Begin typing your search above and press return to search.

కీర్తి సురేష్.. ఘాటైన ముద్దులు తప్పవేమో..?

ఈ సారి ఛాన్స్ మిస్ చేసుకోకూడదు అని బేబీ జాన్ కోసం రూల్స్ బ్రేక్ చేసి లిప్ లాక్ సన్నివేశాలలో కీర్తి సురేష్ నటించిందట.

By:  Tupaki Desk   |   21 May 2024 1:30 PM GMT
కీర్తి సురేష్.. ఘాటైన ముద్దులు తప్పవేమో..?
X

సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ గా కీర్తి సురేష్ తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకుంది. మహానటి సినిమాతో ఏకంగా నేషనల్ అవార్డు సైతం అందుకుంది. మలయాళీ ఇండస్ట్రీలో నటిగా కెరియర్ స్టార్ట్ చేసిన కీర్తి సురేష్ నేను శైలజ మూవీతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. మూడో సినిమాగా మహానటి చేసి స్టార్ హీరోయిన్ ఇమేజ్ ని సొంతం చేసుకుంది. ఈ సినిమా తర్వాత తెలుగు, తమిళ్, మలయాళీ భాషలలో వరుస అవకాశాలు అందుకుంటూ బిజీ హీరోయిన్ అయిపొయింది.

ఈ బ్యూటీ చివరిగా తెలుగులో దసరా మూవీలో నానికి జోడీగా నటించింది. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. అయితే ప్రస్తుతం కీర్తి సురేష్ చేతిలో తెలుగు మూవీస్ లేవు. తమిళ్, మలయాళీ భాషలలో చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అలాగే కీర్తి సురేష్ బాలీవుడ్ లోకి కూడా అడుగుపెడుతోంది. అట్లీ సూపర్ హిట్ మూవీ తెరి సినిమాని హిందీలో బేబీ జాన్ పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నాడు. అట్లీ ఈ చిత్రానికి నిర్మాణ భాగస్వామిగా ఉన్నాడు.

బేబీ జాన్ సినిమాలో వరుణ్ ధావన్ కి జోడీగా కీర్తి సురేష్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఇదిలా ఉంటే ఈ మధ్య కమర్షియల్ సినిమాల కోసం కీర్తి సురేష్ గ్లామర్ డోస్ పెంచింది. ఇప్పుడు బేబీ జాన్ కోసం తాను పెట్టుకున్న కండిషన్స్ కూడా బ్రేక్ చేసిందని టాక్ వినిపిస్తోంది. కీర్తి సురేష్ కెరియర్ ఆరంభంలో లిప్ లాక్ సన్నివేశాలలో నేను నటించను అని చెప్పింది.

దానికి తగ్గట్లుగానే ఇప్పటి వరకు సౌత్ లో ఏ హీరోతో లిప్ లాక్ సీక్వెన్స్ లలో కీర్తి సురేష్ నటించలేదు. అయితే బాలీవుడ్ లో క్రేజ్ కావాలంటే మినిమమ్ లిప్ లాక్ సన్నివేశాలు కొన్నిసార్లు తప్పవు, అలాగే గ్లామర్ షోకి సైతం రెడీగా ఉండాల్సిందే. అలా అయితేనే పోటీలో నిలదొక్కుకోవచ్చు అనే అభిప్రాయం ఉంది. కీర్తి సురేష్ చాలా కాలం నుంచి బాలీవుడ్ లో పాగా వేయాలని అనుకుంటుంది. గతంలో బోనీ కపూర్ నిర్మాణంలో మైదాన్ సినిమాలో అవకాశం వచ్చి చేజారింది.

ఈ సారి ఛాన్స్ మిస్ చేసుకోకూడదు అని బేబీ జాన్ కోసం రూల్స్ బ్రేక్ చేసి లిప్ లాక్ సన్నివేశాలలో కీర్తి సురేష్ నటించిందట. మేకర్స్ కూడా ముందుగానే లిప్ లాక్ సీక్వెన్స్ ఉంటాయని కీర్తి సురేష్ కి చెప్పారంట. ఆమె కూడా వాటికి ఒకే చెప్పి బేబీ జాన్ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. మరి ఈమె మొదటి సారి చేయబోయే ఈ సీన్స్ ఎలా ఉంటాయనేది చూడాలి.