మహానటి ఇక్కడ నిల్.. అక్కడ బిజీ
టాలీవుడ్‌లో పెద్దగా సినిమాల్లో అవకాశాలు లేకపోయినా కోలీవుడ్, బాలీవుడ్‌లో కీర్తి సురేష్ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.
By: Tupaki Desk | 1 April 2025 3:00 PM IST'మహానటి' సినిమాతో టాలీవుడ్‌తో పాటు పాన్ ఇండియా రేంజ్‌లో గుర్తింపు దక్కించుకున్న హీరోయిన్ కీర్తి సురేష్. మహానటి తర్వాత టాలీవుడ్‌లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసిన కీర్తి సురేష్ గత రెండేళ్లుగా కొత్త సినిమాలు చేయడం లేదు. ఈమె తెలుగులో చివరగా దసరా సినిమాలో హీరోయిన్‌గా నటించింది. నానితో కలిసి నటించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అయినా కూడా కీర్తి సురేష్‌కి టాలీవుడ్ నుంచి స్టార్ హీరోల సినిమాల్లో నటించే అవకాశాలు దక్కడం లేదు. ఒకటి రెండు చిన్న సినిమాల్లో ఛాన్స్ వచ్చినా వాటిని కీర్తి సున్నితంగా తిరస్కరించిందని తెలుస్తోంది. స్టార్ హీరోలు కీర్తి సురేష్‌ను హీరోయిన్‌గా పరిగణలోకి తీసుకోవడం లేదు అనేది సినీ విశ్లేషకుల మాట.
టాలీవుడ్‌లో పెద్దగా సినిమాల్లో అవకాశాలు లేకపోయినా కోలీవుడ్, బాలీవుడ్‌లో కీర్తి సురేష్ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. కోలీవుడ్‌లో ప్రస్తుతం ఈమె రెండు సినిమాలు చేస్తోంది. మరో రెండు సినిమాలకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని సమాచారం అందుతోంది. పెళ్లి తర్వాత కూడా కోలీవుడ్‌లో మోస్ట్ బిజీ హీరోయిన్‌గా కొనసాగుతోంది. తమిళ్ స్టార్ హీరోలకు జోడీగా నటించే అవకాశాలను ఈ అమ్మడు సొంతం చేసుకుంటుంది. తెలుగులో మాత్రం ఈమెకు స్టార్ హీరోల నుంచి పిలుపు రావడం లేదు. మరో వైపు బాలీవుడ్‌లోనూ ఈమె వరుసగా సినిమాల్లో నటించేందుకు రెడీ అవుతోంది. ఈ అమ్మడు బాలీవుడ్‌లో బేబీ జాన్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.
తమిళ్ సూపర్ హిట్ సినిమాకు రీమేక్‌గా వచ్చిన 'బేబీ జాన్' సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడింది. దాంతో బాలీవుడ్‌లో ఈమెకు ఆఫర్లు రాకపోవచ్చు అనే అభిప్రాయం వ్యక్తం అయింది. కానీ బేబీ జాన్ ఫలితంతో సంబంధం లేకుండా వెంటనే అక్క అనే వెబ్ సిరీస్‌లో రాధిక ఆప్టేతో కలిసి నటించే అవకాశంను సొంతం చేసుకుంది. త్వరలోనే అక్క వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతుంది. మరో వైపు రివాల్వర్ రీటా గాను కీర్తి సురేష్ కనిపించబోతుంది. బాలీవుడ్‌లో సీరియస్‌గా ప్రయత్నాలు చేస్తున్న కీర్తి సురేష్‌కి ఏకంగా రణబీర్ కపూర్‌కి జోడీగా నటించే అవకాశాలు దక్కాయనే వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ మీడియాలో ఈ విషయమై ప్రముఖంగా కథనాలు వస్తున్నాయి.
కీర్తి సురేష్ హిందీ కమర్షియల్‌కి సెట్ కాకపోవచ్చు అనే అభిప్రాయంను మొదట్లో చాలా మంది వ్యక్తం చేశారు. నార్త్ హీరోయిన్స్ మాదిరిగా ఈ అమ్మడు పెద్దగా స్కిన్ షో చేయదు. పైగా రొమాంటిక్ సీన్స్‌లో నటించదు. కనుక బాలీవుడ్ సినిమాల్లోనే కాకుండా సౌత్ సినిమా ఇండస్ట్రీలోనూ ఎక్కువ కాలం కొనసాగడం కష్టం అనే అభిప్రాయంను కొందరు వ్యక్తం చేశారు. కానీ కీర్తి సురేష్ జోరు చూస్తూ ఉంటే బాలీవుడ్‌లో రాబోయే రోజుల్లో వరుసగా సినిమాలు చేసే అవకాశాలు ఉన్నాయి. రణబీర్ కపూర్‌తో సినిమా కన్ఫర్మ్ అయిందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో రాబోయే రెండేళ్లలో కీర్తి సురేష్ హిందీ సినిమా ఇండస్ట్రీలో అర డజనుకు పైగా సినిమాలకు కమిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. టాలీవుడ్‌లో ఆఫర్లు లేని ఈ రీల్ మహానటికి బాలీవుడ్, కోలీవుడ్‌లో ఫుల్ బిజీగా ఆఫర్లు చేతిలో ఉన్నాయి. రాబోయే రోజుల్లోనూ అక్కడ బిజీ బిజీగా సినిమాలు చేసే అవకాశాలు ఉన్నాయి.
