Begin typing your search above and press return to search.

ప్రభాస్ స్పిరిట్ లో ఆ హీరోయిన్ కు ఛాన్స్..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సినిమా అంటే నేషనల్ లెవెల్ లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నట్టే లెక్క.

By:  Tupaki Desk   |   1 April 2024 3:38 AM GMT
ప్రభాస్ స్పిరిట్ లో ఆ హీరోయిన్ కు ఛాన్స్..?
X

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సినిమా అంటే నేషనల్ లెవెల్ లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నట్టే లెక్క. ఆల్రెడీ వారికి ఉన్న ఇమేజ్ కి ప్రభాస్ సినిమా తోడైతే ఆ రేంజ్ మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అలాంటి లక్కీ ఛాన్స్ అందుకుంది మహానటి కీర్తి సురేష్. రెబల్ స్టార్ ప్రభాస్ సందీప్ వంగ కాంబినేషన్ లో రాబోతున్న స్పిరిట్ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా ఫిక్స్ అయ్యిందని టాక్. యానిమల్ తో మరోసారి తన మ్యాడ్నెస్ చూపించిన సందీప్ వంగ ప్రభాస్ తో చేయబోతున్న స్పిరిట్ సినిమా పనులు మొదలు పెట్టాడు.


ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తుంది. ఈ సినిమాలో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ 3 సినిమాలతోనే తనకంటూ ఒక మార్క్ సెట్ చేసుకున్న సందీప్ వంగ తను చెప్పాలనుకున్న కథను బోల్డ్ గా చెప్పేందుకు ఏమాత్రం వెనకడుగు వేయడు.

ప్రభాస్ తో చేసే స్పిరిట్ సినిమాలో కూడా తన మార్క్ బోల్డ్ నెస్ చూపించాలని ఫిక్స్ అయ్యాడు సందీప్ వంగ. అయితే అతని సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ అనే సరికి ఆడియన్స్ సూపర్ ఎగ్జైట్ అవుతున్నారు. తను రాసుకునే బలమైన పాత్రలకు సందీప్ వంగ అందుకు తగిన నటులను ఎంపిక చేసుకుంటాడు. స్పిరిట్ కోసం కథానాయికగా కీర్తి సురేష్ సెలక్షన్ పై సందీప్ వంగ ప్లాన్ ఏంటన్నది తెలియాల్సి ఉంది.

ప్రభాస్ స్పిరిట్ కూడా పాన్ ఇండియా లెవెల్ లో భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. మొన్నటిదాకా సౌత్ సినిమాలకే పరిమితమైన కీర్తి సురేష్ బేబీ జాన్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అంతేకాదు ఈమధ్య గ్లామర్ రోల్స్ కూడా చేసేందుకు సై అనేస్తుంది. సో సందీప్ వంగ ప్రభాస్ కాంబోలో వస్తున్న స్పిరిట్ లో కీర్తి సురేష్ మెప్పిస్తుందని చెప్పొచ్చు. క్యారెక్టర్ ఏదైనా తన సత్తా చాటే మహానటి కీర్తి సురేష్. సో స్పిరిట్ లో ఆమె నిజంగానే ప్లేస్ అయితే అమ్మడి ఫ్యాన్స్ కి పండుగే అని చెప్పొచ్చు. ఓ పక్క కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తూ కమర్షియల్ సినిమాలకు కూడా రెడీ అంటున్న కీర్తి స్పిరిట్ లో ఛాన్స్ అందుకుంటే మాత్రం అమ్మడి రేంజ్ వేరే లెవెల్ కి వెళ్తుందని చెప్పొచ్చు.