డిమాండ్ చేయకపోయినా కీర్తి కెరీర్ ఇంకా అలాగే!
హీరోయిన్ గా సక్సెస్ అయితే పారితోషికం పరంగా వాళ్ల డిమాండ్ ఎలా ఉంటుందన్నది చెప్పాల్సిన పని లేదు.
By: Tupaki Desk | 1 July 2025 12:00 AM ISTహీరోయిన్ గా సక్సెస్ అయితే పారితోషికం పరంగా వాళ్ల డిమాండ్ ఎలా ఉంటుందన్నది చెప్పాల్సిన పని లేదు. హీరోయిన్ అడిగినంత నిర్మాత ఇవ్వాల్సిందే. ఇంకా అదనంగా ఖర్చులు భరించాలి. ఒక్క రూపాయి కూడా వదలకుండా ముక్కుపిండి మరీ వసూల్ చేస్తారు. ఈ విషయంలో హీరోయిన్లు అంతా దాదాపు ఒకే తీరున ఉంటారు. హీరోయిన్ల తీరుతో విసిగిన నిర్మాతలెంతో మంది. వచ్చిన ఫిర్యాదులు ఎన్నో ఉన్నాయి.
అలాగని అందరూ డబ్బు కోసమే పనిచేసే హీరోయిన్లు కారు. కొంత మంది కథా బలం ఉన్న చిత్రాల మోజులో పారితోషికం గురించి పెద్దగా పట్టించుకోరు. అలాంటి వాళ్లలో కీర్తి సురేష్ ఒకరని తెలుస్తోంది. `మహానటి` తర్వాత కీర్తి ఎంత పెద్ద స్టార్ అయిందన్నది చెప్పాల్సిన పనిలేదు. నిజంగా ఆనాటి మహాన టిని అభిమానించినట్లే తెలుగు ప్రేక్షకులు కీర్తిని అభిమానించారు. దీంతో తనకంటూ ప్రత్యేకమైన ప్యాన్ బేస్ ఏర్పడింది.
కానీ ఆ క్రేజ్ ను మాత్రం కీర్తి ఏమాత్రం ఎన్ క్యాష్ చేసుకోలేదు అన్నది అంతే వాస్తవం. కీర్తి స్థానంలో మరో నటి ఉంటే? కోట్ల రూపాయలు వెనకేసింది. కానీ కీర్తి మాత్రం ఆ ఛాన్స్ తీసుకోలేదు. ఎందుకలా? అని ప్రశ్నిస్తే తాను కేవలం కథకు..అందులో పాత్రకు మాత్రమే ప్రాధాన్యతి ఇస్తానంది. తాను ఏ సినిమా చేసిన ఆ రెండు చూసే సైన్ చేస్తానంది. పారితోషికం అన్నది చివర్లో డిస్కస్ చేసే అంశంగా చెప్పింది.
దీంతో కీర్తి డబ్బు ఉమెన్ కాదని అర్దమవుతుంది. సాధరణంగా ఏ హీరోయిన్ అయినా ముందు పారితోషికం గురించి మాట్లాడుతారు. ఆ తర్వాతే కథ గురించి డిస్కషన్ మొదలవుతుంది. కీర్తి తరహాలోనే మృణాల్ ఠాకూర్ కూడా డబ్బుకంటే కథకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తుంది. అందుకే వాళ్లకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.
