Begin typing your search above and press return to search.

గ్యాప్ ను బ్యాలెన్స్ చేయ‌బోతున్న కీర్తి

అయితే ఉప్పు క‌ప్పురంబు సినిమా థియేట‌ర్ల‌లో కాకుండా నేరుగా ఓటీటీలో రిలీజ్ కానుంది.

By:  Tupaki Desk   |   19 Jun 2025 10:00 PM IST
గ్యాప్ ను బ్యాలెన్స్ చేయ‌బోతున్న కీర్తి
X

మ‌హాన‌టి సినిమాతో తిరుగులేని న‌టిగా ప్రూవ్ చేసుకున్న కీర్తి, కెరీర్ బాగా ర‌న్ అవుతున్న టైమ్ లో పెళ్లి చేసుకుని మ్యారేజ్ లైఫ్ లోకి అడుగుపెట్టింది. పెళ్లికి ముందు కీర్తి సురేష్ బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తూ చేసిన బేబీ జాన్ సినిమాలో కెరీర్లో ఎన్న‌డూ లేనంతగా గ్లామ‌ర్ ఒలక‌బోసింది. కానీ ఆ సినిమా ఫ్లాప్ అవ‌డంతో కీర్తి చేసిన గ్లామ‌ర్ షో మొత్తం వేస్ట్ అయిపోయింది.

బేబీ జాన్ తో పాటూ పెళ్లికి ముందు కీర్తి చేసిన అక్క వెబ్ సిరీస్ లో కూడా అమ్మ‌డు కాస్త హాట్ గానే క‌నిపించ‌నుంద‌ని తెలుస్తోంది. అయితే పెళ్లి త‌ర్వాత కొన్నాళ్ల పాటూ మ్యారేజ్ లైఫ్ ను ఎంజాయ్ చేయాల‌నే ఉద్దేశంతో రెస్ట్ లో ఉన్న కీర్తి ఇప్పుడు మ‌ళ్లీ కెరీర్ ను ఫుల్ స్పీడ్ లో పరుగులు పెట్టించాల‌ని చూస్తోందట‌. అందులో భాగంగానే మ‌ళ్లీ త‌న కెరీర్ పై ఫోక‌స్ చేయ‌బోతుంద‌ని తెలుస్తోంది.

బాక్సాఫీస్ వ‌ద్ద వ‌చ్చిన గ్యాప్ ను బ్యాలెన్స్ చేయ‌డానికి కీర్తి వ‌రుస సినిమాల‌తో ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించ‌బోతున్న‌ట్టు స‌మాచారం. అందులో భాగంగానే లేడీ ఓరియెంటెడ్ సినిమాగా తెర‌కెక్కిన రివాల్వ‌ర్ రీటా సినిమాను ఆగ‌స్ట్ 27న రిలీజ్ చేయ‌నున్న‌ట్టు రీసెంట్ గా అనౌన్స్‌మెంట్ వ‌చ్చింది. దీని కంటే ముందుగా సుహాస్ తో చేసిన ఉప్పు క‌ప్పురంబు సినిమాతో ఆడియ‌న్స్ ను ప‌ల‌క‌రించ‌నుంది కీర్తి.

అయితే ఉప్పు క‌ప్పురంబు సినిమా థియేట‌ర్ల‌లో కాకుండా నేరుగా ఓటీటీలో రిలీజ్ కానుంది. జులై 4 నుంచి ప్రైమ్ వీడియోలో ఉప్పు క‌ప్పురంబు స్ట్రీమింగ్ కు రానున్న‌ట్టు మేక‌ర్స్ రీసెంట్ గానే అనౌన్స్ చేశారు. అక్క సిరీస్ ను కూడా నెట్‌ఫ్లిక్స్ త్వ‌ర‌లోనే రిలీజ్ చేయాల‌ని చూస్తోన్న‌ట్టు తెలుస్తోంది. అవి కాకుండా త‌మిళంలో క‌న్నివీడి చేస్తోంది. అలాగే విజ‌య్ దేవ‌ర‌కొండ రౌడీ జ‌నార్ధ‌న‌, బ‌ల‌గం వేణు ఎల్ల‌మ్మ‌లో కూడా కీర్తి ఆల్మోస్ట్ ఫైన‌ల్ అయింద‌ని టాక్. వీటితో పాటూ బాలీవుడ్ లో కూడా కీర్తి ఓ సినిమా చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. మొత్తానికి కీర్తి సురేష్ బ్యాక్ టూ బ్యాక్ సినిమాల‌తో త్వ‌ర‌లోనే ఆడియ‌న్స్ ను అల‌రించ‌బోతుంది.