ఎటూ తేల్చని కీర్తి సురేష్!
మహానటి సినిమాతో అభినవ సావిత్రిగా పేరు ప్రఖ్యాతులు సాధించిన అందాల తార కీర్తి సురేష్ బేబి జాన్ మూవీ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకోవడం తెలిసిందే.
By: Tupaki Desk | 27 May 2025 12:30 PMమహానటి సినిమాతో అభినవ సావిత్రిగా పేరు ప్రఖ్యాతులు సాధించిన అందాల తార కీర్తి సురేష్ బేబి జాన్ మూవీ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకోవడం తెలిసిందే. గత డిసెంబరులో ఆంటోని తట్టిల్‌ను పెళ్లి చేసుకున్నాక కీర్తి సురేష్ కొద్ది రోజులుగా సినిమాలకు, షూటింగ్‌లకు దూరంగా ఉంటుంది. అయితే, ఈ ఐదు నెలల విరామం మొత్తాన్ని పూరించడానికి సెకెండ్ ఇన్నింగ్స్‌లో వరుస సినిమాలు చేయడానికి ఈ ముద్దుగుమ్మ సీరియస్‌గా ప్లాన్ చేస్తుందని తెలుస్తోంది. కొన్ని వెబ్ షోస్‌తో పాటు తమిళ సినిమాల కోసం కీర్తి ఇటీవల చెన్నై, ముంబై, హైదరాబాద్ తరచూ తిరుగుతోంది.
ఐదారు సినిమాలు చేసేందుకు ఇప్పటికే సూత్రప్రాయంగా అంగీకారం తెలిపిన ఈ భామ ఒక స్ట్రయిట్ తెలుగు సినిమాకు మాత్రం ఏటూ తేల్చడం లేదని సమాచారం. బలగం మూవీ డైరెక్టర్ వేణు యెల్దండి చాలా కాలంగా ప్లాన్ చేస్తున్న ఎల్లమ్మ సినిమాలో లీడ్ రోల్ కోసం కీర్తి సురేష్‌ను సంప్రదించినట్టు సోషల్ మీడియాలో ఎప్పటినుంచో వార్తలు షికారు చేస్తున్నాయి. అయితే దీనిపై ఎల్లమ్మ టీమ్ నుంచి కానీ కీర్తి సురేష్ బృందం నుంచి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన ఇప్పటివరకు వెలువడలేదు.
గతంలో నేచరల్ స్టార్ నాని పక్కన దసరా సినిమాలో పక్కా తెలుగింటి అమ్మాయి పాత్ర పోషించి అభిమానులను మెప్పించిన కీర్తి మరోసారి అలాంటి పాత్ర చేస్తుందో లేదో చూడాలి. దసరా సినిమాలో కంటే ఎల్లమ్మ ప్రాజెక్టులోని క్యారెక్టర్ బోల్డ్, సంప్రదాయబద్ధంగా ఉండనుందని తెలుస్తోంది. అయితే, వేణు ఎల్లమ్మ ప్రాజెక్టులో చేస్తున్నట్టు కానీ చేయడం లేదని కానీ ఇప్పటివరకు కీర్తి సురేష్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడంతో ఈ పాత్రపై ఇంకా సోషల్ మీడియాలో బజ్ కొనసాగుతోంది.
మరోవైపు కీర్తి ఎల్లమ్మ ప్రాజెక్టు నుంచి దూరం జరిగినట్టు కూడా గట్టిగానే ప్రచారం జరుగుతోంది. కీర్తి తీరిక లేని షెడ్యూల్, డేట్స్ కారణంగా ఆమె ఎల్లమ్మ ప్రాజెక్టులో చేయలేనని చెప్పినట్టు టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో చిత్ర యూనిట్ కొత్త వారి కోసం అన్వేషణ కూడా ప్రారంభించినట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై ఎల్లమ్మ బృందం ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోవడంతో కీర్తి పాత్రపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. మరికొద్ది రోజులు వేచి చూస్తే తప్ప ఈ విషయంలో ఒక క్లారిటీ వచ్చేలా లేదు.