Begin typing your search above and press return to search.

కీర్తి సురేష్ ని కొత్తగా చూడబోతున్నామా ?

ఆ సినిమా స‌క్సెస్ ..క‌ళావ‌తి రోల్ కీర్తి లో కొత్త ఛేంజ్ ని తీసుకొచ్చింది. ఇప్పుడు అమ్మ‌డు టాల‌వుడ్ తో పాటు బాలీవుడ్ సినిమాలు కూడా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   22 Feb 2024 12:30 PM GMT
కీర్తి సురేష్ ని కొత్తగా చూడబోతున్నామా ?
X

కీర్తి సురేష్ గ్లామ‌ర్ గేట్లు ఎత్తేసిందా? హీరోల స‌ర‌స‌న అన్ని ర‌కాలుగా సై అంటోందా? పెద‌వి ముద్దు లు..ఇంటిమేట్ స‌న్నివేశాలు...సీన్ ఏదైనా కీర్తి మార్క్ ప‌డాల్సిందేనా? అంటే అవున‌నే టాక్ వినిపిస్తుంది. ఇండ‌స్ట్రీకొచ్చిన కొత్త‌లో కీర్తి ఎలాంటి డీసెంట్ రోల్స్ పోషించిందో తెలిసిందే. మ‌హాన‌టి విజ‌యం త‌ర్వాత అలాగే ఇండ‌స్ట్రీలో కొనసాగాల‌ని మ‌రింత బ‌ల‌మైన నిర్ణ‌యం తీసుకుంది. కానీ ఆ కార‌ణంగా తాను ఎం కోల్పోయిందో త‌ర్వాతి కాలంలో అర్ధ‌మైంది.

ఎవ‌రూ అవ‌కాశాలివ్వ‌డానికి ముందుకు రావడంతో అమ్మ‌డికి విష‌యం అర్ద‌మై ఆ త‌ర్వాత త‌న నుంచి ద‌ర్శ‌క‌-నిర్మాత‌లు ఏది కోరుకుంటున్నారో? అర్దం చేసుకుని ట్రాక్ లోకి వ‌చ్చింది. ఈ క్ర‌మంలోనే స‌ర్కారు వారి పాట‌లో కాస్త గ్లామ‌ర్ డాల్ గా మెప్పించే ప్ర‌య‌త్నం చేసింది. ఆ సినిమా స‌క్సెస్ ..క‌ళావ‌తి రోల్ కీర్తి లో కొత్త ఛేంజ్ ని తీసుకొచ్చింది. ఇప్పుడు అమ్మ‌డు టాల‌వుడ్ తో పాటు బాలీవుడ్ సినిమాలు కూడా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. వాటితో పాటు వెబ్ సిరీస్ ల‌కు కూడా సైన్ చేస్తుంది.

మ‌రి టాలీవుడ్ లో చెల్లిన‌ట్లు బాలీవుడ్ లో చెల్ల‌దుగా! అందుకే అక్క‌డ పెద్ద‌గా స‌మ‌యం వృద్ధా చేయ‌కుం డానే విష‌యాన్ని అర్దం చేసుకుంది. అందుకే అన్ని ర‌కాలుగా గ్లామ‌ర్ గేట్లు ఓపెన్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం వ‌రుణ్ ధావ‌న్ తో క‌లిసి 'బేబి జాన్' లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో అమ్మ‌డు వ‌రుణ్ తో ఇంటిమేట్ స‌న్నివేశాలు..పెద‌వి ముద్దుల్లోనూ చెల‌రేగుతుంద‌ని స‌మాచారం. ఇప్ప‌టివ‌ర‌కూ ఈ త‌ర‌హా అటెంప్ట్ లు కీర్తి చేయ‌లేదు.

తెలుగు చాలా సినిమాలు చేసింది. కానీ ఏ హీరోతో లిప్ లాక్ స‌న్నివేశాల్లో న‌టించ‌లేదు. అక్క‌డ మేక‌ర్స్ డిమాండ్ చేయ‌లేదా? లేక కీర్తి న‌టించ‌ద‌ని సైలెంట్ గా ఉన్నారా? అన్న‌ది తెలియ‌దు గానీ బాలీవుడ్ మాత్రం కీర్తి ని మార్చేసింది. తొలిసారి అమ్మ‌డు లిప్ లాక్..ఇంటిమేట్ స‌న్నివేశాలు చేస్తోంది అక్క‌డ‌. అక్క అనే ఓ వెబ్ సిరీస్ కూడా చేస్తోంది. ఇందులో ఏకంగా హాట్ బాంబ్ రాధికా ఆప్టేతో పోడీ ప‌డి న‌టిస్తుంది. అందుకు అన్ని ర‌కాలుగా సంసిద్ద‌మ‌య్యే రంగంలోకి దిగింది. కాక‌పోతే కీర్తి ఈ విష‌యాలేవి రివీల్ చేయ‌లేదంతే.