల్లెలు పాత్రలో నటించి మెప్పించింది. ఇప్పుడు మెగాస్టార్ భోళా శంకర్ లో మరోసారి చెల్లెలుగా కనిపిస్తోంది.

వేదాళం రీమేక్ గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో చెల్లెలు పాత్రకి మంచి ప్రాధాన్యత ఉంటుంది. ఈ పాత్ర చుట్టూనే కథ మొత్తం తిరుగుతుంది. అందుకే కీర్తి సురేష్ కాదనకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఈ మూవీలో సిస్టర్ రోల్ చేయడం కోసం కీర్తి సురేష్ కి ఏకంగా 1.5 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చారంట. హీరోయిన్ గా కూడా ఆమె అంత మొత్తమే తీసుకుంటుంది.

ఈ నేపథ్యంలో పాత్ర ప్రాధాన్యతని దృష్టిలో ఉంచుకొని అనిల్ సుంకర ఆమె హీరోయిన్ గా ఎంత అయితే తీసుకుంటుందో అంతే ఆఫర్ చేసారంట. సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే నటిగా కీర్తి సురేష్ భోళా శంకర్ తో రికార్డ్ క్రియేట్ చేసిందని చెప్పొచ్చు.