ఆ మాట దిల్ రాజు చెప్పాలంటోంది!
కీర్తి సురేష్ తెలుగులో కనిపించి దాదాపు రెండేళ్లవుతోంది. మెగాస్టార్ నటించిన `భోళా శంకర్`తో ప్రేక్షకుల ముందుకొచ్చింది.
By: Tupaki Desk | 20 Jun 2025 12:03 PMకీర్తి సురేష్ తెలుగులో కనిపించి దాదాపు రెండేళ్లవుతోంది. మెగాస్టార్ నటించిన `భోళా శంకర్`తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. రీసెంట్‌గా తన చిరకాల మిత్రుడు, ప్రేమికుడిని పెళ్లిచేసుకున్న కీర్తి మళ్లీ సినిమాల విషయంలో జోరు పెంచింది. టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్‌తో కలిసి కీర్తి సురేష్ నటించిన లేటెస్ట్ మూవీ `ఉప్పు కప్పురంబు`. ఐవీ శశి రూపొందించిన ఈ మూవీ సెటైరికల్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కింది. అయితే ఇది థియేట్రికల్ రిలీజ్ కావడం లేదు. `రఘుతాత` తరహాలో ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది.
ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియలో జూలై 4 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సందర్‌భంగా హైదరాబాద్‌లో ఈ మూవీ ట్రైలర్‌ని విడుదల చేశారు. ఈ సందర్భంగా కీర్తి సురేష్ మాట్లాడుతూ `ఇంత వరకు వచ్చిన డార్క్ కామెడీ సినిమాలకు పూర్తి భిన్నంగా సాగే సినిమా ఇది. ఒక సీరియస్ విషయాన్ని చాలా ఫన్నీగా ఇందులో చెప్పాం` అని తెలిపింది. ఇదిలా ఉంటే ఈ సందర్భంగా కీర్తిసురేష్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
ఇదిలా ఉంటే రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా దిల్ రాజు నిర్మించబోతున్న `రౌడీ జనార్ధన`లో కీర్తిసురేష్ నటిస్తోందని, విజయ్‌తో తను రొమాన్స్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో నిజమెంత అని మీడియా అడిగిన ప్రశ్నకు కీర్తి సురేష్ స్పందించిన తీరు ఆసక్తిని రేకెత్తిస్తోంది. విజయ్ దేవరకొండ - రవికిరణ్ కోలా కాంబినేషన్‌లో రూపొందనున్న సినిమాలో మీరు నటిస్తున్నారా? అని ప్రశ్నిస్తే లేదని చెప్పకుండా `దిల్ రాజు చెబుతారు` అంటూ స్పందించడంతో రౌడీ అభిమానులు ఖుషీ అవుతున్నారు.
తను చెప్పిన సమాధానంలోనే అసలు విషయం ఉందని, `రౌడీ జనార్ధన`లో తను నటిస్తోందని స్పష్టమైందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. `రౌడీ జనార్ధన`లో కీర్తి సురేష్ నటిస్తోందని త్వరలోనే దిల్ రాజు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని తెలిసింది. ఇప్పటి వరకు కీర్తిసురేష్, విజయ్ దేరవకొండ కలిసి నటించలేదు. కానీ రెండు సినిమాల్లో మాత్రం నటించారు. మహానటిలో విజయ్ దేవరకొండ నటించిన విషయం తెలిసిందే. ఇక నాగ్ అశ్విన్ నిర్మించిన `జాతిరత్నాలు`లోనూ వీరిద్దరు గెస్ట్ క్యారెక్టర్లలో వేరు వేరుగా కనిపించి ఆకట్టుకున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరు కలిసి నటించనున్న తొలి సినిమా `రౌడీ జనార్థన` కాబోతోంది.