Begin typing your search above and press return to search.

పిక్‌టాక్‌ : ఆ జ్ఞాపకాల్లోనే ఇంకా కీర్తి సురేష్‌

'మహానటి' ఫేం కీర్తి సురేష్ ఈ మధ్య కాలంలో సినిమాల్లో కంటే ఎక్కువగా సోషల్‌ మీడియాలో కనిపిస్తుంది. గత ఏడాది మూడు సినిమాలతో వచ్చిన ఈ అమ్మడికి కమర్షియల్‌గా బిగ్‌ సక్సెస్ దక్కలేదు.

By:  Tupaki Desk   |   11 Jun 2025 3:20 PM IST
పిక్‌టాక్‌ : ఆ జ్ఞాపకాల్లోనే ఇంకా కీర్తి సురేష్‌
X

'మహానటి' ఫేం కీర్తి సురేష్ ఈ మధ్య కాలంలో సినిమాల్లో కంటే ఎక్కువగా సోషల్‌ మీడియాలో కనిపిస్తుంది. గత ఏడాది మూడు సినిమాలతో వచ్చిన ఈ అమ్మడికి కమర్షియల్‌గా బిగ్‌ సక్సెస్ దక్కలేదు. ముఖ్యంగా గత ఏడాది ఈమె బాలీవుడ్‌లో బేబీ జాన్‌ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్న కీర్తి సురేష్‌కి నిరాశ మిగిలింది. తమిళ సూపర్‌ హిట్‌ మూవీకి రీమేక్‌గా బేబీ జాన్‌ రూపొందిన విషయం తెల్సిందే. సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశ పరచినా కూడా హిందీ ప్రేక్షకుల్లో కీర్తి సురేష్‌కి మంచి ఇమేజ్‌ను తెచ్చి పెట్టింది. అందుకే వెంటనే హిందీలో మరో సినిమాను చేసే అవకాశం దక్కించుకుంది. త్వరలోనే కీర్తి సురేష్ హిందీ సినిమా పట్టాలెక్కబోతుంది.


సినిమాల్లో మాత్రమే కాకుండా వెబ్‌ సిరీస్‌ల్లోనూ ఈ అమ్మడు నటిస్తున్న విషయం తెల్సిందే. త్వరలోనే కీర్తి సురేష్ నటించిన అక్క వెబ్‌ సిరీస్‌ స్ట్రీమింగ్‌ కాబోతుంది. రాధిక ఆప్టే తో కలిసి ఆ వెబ్‌ సిరీస్‌లో కీర్తి సురేష్ స్క్రీన్‌ షేర్‌ చేసుకోబోతుంది. సినిమా ఇండస్ట్రీలో ఈ అమ్మడి యొక్క జోరు తగ్గుతుందా అనే అనుమానం వచ్చిన ప్రతిసారి తన అందమైన ఫోటోలను షేర్‌ చేయడంతో పాటు, పెద్ద హీరోల సినిమాల్లో నటించడం ద్వారా తన స్టార్‌డంను చాటుకుంటూ ఉంది. తాజాగా మరోసారి కీర్తి సురేష్‌ తన అందమైన ఫోటోలను షేర్‌ చేసింది. అయితే ఈ ఫోటోలు రీసెంట్‌వి కావని, ఇంతకు ముందు మేము మాల్దీవ్స్‌కి వెళ్లిన సమయంలో తీసుకున్న ఫోటోలు అని ఆమె స్వయంగా చెప్పుకొచ్చింది.


కీర్తి సురేష్ పెళ్లి చేసుకున్న తర్వాత భర్తతో కలిసి మాల్దీవ్స్‌కి వెళ్లింది. అక్కడ హనీమూన్‌ ను చాలా రోజుల పాటు ఎంజాయ్‌ చేసిన కీర్తి సురేష్ దంపతులు తిరిగి వచ్చారు. అయినా కూడా అక్కడ నుంచి మనసు మాత్రం రావడం లేదు అంటూ కీర్తి సురేష్ తాజాగా ఈ ఫోటోలను షేర్‌ చేసింది. మాల్దీవ్స్‌ లో గడిపిన రోజులను గుర్తు చేసుకుంటూ కీర్తి సురేష్ ఫోటోలను షేర్ చేసింది. బౌతికంగా ఇక్కడ ఉన్నా కూడా మనసు మాత్రం అక్కడే ఉంది అంటూ ఈ ఫోటోలను షేర్ చేయడం ద్వారా అందరి దృష్టిని కీర్తి సురేష్ ఆకర్షించింది. ఆ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్న కీర్తి సురేష్ మరోసారి తన అందమైన ఫోటోలను అందరితో షేర్‌ చేసుకోవడంతో వైరల్‌ అయింది.


ఈమధ్య కాలంలో కీర్తి సురేష్ సినిమాల్లో ఎక్కువ నటించడం లేదు అనే విమర్శలు వస్తున్నాయి. ఆమె పెళ్లి తర్వాత స్కిన్‌ షో కి రెడీ అవుతోంది. సోషల్‌ మీడియాలో అందాల షో చేస్తున్న కీర్తి సురేష్ వెండి తెరపై అదే స్థాయిలో స్కిన్‌ షో చేస్తే చూడాలని ఆశ పడుతున్న వారు చాలా మంది ఉన్నారు. తాజాగా మాల్దీవ్స్ ఫోటోలను షేర్ చేసిన కీర్తి సురేష్ మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. స్టైలిష్ లుక్‌తో పాటు, చిల్‌ మూడ్‌లో ఉన్న అందాల కీర్తి సురేష్‌ ను ఈ ఫోటోల్లో చూడవచ్చు. క్లీ వేజ్‌ షో తో పాటు, అందంగా, క్యూట్‌ గా కనిపిస్తున్న కీర్తి సురేష్‌ ఫోటోలు తెగ వైరల్‌ అవుతున్నాయి.