Begin typing your search above and press return to search.

మహానటిలో ఆ టాలెంట్ కూడానా..?

మహానటి సినిమాతో జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది కీర్తి సురేష్. మలయాళ యాక్ట్రెస్ అయిన ఆమె తెలుగు, తమిళ భాషల్లో ఎక్కువ సినిమాలు చేస్తూ వస్తుంది.

By:  Tupaki Desk   |   2 Dec 2025 9:00 PM IST
మహానటిలో ఆ టాలెంట్ కూడానా..?
X

మహానటి సినిమాతో జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది కీర్తి సురేష్. మలయాళ యాక్ట్రెస్ అయిన ఆమె తెలుగు, తమిళ భాషల్లో ఎక్కువ సినిమాలు చేస్తూ వస్తుంది. కెరీర్ లో అప్స్ అండ్ డౌన్ కామనే కాబట్టి తనను తాను ఎప్పటికప్పుడు ఎంకరేజ్ చేసుకుంటూ సత్తా చాటుతుంది కీర్తి సురేష్. దసరా, భోళా శంకర్ తర్వాత తెలుగు ఆడియన్స్ కు కాస్త దూరమైన ఈ అమ్మడు మళ్లీ విజయ్ దేవరకొండతో రౌడీ జనార్ధన్ సినిమాతో వస్తుంది. అంతేకాదు మరో రెండు సినిమాలు డిస్కషన్ స్టేజ్ లో ఉన్నాయి.

డైరెక్షన్ డ్రీమ్ గురించి కీర్తి సురేష్..

ఐతే లేటెస్ట్ గా రివాల్వర్ రీటా సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చింది కీర్తి సురేష్. ఒక డిఫరెంట్ అటెంప్ట్ గా చేసిన ఈ ప్రయత్నం ఓకే అనిపించినా కమర్షియల్ గా కీర్తి సురేష్ కి అంత కిక్ ఇవ్వలేదు. ఈ సినిమా ప్రమోషన్స్ లో కీర్తి సురేష్ తన డైరెక్షన్ డ్రీమ్ గురించి చెప్పుకొచ్చింది. నటిగా ఇప్పటికే తనను తాను ప్రూవ్ చేసుకున్న కీర్తి సురేష్ తనలో దర్శకత్వం చేసే ప్రతిభ కూడా ఉందని అంటుంది.

కొన్ని కథలు చెప్పాలని ఉంది.. ఏమో ఫ్యూచర్ లో డైరెక్షన్ చేసినా చేయొచ్చు అన్నట్టు చెప్పుకొచ్చింది కీర్తి సురేష్. సో తనలో నటిమణి మాత్రమే కాదు మంచి కథకుడు కూడా ఉన్నాడన్నమాట. హీరోయిన్ గా నటించి ఆ తర్వాత డైరెక్షన్ చేసిన వారు చాలామంది ఉన్నారు. అలాంటి వారి దారిలోనే కీర్తి సురేష్ తన టాలెంట్ చూపించే ఛాన్స్ ఉంటుంది.

ఫ్యూచర్ లో ఛాన్స్ లు లేవనుకున్న టైంలో మెగా ఫోన్..

ఐతే కీర్తి డైరెక్షన్ ఇప్పుడప్పుడే ఆ స్టెప్ తీసుకునే అవకాశం ఉండదు. ఎందుకంటే ఆమె నటిగా ఫుల్ బిజీగా ఉంటుంది. ఫ్యూచర్ లో ఇక ఛాన్స్ లు లేవనుకున్న టైం లో తన కథలతో ఆమె మెగా ఫోన్ పట్టే అవకాశం ఉంటుంది. కీర్తి సురేష్ మాత్రం తనకు ఇలాంటి ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ ఉందన్న విషయం చెప్పి ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేసింది.

తెలుగు, తమిళ్ లో దాదాపు స్టార్స్ అందరితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న కీర్తి సురేష్ కెరీర్ లో ఇంకా గొప్ప పాత్రలు చేయాలి.. గొప్ప నటిగా పేరు తెచ్చుకోవాలని ఉందని అంటుంది. అందుకు తగినట్టుగానే తన సినిమాల ఎంపిక జరుగుతుందని అంటుంది. మొత్తానికి కీర్తి హీరోయిన్ గా ఛాన్స్ లు లేకపోయినా తనలో ఉన్న డైరెక్షన్ టాలెంట్ తో ఆడియన్స్ ని మెప్పించాలని చూస్తుంది. ఇది ఓ విధంగా మెచ్చుకోదగిన అంశమే అని చెప్పొచ్చు.

కీర్తి సురేష్ సౌత్ లోనే కాదు బాలీవుడ్ ఆడియన్స్ ని తన టాలెంట్ తో మెప్పిస్తుంది. హిందీలో మొదటి ప్రయత్నంగా చేసిన బేబీ జాన్ వర్క్ అవుట్ కాలేదు. ఈమధ్యనే అమ్మడి నెక్స్ట్ సినిమా ఓకే అయినట్టు తెలుస్తుంది. ఈసారి అమ్మడు థ్రిల్లర్ సినిమాతో బీ టౌన్ ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేయాలని చూస్తుంది.