కీర్తి సురేష్ రెండేళ్లు బిజీ బిజీ..!
ఇక నితిన్ లీడ్ రోల్ లో వేణు డైరెక్ట్ చేయబోతున్న ఎల్లమ్మ సినిమాలో కూడా కీర్తి సురేష్ నటిస్తుంది. ఈ సినిమాలో అయితే కీర్తి సురేషే మెయిన్ లీడ్ అంటున్నారు.
By: Tupaki Desk | 28 Jun 2025 9:15 AM ISTపెళ్లైనా కూడా తన దూకుడు ఏమాత్రం తగ్గించట్లేదు మహానటి కీర్తి సురేష్. ఆమె చేస్తున్న సినిమాలు అన్నీ కూడా క్రేజీగా ఉన్నాయి. కోలీవుడ్ లో ఒకటి రెండు సినిమాలు చేస్తున్న కీర్తి సురేష్ తెలుగులో రెండు భారీ సినిమాలకు సైన్ చేసింది. అందులో ఒకటి విజయ్ దేవరకొండ రౌడీ జనార్థన్ కాగా రెండో సినిమా వేణు యెల్దండి చేస్తున్న ఎల్లమ్మ. విజయ్ తో ఆల్రెడీ మహానటిలో నటించింది కీర్తి సురేష్ ఐతే ఆ సినిమాలో ఇద్దరు కలిసి ఉన్న సీన్స్ లేవు.
మహానటి సినిమాలో ఆంటోని అనే జర్నలిస్ట్ పాత్రలో విజయ్ దేవరకొండ నటించాడు. సో అలా చూస్తే విజయ్ దేవరకొండ కీర్తి సురేష్ కలిసి నటించే సినిమా ఇదే అవుతుంది. రవికిరణ్ కోలా డైరెక్షన్ లో తెరకెక్కుతున్న రౌడీ జనార్థన్ సినిమా రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ సినిమాగా వస్తుంది. ఈ సినిమా కోసం కీర్తి సురేష్ ఎక్కువ డేట్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది.
ఇక నితిన్ లీడ్ రోల్ లో వేణు డైరెక్ట్ చేయబోతున్న ఎల్లమ్మ సినిమాలో కూడా కీర్తి సురేష్ నటిస్తుంది. ఈ సినిమాలో అయితే కీర్తి సురేషే మెయిన్ లీడ్ అంటున్నారు. సినిమాలో ఆమె టైటిల్ రోల్ పోషిస్తుందని తెలుస్తుంది. అంతేకాదు మరోసారి కీర్తి సురేష్ కి నేషనల్ అవార్డ్ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చే స్కోప్ ఉన్న పాత్ర ఇది అని తెలుస్తుంది. ఎల్లమ్మ సినిమా కోసం కీర్తి సురేష్ బల్క్ డేట్స్ అడిగినట్టు టాక్. ఎలాగు పేరు తెచ్చిపెట్టే పాత్ర కాబట్టి కీర్తి సురేష్ కూడా సినిమాకు కావాల్సినంత సపోర్ట్ ఇచ్చేలా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.
విజయ్ దేవరకొండ రౌడీ జనార్థన్, నితిన్ ఎల్లమ్మ రెండు సినిమాలు కూడా భారీ అంచనాలతో తెరకెక్కనున్నాయి. ఈ రెండు సినిమాల కోసం కీర్తి సురేష్ రెండేళ్ల పాటు డేట్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ రెండేళ్లు కూడా టాలీవుడ్ లోనే కీర్తి సురేష్ బిజీ బిజీ కానుంది. తప్పకుండా ఈ రెండు సినిమాలతో కీర్తి సురేష్ మళ్లీ తన నటనా ప్రతిభ చాటుతుందని అంటున్నారు. ఎల్లమ్మ సినిమా ఐతే సంథింగ్ స్పెషల్ గా ఉండబోతుందని తప్పకుండా కీర్తి నటన గురించి అందరు మాట్లాడుకునేలా ఉంటుందని అంటున్నారు. మరి మహానటికి ఈ సినిమాలు ఏమేరకు సపోర్ట్ అవుతాయన్నది చూడాలి.
