Begin typing your search above and press return to search.

కీర్తి సురేష్‌ పెళ్లి తర్వాత... అరుదైన ఘనత!

హిందీలో సౌత్‌ హీరోయిన్స్‌కు పెద్దగా ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఇవ్వరు అనే అభిప్రాయం ఉంది.

By:  Tupaki Desk   |   3 July 2025 11:00 AM IST
కీర్తి సురేష్‌ పెళ్లి తర్వాత... అరుదైన ఘనత!
X

'మహానటి' ఫేం కీర్తి సురేష్ గత ఏడాది మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాలీవుడ్‌లో ఈమె 'బేబీ జాన్‌' సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. చాలా ఆశలు, అంచనాలు పెట్టుకుని చేసిన ఆ సినిమా బాక్సాఫీస్‌ వద్ద బొక్కబోర్లా పడింది. దాంతో కీర్తి సురేష్ బాలీవుడ్‌ జర్నీ సాగడం సాధ్యం కాదని అంతా భావించారు. కానీ అనూహ్యంగా బాలీవుడ్‌లో ఈ అమ్మడికి సినిమా ఆఫర్లతో పాటు, వెబ్‌ సిరీస్‌ ఆఫర్లు వరుసగా వస్తున్నాయి. ఇప్పటికే వెబ్‌ సిరీస్‌తో రెడీగా ఉంది. అతి త్వరలోనే ఆ వెబ్‌ సిరీస్‌ను స్ట్రీమింగ్‌ చేసే అవకాశాలు ఉన్నాయి. అంతే కాకుండా రెండు హిందీ సినిమాలు చర్చల దశలో ఉన్నాయని ఆమె సన్నిహితులు స్వయంగా చెబుతున్నారు.

హిందీలో సౌత్‌ హీరోయిన్స్‌కు పెద్దగా ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఇవ్వరు అనే అభిప్రాయం ఉంది. కానీ కీర్తి సురేష్ మాత్రం మొదటి సినిమాతో ఫ్లాప్‌ను చవిచూసినా కూడా మంచి ఆఫర్లను సొంతం చేసుకుంటోంది. అంతే కాకుండా కీర్తి సురేష్ ఈ మధ్య కాలంలో పెళ్లి చేసుకున్న విషయం కూడా తెల్సిందే. పెళ్లి తర్వాత సౌత్‌ హీరోయిన్స్ కాస్త తగ్గుతారు. చాలా మంది హీరోయిన్స్ పెళ్లి తర్వాత ఆఫర్లు కోల్పోవడం లేదంటే వారే కావాలని సినిమాలను తగ్గించుకోవడం మనం చూస్తూ ఉంటాం. కానీ కీర్తి సురేష్ విషయంలో అలా జరగడం లేదు. కీర్తి సురేష్ వరుసగా సినిమాలను చేయడం ద్వారా తన సత్తా చాటుతూనే ఉంది. తాజాగా మరోసారి ఈ అమ్మడి జోరు కనిపిస్తుంది.

ప్రస్తుతం హిందీలో ఒక వెబ్‌ సిరీస్‌, రెండు సినిమాలు కీర్తి చేతిలో ఉన్నాయి. ఇక సౌత్‌లోనూ అంతే బిజీగా ఉంది. తమిళంలో ఈమె ఓకే చెప్పాలే కానీ మూడు నాలుగు సినిమాలు వెంటనే షూటింగ్‌ మొదలు అయ్యయే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే తమిళ్‌లో రెండు సినిమాలు షూటింగ్‌ దశలో ఉన్నాయి, మరో రెండు మూడు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. తమిళనాట ఫుల్‌ బిజీగా ఉన్న కీర్తి సురేష్ తెలుగులో చాలా కాలం తర్వాత ఒక ఆఫర్‌ ను సొంతం చేసుకుంది. ఆ సినిమాకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. మరో వైపు విజయ్‌ దేవరకొండ సినిమాలోనూ కీర్తి సురేష్‌ను ఎంపిక చేసేందుకు గాను చర్చలు జరుగుతున్నాయనే వార్తలు వస్తున్నాయి.

సాధారణంగా హీరోయిన్స్‌ ముఖ్యంగా సౌత్‌ హీరోయిన్స్‌ పెళ్లి అయిన తర్వాత ఇండస్ట్రీలో మెల్ల మెల్లగా కనుమరుగవడం మనం చూస్తూ ఉంటాం. కానీ కీర్తి సురేష్ విషయంలో మాత్రం అలా జరగడం లేదు. పెళ్లి అయిన ఏడాది లోపే ఏకంగా అర డజను సినిమాలకు కమిట్‌ అయింది. ముందు ముందు మరిన్ని సినిమాలను ఈ అమ్మడు చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. పెళ్లి తర్వాత ఇలా వరుస సినిమాల్లో నటించడం అనేది సౌత్‌లో అరుదుగా చూస్తూ ఉంటాం. నయనతార తర్వాత కీర్తి సురేష్‌కి ఈ అరుదైన ఘనత దక్కింది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు, ప్రేక్షకులు అంటున్నారు. కీర్తి సురేష్ తెలుగు లో ఎక్కువ సినిమాలు చేయాలని ఇప్పటికీ ఆమె ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.