Begin typing your search above and press return to search.

కీర్తి పారితోషికం ఈక్వెష‌న్..వాళ్లంతా నోర్ముసేలా!

తాజాగా కీర్తి సురేష్ పారితోషికం విష‌యంలో ఓ కొత్త ఈక్వెష‌న్ తెర‌పైకి తెచ్చింది.

By:  Tupaki Desk   |   1 July 2025 5:40 AM
కీర్తి పారితోషికం ఈక్వెష‌న్..వాళ్లంతా నోర్ముసేలా!
X

హీరోల‌తో స‌మానంగా పారితోషికాలు హీరోయిన్ల‌కు ఇవ్వాల‌నే డిమాండ్ చాలా కాలంగా ఉంది. ముఖ్యంగా బాలీవుడ్ హీరోయిన్లు కొంత మంది ఈ విష‌యంలో గ‌ట్టిపోరాట‌మే చేస్తున్నారు. దీపికా ప‌దుకొణే, విద్యా బాల‌న్, క‌రీనా క‌పూర్, అలియాభ‌ట్ , క‌త్రినా కైఫ్ లాంటి భామ‌లు ప‌బ్లిక్ గానే డిమాండ్ చేసారు. హీరోల‌కు ఏ విషయంలో త‌క్కువ? మేల్ డామినేటెడ్ ఇండ‌స్ట్రీలో ఇక మార్పులు రావా? ఎందుకు ఈ వివ‌క్ష అనే అంశాన్ని తెర‌పైకి తెచ్చిన సంద‌ర్భాలు కోకొల్ల‌లు.

వీళ్ల‌ను మించి టైర్ 2 భామ‌లైతే మ‌రింత‌గా త‌మ గ‌ళాన్ని వినిపించారు. తాజాగా కీర్తి సురేష్ పారితోషికం విష‌యంలో ఓ కొత్త ఈక్వెష‌న్ తెర‌పైకి తెచ్చింది. ఒక హీరో ని చూసి ప్రేక్ష‌కులు థియేట‌ర్ కు ఎలా వ‌స్తారో? అదే స్థాయిలో హీరోయిన్ ని చూసి ప్రేక్ష‌కులు థియేటర్ కు వ‌చ్చిన‌ప్పుడు స‌మాన పారితోషికం అడిగితే బాగుంటుంది? అలాంటి వాళ్ల‌కు క‌చ్చితంగా డిమాండ్ చేసే అధికారం ఉంటుంద‌ని త‌న అభిప్రాయంగా చెప్పుకొచ్చింది.

త‌న వ‌ర‌కూ పారితోషికం అన్న‌ది లాస్ట్ ఆప్ష‌న్ గా ఉంటుందంది. ముందుగా క‌థ‌, అందులో త‌న పాత్ర ఎలా ఉంటుందో చూస్తాను త‌ప్ప పారితోషికం ఎంత చెల్లిస్తారు? అన్న‌ది ఏనాడు ఆలోచించ‌లేదంది. ఇప్ప‌టి వ‌ర‌కూ క‌మిట్ అయిన సినిమాల విష‌యంలో ఇదే రూల్ పాటించాన‌ని..భ‌విష్య‌త్ లోనూ ఇలాగే ఉంటాన‌ని తెలిపింది. మృణాల్ ఠాకూర్ కూడా కీర్తి విధానంలోనే సినిమాలు చేస్తోంది. డ‌బ్బు కంటే చేసే పాత్ర‌కు ప్రాధాన్య‌త ఇస్తుంది.

వీళ్లిద్ద‌రు ఇండ‌స్ట్రీలో రేర్ పీస్ లు. చాలా మంది భామ‌లు పారితోషికం త‌ర్వాత పాత్ర‌ల గురించి చ‌ర్చిస్తుం టారు. పాత్ర ఎంత గొప్ప‌దైనా న‌చ్చిన పారితోషికం చెల్లించ‌క‌పోతే నిర్మొహ‌మాటంగా ఆ ప్రాజెక్ట్ ను వ‌దులు కుంటారు. ఈ విష‌యంలో నిర్మాత‌లు కూడా త‌క్కువేం కాదు. డిమాండ్ ఉన్న వాళ్ల వైపే మెగ్గు చూపడంతో వాళ్లు కొండెక్కి కూర్చుంటారు. ఇండ‌స్ట్రీలో ఈ విధానం మారాల‌ని దిల్ రాజు ఎప్ప‌టిక‌ప్పుడు హెచ్చ‌రిస్తూనే ఉంటారు.