Begin typing your search above and press return to search.

కీర్తి సురేష్ ఉప్పు కప్పురంబు ట్రైలర్ టాక్..!

తెర మీద చూసే సినిమా కథలు కొన్నైతే ఓటీటీల కోసమే తెరకెక్కించే కథలు మరికొన్ని ఉంటాయి.

By:  Tupaki Desk   |   19 Jun 2025 9:59 PM IST
కీర్తి సురేష్ ఉప్పు కప్పురంబు ట్రైలర్ టాక్..!
X

తెర మీద చూసే సినిమా కథలు కొన్నైతే ఓటీటీల కోసమే తెరకెక్కించే కథలు మరికొన్ని ఉంటాయి. ప్రస్తుతం ప్రేక్షకుడు థియేటర్ కి వెళ్లి సినిమా చూసేందుకు అంతగా ఆసక్తి చూపించట్లేదు. ఓటీటీ సంస్థలు కూడా సినిమాలకు ధీటుగా ఒరిజినల్ కంటెంట్ తో వస్తున్నారు. వారిలో ప్రైమ్ వీడియో ప్రేక్షకులను అలరించే సినిమాలతో వెరైటీ కథలతో వస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రైమ్ వీడియోలో వస్తున్న మరో సినిమా ఉప్పుకప్పురంబు.

సుహాస్, కీర్తి సురేష్ లీడ్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమాను ఎల్లనార్ ఫిల్మ్స్ ప్రై లిమిటెడ్ బ్యానర్ పై రాధిక లావు నిర్మించగా సినిమాను అని.ఐ.వి.శశి దర్శకత్వం వహించారు. ఇంతకీ ఈ సినిమా కథ ఏంటంటే ఒక పల్లెటూరిలో స్మశానంలో చోటు తక్కువ కావడంతో అందులో స్థానం కోసం ఆ ఊరి జనమంతా పోటీపడుతుంటారు. కథ కాస్త విచిత్రంగానే ఉండగా ఆధ్యంతం ప్రేక్షకులను నవ్వించేలా ఎంటర్టైన్మెంట్ తో రాబోతుంది.

ఈ సినిమాలో బాబు మోహన్, శత్రుతో పాటుగా తాళ్లూరి రామేశ్వరి కూడా ఇతర కీలక పాత్రల్లో నటించారు. ప్రైం వీడియో ఈ సినిమాను 240 దేశాల్లో జూలై 4న రిలీజ్ చేస్తున్నారు. తెలుగుతో పాటుగా తమిళ్, మళయాళం, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ ఇలా 12 భాషలతో పాటుగా మరో 12 భాషల్లో సబ్ టైటిల్స్ తో రిలీజ్ చేస్తున్నారు.

ఈ సినిమాలో కీర్తి సురేష్ లుక్ బాగుంది.. ఆమె ఇందులో గ్రామాధికారి అపూర్వ పాత్రలో కనిపించనున్నారు. సుహాస్ కూడా తన పాత్రలో మెప్పించేలా ఉన్నాడు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఉప్పు కప్పురంబు సినిమా ట్రైలర్ కామెడీ, ఎమోషన్స్ రోలర్ కోస్టర్ రైడ్ లా ఉంది. ఐతే ట్రైలర్ కాస్త గజిబిజిగా అనిపించినా సినిమా మాత్రం ఆడియన్స్ ని అలరిస్తుందని అంటున్నారు.

వెరైటీ కథలు సినిమాలు ఎక్కడ వచ్చినా ఆదరించే ఆడియన్స్ ప్రైమ్ వీడియో నుంచి వస్తున్న ఈ ఉప్పు కప్పురంబు సినిమాను ఏమేరకు ఆదరిస్తారన్నది చూడాలి. ప్రైమ్ వీడియోలో వచ్చే ఒరిజినల్ కంటెంట్ సినిమాలకు విపరీతమైన ఫ్యాన్స్ ఉంటారు. మిగతా వాటిలానే ఉప్పు కప్పురంబు సినిమా కూడా అదే రేంజ్ రెస్పాన్స్ తెచ్చుకునే ఛాన్స్. కీర్తి సురేష్ నుంచి ఆఫ్టర్ షార్ట్ గ్యాప్ వస్తున్న సినిమా కాబట్టి ఆమె ఫ్యాన్స్ కి ఐతే ఈ సినిమా మంచి ట్రీట్ ఇస్తుందని చెప్పొచ్చు.