Begin typing your search above and press return to search.

కీర్తి సురేష్.. ఈ టైమ్ లో జాక్ పాట్

సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ బ్యూటీ వరుసగా సినిమాలు చేస్తూ సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా దూసుకుపోయింది.

By:  Tupaki Desk   |   25 Nov 2023 5:07 AM GMT
కీర్తి సురేష్.. ఈ టైమ్ లో జాక్ పాట్
X

సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ బ్యూటీ వరుసగా సినిమాలు చేస్తూ సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా దూసుకుపోయింది. మహానటి సినిమాతో ఏకంగా నేషనల్ అవార్డు సైతం అందుకుంది. కీర్తి సురేష్ నుంచి ఈ ఏడాది దసరా లాంటి బ్లాక్ బస్టర్ మూవీ వచ్చింది. తమిళంలో కూడా ఉదయనిధికి జోడీగా మమన్నాన్ అనే సినిమాలో నటించి సక్సెస్ అందుకుంది.

మెగాస్టార్ చిరంజీవి సిస్టర్ గా భోళా శంకర్ మూవీ చేసిన అది కాస్త డిజాస్టర్ అయింది. జయం రవి హీరోగా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుబోతున్న సైరన్ మూవీలో కీర్తి సురేష్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతుంది. దీంతోపాటు మరో మూడు సినిమాలు నిర్మాణ దశలో ఉన్నాయి. ఇలా గ్యాప్ లేకుండా కీర్తి సురేష్ తెలుగు, తమిళ, మలయాళీ భాషలలో నటిగా దూసుకుపోతోంది.

ఇదిలా ఉంటే ఇప్పుడు కీర్తి సురేష్ డిజిటల్ స్పేస్ లోకి అడుగుపెడుతోంది. యష్ రాజ్ ఫిలిమ్స్ కీర్తి సురేష్ రాధిక ఆప్టే కాంబినేషన్ లో పీరియాడికల్ జోనర్ లో రివెంజ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ నిర్మిస్తున్నారు. అక్క అనే టైటిల్ తో ఈ వెబ్ సిరీస్ సిద్ధం అవుతూ ఉండడం విశేషం. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా బయటకు రాకపోయిన ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నట్లుగా బాలీవుడ్ వర్గాలలో వినిపిస్తోంది.

ధర్మరాజ్ శెట్టి ఈ వెబ్ సిరీస్ తో డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారని బి టౌన్ టాక్. నిజానికి కీర్తి సురేష్ అజయ్ దేవగన్ మైదాన్ సినిమాలో నటించాల్సి ఉంది. కానీ అందులో హీరో భార్య పాత్రకు ఆమె సెట్ కాకపోవడంతో ప్రియమణి రీప్లేస్ చేశారు. ఇప్పుడు ఏకంగా యష్ రాజ్ ఫిలిమ్స్ లాంటి బిగ్ ప్రొడక్షన్ హౌస్ తో వర్క్ చేసే అవకాశాన్ని కీర్తి సురేష్ సొంతం చేసుకుంది.

వచ్చే ఏడాది ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో రిలీజ్ అయ్యే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది. మరి ఈ వెబ్ సిరీస్ లో కీర్తి సురేష్ ఎలాంటి పాత్రలో కనిపించబోతోంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.