Begin typing your search above and press return to search.

స‌వాళ్ల మ‌ధ్య క‌ళావ‌తి ప్ర‌యాణం!

కీర్తి సురేష్ అలియాస్ క‌ళావ‌తి జ‌ర్నీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. అమ్మ‌డు ఇప్పుడు తెలుగు, హిందీ, త‌మిళ్ అంటూ మూడు భాష‌ల్లోనూ సినిమాలు చేస్తోంది.

By:  Tupaki Desk   |   26 May 2025 9:11 AM
స‌వాళ్ల మ‌ధ్య క‌ళావ‌తి ప్ర‌యాణం!
X

కీర్తి సురేష్ అలియాస్ క‌ళావ‌తి జ‌ర్నీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. అమ్మ‌డు ఇప్పుడు తెలుగు, హిందీ, త‌మిళ్ అంటూ మూడు భాష‌ల్లోనూ సినిమాలు చేస్తోంది. అద‌నంగా బాలీవుడ్ లో వెబ్ సిరీస్ ల్లో కూడా న‌టిస్తోంది. కెరీర్ ఆరంభంలో విధించుకున్న నియ‌మ నిబంధ‌ల‌ను ప‌క్క‌న‌బెట్టి ప‌ని చేస్తోంది. గ్లామ‌ర్ కం రొమాంటిక్ పాత్ర‌ల‌కు సైతం సై అంటోంది. ఇండ‌స్ట్రీ తన నుంచి ఏ కోరుకుంటుందో వంద శాతం అదే ఇవ్వడానికి త‌న వంతు ప్ర‌య‌త్నం చేస్తోంది.

వివాహం త‌ర్వాత ఎన్నో మార్పులు చేసింది. భ‌ర్త నుంచి అన్నిర‌కాలుగా మ‌ద్ద‌తు ల‌భిస్తోంది. దీంతో కీర్తీ కెరీర్ లో మ‌రింత‌గా ఉన్న‌త శిఖ‌రాలు చేరుకోవ‌డానికి అన్ని ర‌కాలు ప్ర‌య‌త్నాలు చేస్తోంది. రేయింబ‌వ‌ళ్లు షూటింగ్ ల్లో పాల్గొంటుంది. హైద‌రాబాద్ టూ ముంబై, చెన్నై అంటూ ప‌రుగులు తీస్తోంది. అవ‌స‌ర‌మైతే రెండు షిప్టులు ప‌నిచేస్తోంది. తాజాగా ఈ ప్ర‌యాణాన్ని ఉద్దేశించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది.

ఒకేసారి మూడు భాష‌ల్లో ప‌నిచేయ‌డం అన్న‌ది ఎంతో స‌వాల్ తో కూడుకున్న ప‌నిగా పేర్కొంది. అయినా న‌చ్చిన ప‌న‌ని మ‌న‌స్పూర్తిగా స్వీక‌రించి ప‌ని చేస్తున్న‌ట్లు తెలిపింది. ఇలా ప‌నిచేయ‌డం వ‌ల్ల న‌ట‌నా ఫ‌రిదిని విస్త‌రించిన‌ట్లు అవుతుందంది. కెరీర్ లో స‌వాళ్లు త‌న‌కు కొత్త కాద‌ని...ఆరంభంలోనే ఎన్నో ఛాలెంజిగ్ రోల్స్ పోషించిన‌ట్లు గుర్తు చేసుకుంది.

ఇప్ప‌టికే టాలీవుడ్...కోలీవుడ్ లో ఫేమ‌స్ అయిన నేప‌థ్యంలో బాలీవుడ్ సినిమాల‌పై మ‌రింత ఏకాగ్ర‌త‌తో ప‌ని చేస్తోంది. కొత్త అవ‌కాశాలు వెతికి ప‌ట్టుకుంటుంది. `అక్క` అనే వెబ్ సిరీస్ లో న‌టిస్తోంది. ఇందులో బోల్డ్ బ్యూటీ రాధికా ఆప్టేతో పోటీ ప‌డి మ‌రీ న‌టిస్తోంది. హిందీలో ఇటీవ‌లే మ‌రో చిత్రానికి ఒకే చెప్పింది. త‌మిళ్ లో `రివాల్వ‌ర్ రీటా` లో న‌టిస్తోంది. తెలుగులో మ‌రో రెండు కొత్త చిత్రాల‌కు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చింది.