రౌడీ జనార్దన్ తో కళావతి ఫిక్సైందా!
కీర్తి సురేష్ నటిగా పుల్ బిజీగా ఉంది. తెలుగు, తమిళ్, హిందీ అంటూ మూడు భాషల్ని దున్నేస్తుంది.
By: Tupaki Desk | 19 May 2025 2:30 PMకీర్తి సురేష్ నటిగా పుల్ బిజీగా ఉంది. తెలుగు, తమిళ్, హిందీ అంటూ మూడు భాషల్ని దున్నేస్తుంది. అవకాశం రావడం ఆలస్యం అనే మాటకు ఛాన్స్ ఇవ్వకుండా పనిచేస్తుంది. హీరోయిన్ రోల్ అయినా.. .సిస్టర్ రోల్ అయినా సరే మనసుకు నచ్చిందంటే కమిట్ అవుతుంది. బాలీవుడ్ లో వెబ్ సిరీస్ లు సైతం చేస్తుంది. ప్రస్తుతం `అక్కా` అనే వెబ్ సిరీస్ లో బోల్డ్ గా నటిస్తుంది. పాత పద్దతిలో వెళ్తే పనవ్వదని గ్రహించిన అమ్మడు రూట్ మార్చి గ్లామర్ పాత్రలకు సైతం సై అనడంతోనే ఇదంతా సాధ్యమైంది.
టాలీవుడ్ లో అమ్మడు ఇంకా చాలా సినిమాలు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అక్కడా సిరీయస్ గానే ఫోకస్ చేస్తుంది. మహేష్, నాని లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. కానీ రామ్ చరణ్, ఎన్టీఆర్, బన్నీ లాంటి స్టార్లను మాత్రం ఇంకా అందుకోలేదు. వాళ్లతో ఛాన్స్ ఎప్పుడొస్తుందా? అని ఎదురు చూస్తుంది. ఈ నేపథ్యంలో అమ్మడికి వాళ్లతో ఛాన్స్ రాకపోయినా విజయ్ దేవరకొండతో నటించే అవకాశం వచ్చింది.
రవి కిరణ్ కోలా దర్శకత్వంలో విజయ్ హీరోగా ఓ సినిమా చేయననున్నాడు. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తు న్నారు. ఇందులో హీరోయిన్ గా కీర్తి సురేష్ ని తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇందులో కీర్తి రోల్ రొమాంటిక్ గా ఉంటుందిట. హీరోతో లిప్ లాక్ సన్నివేశాలుంటాయని వినిపిస్తుంది. ఇప్పటి వరకూ కీర్తి ఏ హీరోతో లిప్ లాక్ వేయలేదు.`సర్కారు వారి పాట`లో మహేష్ కి జోడీగా నటించింది.
ఆ సినిమాతోనే అమ్మడు రొమాంటిక్ గేట్లు ఓపెన్ చేసింది. అందులో లిప్ లాక్ సన్నివేశాలకు సంబంధించి మూవ్ మెంట్స్ మాత్రమే ఇచ్చింది. రౌడీ జనార్దన్లో మాత్రం రియల్ గానే లిప్ లాక్ వేసే వేస్తుందని విని పిస్తుంది. ప్రస్తుతం విజయ్ `కింగ్ డమ్` పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా రిలీజ్ అనంతరం `రౌడీ జనార్దన్` మొదలవుతుంది.