Begin typing your search above and press return to search.

రావిపూడి నెక్స్ట్.. హీరోయిన్ల విషయంలో సవాల్ తప్పదా?

ఎందుకంటే వెంకీ- కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ లో కీర్తి సురేష్, కృతి శెట్టి హీరోయిన్లుగా ఖరారైనట్టు సమాచారం.

By:  M Prashanth   |   26 March 2026 7:25 PM IST
రావిపూడి నెక్స్ట్.. హీరోయిన్ల విషయంలో సవాల్ తప్పదా?
X

టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి మళ్లీ డబుల్ కపుల్స్ కాన్సెప్ట్‌ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. గతంలో వెంకటేష్, వరుణ్ తేజ్‌లతో తెరకెక్కించిన ఎఫ్ 2, ఎఫ్ 3 సినిమాలు భారీ విజయాలు సాధించాయి. ఆ చిత్రాల్లో హీరోయిన్లు తమన్నా, మెహరీన్‌ ల గ్లామర్, కామెడీ టైమింగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా వారి మేనరిజమ్స్, ఎనర్జీ సినిమా హైలైట్‌ గా నిలిచాయి.

ఇప్పుడు అదే తరహాలో మరోసారి ఇద్దరు హీరోలతో సినిమాను ప్లాన్ చేస్తున్నారు అనిల్ రావిపూడి. ఈసారి వెంకటేష్‌తో పాటు కల్యాణ్ రామ్ నటించనున్నట్లు కొన్ని రోజుల క్రితమే ప్రకటించారు. అయితే ఆ ప్రాజెక్ట్‌ పై ఇప్పటికే ఇండస్ట్రీలో మంచి హైప్ ఏర్పడింది. అయితే ఈసారి హీరోయిన్ ఎంపికలో దర్శకుడికి సవాల్ ఎదురవ్వనున్నట్లు తెలుస్తోంది.

ఎందుకంటే వెంకీ- కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ లో కీర్తి సురేష్, కృతి శెట్టి హీరోయిన్లుగా ఖరారైనట్టు సమాచారం. ఇద్దరూ టాలెంటెడ్ హీరోయిన్లు అయినప్పటికీ, ఎఫ్ 2- ఎఫ్ 3 సినిమాల్లో తమన్నా, మెహరీన్ సెట్ చేసిన స్టాండర్డ్‌ ను మ్యాచ్ చేయడం పెద్ద సవాల్‌ గా మారింది. అందుకే లేటెస్ట్ సినిమా విషయంలో అనిల్ రావిపూడిపై మరింత బాధ్యత పడింది.

ఎఫ్ 2, ఎఫ్ 3 చిత్రాల్లో తమన్నా, మెహరీన్ పాత్రలు కేవలం గ్లామర్‌ కే పరిమితం కాకుండా కథలో కీలకంగా మారాయి. వారి కామెడీ, ఎమోషన్ మిక్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీంతో కొత్త సినిమాలో కీర్తి సురేష్, కృతి శెట్టి పాత్రలు కూడా అంతే స్ట్రాంగ్ గా ఉండాలని అభిమానులు ఆశిస్తున్నారు. అయితే కీర్తి సురేష్ ఇప్పటికే నేషనల్ అవార్డు గెలుచుకున్న హీరోయిన్. ఆమెకు ఎమోషనల్ సీన్స్ లో మంచి పట్టు ఉంది.

మరోవైపు కృతి శెట్టి యూత్‌ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. గ్లామర్‌ తో పాటు స్క్రీన్ ప్రెజెన్స్‌ లోనూ మంచి మార్కులు తెచ్చుకుంది. ఆ ఇద్దరిని సరైన విధంగా వినియోగిస్తే సినిమా మరింత ఆకట్టుకునే అవకాశముంది. ఇక దర్శకుడు అనిల్ రావిపూడి కామెడీ హ్యాండ్లింగ్‌ లో స్పెషలిస్ట్‌గా పేరుంది. ఆయన సినిమాల్లో క్యారెక్టర్లు స్పష్టంగా గుర్తుండేలా డిజైన్ చేస్తారు.

అందుకే ఈసారి కూడా హీరోయిన్ల పాత్రలు వినూత్నంగా తీర్చిదిద్దుతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ప్రేక్షకుల్లో ప్రధానంగా ఉన్న సందేహం ఏమిటంటే.. కీర్తి- కృతి తమన్నా, మెహరీన్‌లను మించగలరా? లేదా అనేదే. ఏదేమైనా ఆ సినిమా అనిల్ రావిపూడికి మరో పరీక్షగా మారనుంది. కథ, కామెడీతో పాటు హీరోయిన్ క్యారెక్టర్ల ప్రాధాన్యతను ఎలా బ్యాలెన్స్ చేస్తారన్నది కీలకంగా మారింది. కీర్తి, కృతిని ప్రేక్షకులకు కొత్తగా చూపించగలిగితే ప్రాజెక్ట్ సక్సెస్ దిశగా వెళ్లే అవకాశముంది. లేదంటే తమన్నా, మెహరీన్లతో పోలికలు తప్పవు.