Begin typing your search above and press return to search.

పిక్‌టాక్ : స్టార్‌ హీరోయిన్‌ ఏఐ పిక్చర్స్ వైరల్‌

ఈమధ్య కాలంలో ఏఐ టూల్స్ ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి. చాట్‌ జీపీటీ, గ్రోక్‌తో పాటు చాలా ఏఐ టూల్స్‌ అందుబాటులోకి వచ్చాయి.

By:  Tupaki Desk   |   1 April 2025 4:14 PM IST
పిక్‌టాక్ : స్టార్‌ హీరోయిన్‌ ఏఐ పిక్చర్స్ వైరల్‌
X

ఈమధ్య కాలంలో ఏఐ టూల్స్ ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి. చాట్‌ జీపీటీ, గ్రోక్‌తో పాటు చాలా ఏఐ టూల్స్‌ అందుబాటులోకి వచ్చాయి. కొన్నింట్లో ఉన్న పీచర్స్ చూస్తే మతి పోతుంది. చాట్ జీపిటీలో గిబ్లి ఫోటో మేకింగ్‌ పీచర్‌ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు గిబ్లిలో తమ ఫోటోలను చూసుకుని మురిసి పోతున్నారు. కొందరి ఫోటోలను గిబ్లి చేసిన సమయంలో గుర్తు పట్టలేనంత వింతగా ఉంటున్నాయి. కానీ కొన్ని ఫోటోలు మాత్రం చాలా నేచురల్‌గా ఉంటున్నాయి. గిబ్లిలో వచ్చిన ఆర్టిస్టిక్‌ ఫోటోలను సోషల్‌ మీడియాలో తమ వారితో షేర్‌ చేసుకుంటున్న నెటిజన్స్‌ ఎంతో మంది ఉన్నారు. తాజాగా కీర్తి సురేష్ సైతం తన ఫోటోలను షేర్‌ చేసింది.


మనం రియల్‌ ఫోటోలను గిబ్లికి ఇస్తే అది ఆర్ట్‌ వేసినట్లుగా, కార్టూన్‌ లుక్‌లో ఇలా రకరకాలుగా మనకు ఫోటోలను అందిస్తుంది. కీర్తి సురేష్ తన ఫోటోలను గిబ్లి లో వేసి వచ్చిన ఫోటోలను షేర్‌ చేసింది. తన రెగ్యులర్‌ డే లో షూటింగ్‌ అంటూ గిబ్లి ఫోటోలను తయారు చేసి షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. కొన్ని ఫోటోల్లో కీర్తి సురేష్ మాదిరిగా లేదు అనిపించినా ఎక్కువ శాతం ఫోటోల్లో కీర్తి సురేష్ మాదిరిగానే క్యూట్‌గా ఉంది అనిపిస్తుంది. కీర్తి సురేష్ ఫోటోలు అని చెప్పకుంటే ఎవరు గుర్తు పట్టరేమో.. కానీ కీర్తి సురేష్‌ అని చెప్తే కచ్చితంగా ఔను నిజంగానే అలాగే ఉంది, అంత క్యూట్‌గా ఉంది అంటారు అనడంలో సందేహం లేదు.


సోషల్‌ మీడియాలో రెగ్యులర్‌గా తన అందమైన ఫోటోలను షేర్‌ చేస్తూ వార్తల్లో నిలవడం, సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతూ ఉండటం కీర్తి సురేష్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ ఏఐ టూల్‌ను వినియోగించి గిబ్లి ఫోటోలను తయారు చేసి షేర్‌ చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. క్యూట్‌ ఎక్స్‌ ప్రెషన్స్‌తో తన స్నేహితులతో కలిసి గిబ్లి ఫోటోలను షేర్ చేయడం ద్వారా వార్తల్లో నిలిచిన కీర్తి సురేష్ వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇటీవల పెళ్లి చేసుకున్న ఈ అమ్మడు స్లో అవుతుందని అనుకుంటే, గతంతో పోల్చితే ఇప్పుడు మరింత స్పీడ్‌ పెంచింది. అంతే కాకుండా ఇంతకు ముందుతో పోల్చితే స్కిన్‌ షో విషయంలో కీర్తి పట్టు విడుపులు ప్రదర్శిస్తుందనే టాక్‌ వినిపిస్తుంది.


బాలీవుడ్‌లో బేబీ జాన్ సినిమాతో అడుగు పెట్టిన కీర్తి సురేష్‌కి నిరాశే మిగిలింది. అయినా లక్కీగా అక్క అనే వెబ్‌ సిరీస్‌తో పాటు మరో వెబ్‌ సిరీస్‌ను ఈమె కమిట్‌ అయింది. మరో వైపు తమిళ్‌లో ఈమె రెండు మూడు సినిమాల్లో నటిస్తున్న విషయం తెల్సిందే. తెలుగులో మాత్రం ఈమెకు పెద్దగా ఆఫర్లు రావడం లేదు. దసరా సినిమా తర్వాత ఇప్పటి వరకు ఈమె తెలుగు లో సినిమాను చేయలేదు. హీరోయిన్‌గా ఈమెకి చిన్నా చితకా ఆఫర్లు వచ్చినా పెద్దగా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. తెలుగు ప్రేక్షకులు ఈమె రీ ఎంట్రీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.