Begin typing your search above and press return to search.

మహానటి బల్క్ డేట్స్.. ఆ ప్రాజెక్ట్ కోసమేనా..?

ఐతే ఎల్లమ్మ సినిమాకు ముందు మరొక హీరోయిన్ ని అనుకోగా ఆమెకు డేట్స్ అడ్జెస్ట్ అయ్యేలా లేవని కీర్తి సురేష్ ని ఫిక్స్ చేశారు.

By:  Tupaki Desk   |   9 May 2025 5:11 PM
మహానటి బల్క్ డేట్స్.. ఆ ప్రాజెక్ట్ కోసమేనా..?
X

బలగం వేణు రెండో సినిమాగా ఎల్లమ్మని ఫిక్స్ చేసుకున్నాడు. కమెడియన్ డైరెక్టర్ అయితే ఏదో అతని పంథాలోనే ఒక కామెడీ సినిమా చేస్తాడని అనుకుంటే బలగం లాంటి ఒక మంచి ఎమోషనల్ డ్రామాని తీసి ఆడియన్స్ హృదయాలను గెలిచాడు వేణు. అప్పటి నుంచి పైకి అంత సరదాగా కనిపించే వేణు లో ఇంత సీరియస్ ఎమోషన్ ఉందా అనేలా చేశాడు. తనకు ఇచ్చిన బడ్జెట్ కి పూర్తి స్థాయిలో న్యాయం చేయడమే కాదు బ్లాక్ బస్టర్ బలగం ఇచ్చినందుకు వేణుకి రెండో సినిమా భారీ ఆఫర్ ఇచ్చాడు దిల్ రాజు.

అందుకే ఎల్లమ్మ సినిమాను వేణు నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్ తో తెస్తున్నాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసిన ఎల్లమ్మ సినిమా లో నితిన్ తో పాటు కీర్తి సురేష్ ఫిమేల్ లీడ్ గా నటిస్తుందని తెలుస్తుంది. ఐతే ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర చాలా కీలకమని తెలుస్తుంది. అందుకే మహానటి కీర్తి సురేష్ బల్క్ డేట్స్ తీసుకుంటున్నారట. అందుకు తగినట్టుగానే కీర్తి సురేష్ రెమ్యునరేషన్ కూడా ఇస్తున్నారని తెలుస్తుంది.

బేబీ జాన్ అంటూ బాలీవుడ్ లో మొదటి అటెంప్ట్ చేసిన కీర్తి అది కాస్త షాక్ ఇచ్చే సరికి మళ్లీ సౌత్ సినిమాల మీదే ఫోకస్ చేస్తుంది. తెలుగులో దసరాతో హిట్ కొట్టిన కీర్తి సురేష్ భోళా శంకర్ తో నిరాశపరచింది. ఆ తర్వాత సినిమాలు చేయలేదు. ఐతే ఎల్లమ్మ సినిమాకు ముందు మరొక హీరోయిన్ ని అనుకోగా ఆమెకు డేట్స్ అడ్జెస్ట్ అయ్యేలా లేవని కీర్తి సురేష్ ని ఫిక్స్ చేశారు. తప్పకుండా కీర్తి సురేష్ కి ఇది గొప్ప అవకాశమని చెప్పొచ్చు.

ఎల్లమ్మ సినిమా కోసం కీర్తి సురేష్ బల్క్ డేట్స్ ని లాక్ చేస్తున్నారట. సినిమాలో నితిన్ కన్నా ఎక్కువ డేట్స్ ఆమెవే ఉండేట్టు కనిపిస్తున్నాయి. ఈ నెల చివర్లో షూటింగ్ మొదలు పెట్టనున్న ఎల్లమ్మ సినిమాను నెక్స్ట్ ఇయర్ సమ్మర్ కి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. దిల్ రాజు ఎల్లమ్మ సినిమాను స్పెషల్ ఇంట్రెస్ట్ తో తెరకెక్కిస్తున్నట్టు అర్థమవుతుంది. కీర్తి సురేష్ ఎల్లమ్మతో పాటు తమిళ్ లో ఒక సినిమాకు సైన్ చేసింది. ఈ సినిమాలతో మరోసారి తన టాలెంట్ చూపించాలని ఫిక్స్ అయ్యింది అమ్మడు.