Begin typing your search above and press return to search.

అక్క కోసం కీర్తి సుదీర్ఘ పోరాటం..!

ఒక వైపు సినిమాల్లో నటిస్తూనే మరో వైపు వెబ్‌ సిరీస్ కి ఈ అమ్మడు గ్రీన్ సిగ్నల్‌ ఇవ్వడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది

By:  Tupaki Desk   |   12 Dec 2023 5:20 AM GMT
అక్క కోసం కీర్తి సుదీర్ఘ పోరాటం..!
X

మహానటి సినిమా తర్వాత పాన్‌ ఇండియా క్రేజ్ ను దక్కించుకున్న ముద్దుగుమ్మ కీర్తి సురేష్. లేడీ ఓరియంటెడ్‌ సినిమాలకి మోస్ట్ వాంటెడ్ గా మారిన కీర్తి సురేష్ తాజాగా వెబ్‌ సిరీస్ కి రెడీ అయింది. చాలా రోజుల క్రితమే కీర్తి సురేష్ మరియు రాధిక ఆప్టే ప్రధాన పాత్రల్లో అక్క అనే వెబ్‌ సిరీస్ ను చేయబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చిన విషయం తెల్సిందే.

ఒక వైపు సినిమాల్లో నటిస్తూనే మరో వైపు వెబ్‌ సిరీస్ కి ఈ అమ్మడు గ్రీన్ సిగ్నల్‌ ఇవ్వడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. 'అక్క' కథ మరియు కథనం చాలా బాగా నచ్చడం వల్లే కీర్తి సురేష్ ఆ ప్రాజెక్ట్‌ కి గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చిందనే వార్తలు వస్తున్నాయి. తాజాగా ఆ వెబ్‌ సిరీస్ కి సంబంధించిన చిత్రీకరణ ప్రారంభిస్తున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు.

ముంబైలో 'అక్క' వెబ్‌ సిరీస్‌ కు సంబంధించిన ప్రొడక్షన్‌ వర్క్ షురూ అయ్యింది. అందులో పాల్గొనేందుకు గాను కీర్తి సురేష్ ముంబై చేరుకుంది. ఇప్పటికే రాధిక ఆప్టే కూడా జాయిన్‌ అయ్యిందని తెలుస్తోంది. ఇక ఈ సిరీస్ లో కీర్తి సురేష్ ను గతంలో ఎప్పుడు చూడని యాక్షన్ సన్నివేశాలు చేయబోతున్నట్లు సమాచారం అందుతోంది.

అన్ని వర్గాల వారిని మెప్పించే విధంగా 'అక్క' వెబ్‌ సిరీస్‌ ఉంటుందని, అంతే కాకుండా కీర్తి సురేష్‌, రాధిక ఆప్టే ల మధ్య సాగే సుదీర్ఘ యాక్షన్‌ సన్నివేశాలు కచ్చితంగా యూత్‌ ఆడియన్స్ కి నచ్చుతాయని అంటున్నారు. ఇద్దరు హీరోయిన్స్ మధ్య పోరాట సన్నివేశాలు అంటే కచ్చితంగా చాలా స్పెషల్‌ గా ఉండే అవకాశం ఉంది. కనుక ఈ సినిమా కచ్చితంగా మెప్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి.