Begin typing your search above and press return to search.

'మహానటి' ప్రయోగం నిర్ణయం కరెక్టేనా..?

గత ఏడాది మహేష్ బాబుకు జోడీగా సర్కారు వారి పాట సినిమాలో నటించిన కీర్తి సురేష్ కోలీవుడ్‌ లో పలువురు స్టార్‌ హీరోల సినిమాల్లో నటించింది.

By:  Tupaki Desk   |   26 March 2024 8:12 AM GMT
మహానటి ప్రయోగం నిర్ణయం కరెక్టేనా..?
X

మహానటి సినిమా తో పాన్ ఇండియా రేంజ్ లో మంచి గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ కీర్తి సురేష్‌. ఆ సినిమా తర్వాత ఎన్నో లేడీ ఓరియంటెడ్‌ సినిమాలు చేసిన కీర్తి సురేష్‌ కమర్షియల్‌ సినిమాల్లో కూడా నటించింది. సూపర్ స్టార్‌ హీరోల సినిమాల్లో నటించిన కీర్తి సురేష్‌ చిన్న హీరోలకు కూడా జోడీగా నటించింది.


గత ఏడాది మహేష్ బాబుకు జోడీగా సర్కారు వారి పాట సినిమాలో నటించిన కీర్తి సురేష్ కోలీవుడ్‌ లో పలువురు స్టార్‌ హీరోల సినిమాల్లో నటించింది. ఇలాంటి సమయంలో టాలీవుడ్‌ లో ఈమె ఇప్పుడిప్పుడే హీరోగా అడుగులు వేస్తున్న సుహాస్ కి జోడీగా నటించేందుకు కమిట్‌ అవ్వడం చాలా మందికి ఆశ్చర్యంను కలిగిస్తోంది.

కలర్ ఫోటో తో హీరోగా మంచి గుర్తింపు దక్కించుకున్న సుహాస్‌ ఆ తర్వాత చేసిన సినిమాలతో హీరోగా పర్వాలేదు అనిపించుకున్నాడు. అలాంటి సుహాస్‌ తో ఉప్పు కప్పురంబు అనే విభిన్నమైన కామెడీ ఎంటర్‌ టైనర్‌ ను చేసేందుకు కీర్తి సురేష్ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

ఉప్పు కప్పురంబు సినిమాలో కచ్చితంగా కీర్తి సురేష్ పాత్ర డామినేషన్‌ ఉంటుంది. అయినా కూడా సుహాస్ వంటి చిన్న హీరో తో జత కట్టడం అనేది చాలా పెద్ద సాహసం అంటూ స్వయంగా ఆమె అభిమానులు మాట్లాడుకుంటూ ఉన్నారు.

ఈ విషయమై సోషల్‌ మీడియాలో రకరకాలుగా ప్రచారం జరుగుతుంది. నటి అన్నప్పుడు అన్ని రకాల సినిమాలు చేయాలి, అన్ని రకాల కథలను చేయాలి. ఇక నటిగా నిరూపించుకునేందుకు కాన్సెప్ట్‌ ను చూడాలే కానీ అందులో నటిస్తున్న నటీ నటులను కాదు. కనుక కీర్తి సురేష్ నిర్ణయం కరెక్టే అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి మీ అభిప్రాయం ఏంటి...?