Begin typing your search above and press return to search.

కీర్తి మళ్లీ పికప్ అయ్యిందిగా..?

ఆల్రెడీ విజయ్ దేవరకొండతో రౌడీ జనార్ధన్ సినిమా చేస్తున్న కీర్తి సురేష్ బలగం వేణు చేస్తున్న ఎల్లమ్మ సినిమాలో కూడా నటిస్తుంది.

By:  Tupaki Desk   |   15 July 2025 8:15 AM IST
కీర్తి మళ్లీ పికప్ అయ్యిందిగా..?
X

మహానటి కీర్తి సురేష్ తెలుగులో మళ్లీ బిజీ అవుతుంది. నాని దసరా లో వెన్నెల పాత్రలో మెప్పించిన కీర్తి సురేష్ ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టినా నెక్స్ట్ వచ్చిన మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమాతో ఫ్లాప్ ఫేస్ చేసుకుంది. చిరు సినిమాలో సిస్టర్ రోల్ చేయడం అది కాత ఫ్లాప్ అవ్వడంతో కీర్తి సురేష్ కి ఇక తెలుగులో ఛాన్స్ లు కష్టమని అనుకున్నారు. కట్ చేస్తే అమ్మడు మళ్లీ ఇక్కడ తన ఫాం కొనసాగించే అవకాశాలు అందుకుంటుంది.

ఆల్రెడీ విజయ్ దేవరకొండతో రౌడీ జనార్ధన్ సినిమా చేస్తున్న కీర్తి సురేష్ బలగం వేణు చేస్తున్న ఎల్లమ్మ సినిమాలో కూడా నటిస్తుంది. ఈ సినిమాలు అమ్మడిని తెలుగులో మళ్లీ బిజీ అయ్యేలా చేశాయి. కీర్తి సురేష్ తిరిగి ఫాం లోకి రావడం ఆమె ఫ్యాన్స్ ని కూడా మెప్పిస్తుంది. అసలైతే పెళ్లి తర్వాత ఏ హీరోయిన్ అయినా కెరీర్ లో కొంత స్పీడ్ తగ్గుతుంది. కానీ అదేంటో కీర్తికి ఆఫ్టర్ మ్యారేజ్ కూడా అసలేమాత్రం జోరు తగ్గట్లేదు.

విజయ్, కీర్తి సురేష్ మహానటి సినిమాలో నటించారు. కానీ ఆ సినిమాలో ఇద్దరి మధ్య సీన్స్ లేవు. కానీ రౌడీ జనార్ధన్ సినిమాలో వీళ్లిద్దరు కలిసి జత కడుతున్నారు. విజయ్ తో సినిమా అంటే హీరోయిన్స్ తో లిప్ లాక్స్ లాంటివి ఉంటాయి. అసలే రౌడీ జనార్ధన్ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో వస్తుందని తెలుస్తుంది. మరి ఈ సినిమాలో కీర్తితో విజయ్ రొమాన్స్ ఎలా ఉండబోతుందో చూడాలి.

ఇక నితిన్ తో ఎల్లమ్మ సినిమాలో కూడా కీర్తి సురేష్ మెయిన్ రోల్ చేస్తుంది. నాని ఎల్లమ్మ ఒప్పుకోకపోవడానికి రీజన్ లో కథ హీరోయిన్ ఓరియెంటెడ్ గా ఉండటం వల్లే అని టాక్. సో ఎల్లమ్మ సినిమా కీర్తి సురేష్ కి మంచి మైలేజ్ ఇచ్చేలా ఉంది. ఈ రెండు సినిమాలు సక్సెస్ పడితే ఇక కీర్తి టాలీవుడ్ లో మళ్లీ టాప్ ప్లేస్ కి వెళ్లే ఛాన్స్ ఉంటుంది. పవన్, మహేష్ లాంటి హీరోలతో చేసినా కూడా తెలుగులో ఎందుకో కీర్తి అనుకున్నంత స్థాయికి వెళ్లలేదు. ఐతే రాబోతున్న సినిమాలు మాత్రం కీర్తి సురేష్ రేంజ్ పెంచేస్తాయని అంటున్నారు. మరి అదెలా జరుగుతుందో చూడాలి.