కీర్తి కోసం డబుల్ ప్యాకేజ్..?
మహానటి కీర్తి సురేష్ తెలుగులో కాస్త గ్యాప్ ఇచ్చినా మళ్లీ ఇక్కడ వరుస ప్రాజెక్ట్ లతో అలరించేందుకు రెడీ అయ్యింది.
By: Tupaki Desk | 30 Jun 2025 3:56 AMమహానటి కీర్తి సురేష్ తెలుగులో కాస్త గ్యాప్ ఇచ్చినా మళ్లీ ఇక్కడ వరుస ప్రాజెక్ట్ లతో అలరించేందుకు రెడీ అయ్యింది. దసరాతో సూపర్ హిట్ అందుకుని భోళా శంకర్ తో ఫ్లాప్ ఫేస్ చేసిన కీర్తి సురేష్ ఆ తర్వాత అటు తమిళ్, హిందీలో కూడా సినిమా చేసింది. ఐతే కీర్తి సురేష్ ని మళ్లీ తెలుగు తెర మీద అలరించేలా చేయాలని మేకర్స్ డిసైడ్ అయ్యారు. కీర్తి సురేష్ ఖాతాలో రెండు క్రేజీ ప్రాజెక్ట్ లు ఉన్నాయి. అందులో ఒకటి విజయ్ దేవరకొండ రౌడీ జనార్ధన్ ఒకటి కాగా మరోటి వేణు డైరెక్ట్ చేస్తున్న ఎల్లమ్మ ఉంది.
ఈ రెండు సినిమాల్లో కీర్తి సురేష్ కి మంచి రోల్ దక్కినట్టు తెలుస్తుంది. అంతేకాదు ఈ రెండు సినిమాలు ఒకే బ్యానర్ లో వస్తుండటం విశేషం. రౌడీ జనార్ధన్, ఎల్లమ్మ రెండు సినిమాలను నిర్మిస్తున్నారు స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు. ఆయన ఇలా ఒక హీరోయిన్ ని రెండు సినిమాల్లో తీసుకున్నారు అంటే సంథింగ్ స్పెషల్ అన్నట్టే లెక్క. ఎందుకంటే ఏదో ఒక సినిమాలో తీసుకున్నాం కదా అని మరో సినిమాలో కొనసాగిద్దాం అనుకునే టైప్ అయితే దిల్ రాజు కాదు.
రౌడీ జనార్ధన్ ఒక కమర్షియల్ సినిమా ఐతే ఆ సినిమాలో కూడా కీర్తి సురేష్ రోల్ కి ప్రాధాన్యత ఉన్నట్టు తెలుస్తుంది. ఇక మరోపక్క ఎల్లమ్మలో ఆమెదే మెయిన్ హైలెట్ రోల్ అని తెలుస్తుంది. ఎల్లమ్మ సినిమాలో కీర్తి సురేష్ రోల్ మరోసారి అవార్డ్ విన్నింగ్ తెప్పించేలా ఉంటుందని టాక్. సో ఈ రెండు సినిమాల వల్ల కీర్తి సురేష్ మళ్లీ టాలీవుడ్ లో బిజీ కానుంది.
అంతేకాదు ఈ రెండు సినిమాలకు కలిపి అమ్మడు భారీ రెమ్యునరేషన్ అందుకుంటుందని తెలుస్తుంది. కీర్తి సురేష్ తీసుకునే రెమ్యునరేషన్ కన్నా ఈ రెండిటికీ ఎక్కువ ఉందని తెలుస్తుంది. కీర్తి సురేష్ కోసం దిల్ రాజు డబుల్ ప్యాకేజ్ ఇస్తున్నట్టు తెలుస్తుంది. సో అటు సినిమాల పరంగా శాటిస్ఫ్యాక్షన్ తో పాటుగా ఇటు రెమ్యునరేషన్ పరంగా కూడా కీర్తి సురేష్ చాలా హ్యాపీ అని తెలుస్తుంది. తప్పకుండా కీర్తి సురేష్ కి ఈ సినిమాల వల్ల మంచి లాభం చేకూరుతుందేమో చూడాలి. కీర్తి సురేష్ ఫ్యాన్స్ కి మాత్రం ఈ రెండు సినిమాలు సూపర్ ట్రీట్ అందిస్తాయని తెలుస్తుంది.