వీడియో: కీర్తి కొంటె అల్లరి వేషాలు చాలు
ఇదిగో ఇలా ఫేస్ ప్యాక్ తో రీఫ్రెష్ మెంట్ కి సిద్ధమైన కీర్తిని తథేకంగా చూస్తున్న ఈ పప్పీ (బొచ్చుకుక్క) కీర్తి అల్లరి వేషాలను తట్టుకోలేకపోతోంది.
By: Tupaki Desk | 24 July 2025 8:30 AM ISTమహానటిగా ప్రజల హృదయాలను గెలుచుకుంది కీర్తి సురేష్. తనదైన అద్భుత నటనాభినయంతో మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఇటీవల పెద్ద హీరోల సరసన కమర్షియల్ సినిమాల్లో నటిస్తూనే, వీలున్నప్పుడు నటనకు ఆస్కారం ఉన్న పాత్రలతోను మెప్పిస్తోంది. వృత్తిగతంగా కీర్తిలోని అన్ని కోణాలను చూస్తున్న ప్రజలకు వ్యక్తిగతంగా కీర్తి ఎలా ఉంటుందో తెలిసింది తక్కువే.
ఇటీవలే తన దుబాయ్ స్నేహితుడిని పెళ్లాడిన కీర్తి విదేశీ విహార యాత్రలతో బిజీ బిజీగా ఉంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక అందమైన వీడియో క్లిప్ ని షేర్ చేసింది. ఈ క్లిప్ లో తన హబ్బీ కనిపించలేదు కానీ, క్యూట్ పెట్ డాగ్స్ తనను అనుసరిస్తూ కనిపించాయి. కీర్తి ఆటలాడిస్తుంటే అవి బుద్ధిగా ఆడుతూ కనిపించాయి.
ఇదిగో ఇలా ఫేస్ ప్యాక్ తో రీఫ్రెష్ మెంట్ కి సిద్ధమైన కీర్తిని తథేకంగా చూస్తున్న ఈ పప్పీ (బొచ్చుకుక్క) కీర్తి అల్లరి వేషాలను తట్టుకోలేకపోతోంది. కీర్తి తన ముఖ కవళికలకు అనుగుణంగా ఈ పప్పీ కూడా కళ్లు, ముఖాన్ని తిప్పుతూ ఆటలాడుతోంది. ఆ ఇద్దరి వేషాలు చూస్తున్న మరో బుల్లి పప్పీ కూడా వింతగా అవే వేషాలు వేస్తూ కనిపించింది. మొత్తానికి ఈ ఫన్నీ వీడియో ఇంటర్నెట్ లో జోరుగా వైరల్ అవుతూ హృదయాలను గెలుచుకుంటోంది.
కెరీర్ మ్యాటర్ కి వస్తే, ఇటీవలే ఉప్పుకప్పురంబు అనే చిత్రంతో అభిమానుల ముందుకు వచ్చింది. తదుపరి రివాల్వర్ రీటా, కన్నివేడి అనే రెండు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. రివాల్వర్ రీటా ఆగస్టులో విడుదల కానుంది.
