Begin typing your search above and press return to search.

ఓల్డ్ ఈజ్ గోల్డ్..పెద్దాయ‌న కుమ్మేస్తున్నాడే!

సీనియ‌ర్ హీరోల నుంచి యంగ్ హీరోల వ‌ర‌కూ ప్ర‌తీ ఒక్క‌రికి కీర‌వాణి కావాలి? అన్న‌ట్లు స‌న్నివేశం క‌నిపిస్తుంది.

By:  Tupaki Desk   |   28 Feb 2024 1:30 PM GMT
ఓల్డ్ ఈజ్ గోల్డ్..పెద్దాయ‌న కుమ్మేస్తున్నాడే!
X

'బాహుబ‌లి' త‌ర్వాత సంగీత ద‌ర్శ‌కుడిగా రిటైర్మెంట్ ఇచ్చేస్తాన‌ని స్టేట్ మెంట్ ఇచ్చిన మ్యూజిక్ లెజెండ్ కీర‌వాణి త‌ర్వాత అదే వృత్తితో ఎంత బిజీ అయ్యారో చూస్తూనే ఉన్నాం. 'బాహుబ‌లి' త‌ర్వాత 'ఆర్ ఆర్ ఆర్' సంగీతం బాధ్య‌త‌లు తీసుకుని ఏకంగా ఇండియాకి ఆస్కార్ నే తెచ్చేసారు. 'నాటు నాటు' పాట‌తో ప్ర‌పంచాన్నే షేక్ చేసారు. ఈ మ‌ధ్య‌లో ఎన్నో సినిమాల‌కు సంగీతం అందించారు.


ప్ర‌స్తుతం ఆయ‌న మేనియా ఎంత‌లా కొనసాగుతుందంటే? అది మాటల్లో చెప్ప‌డం సాధ్యం కానిద‌నే చెప్పాలి. సీనియ‌ర్ హీరోల నుంచి యంగ్ హీరోల వ‌ర‌కూ ప్ర‌తీ ఒక్క‌రికి కీర‌వాణి కావాలి? అన్న‌ట్లు స‌న్నివేశం క‌నిపిస్తుంది. అంతా ఆయ‌న సంగీతంలో ఒక్క సినిమా అయినా ప‌నిచేయాల‌ని ఆశ‌ప డుతున్నారు. నాటు నాటు కి అవార్డు రావ‌డంతో? ఆయ‌న ఖ్యాతి మ‌రింత రెట్టింపు అయింది.

ఇత‌ర భాష‌ల ద‌ర్శ‌కులు సైతం కీర‌వాణి తో ప‌నిచేయాల‌ని ఆశ‌ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న మ‌ళ్లీ కోలీవుడ్ లోనూ సినిమాలు చేయ‌డం మొద‌లు పెట్టారు. ప్ర‌స్తుతం కీర‌వాణి చేతిలో అర‌డ‌జ‌న‌కు పైగా సినిమాలున్నాయి. ఇటీవ‌లే 'నా సామిరంగ‌'కు సంగీతం అందించారు. సంక్రాంతికి రిలీజ్ అయిన ఆ సినిమా మంచి విజ‌యం సాధించింది. అంద‌కుముందు చేసిన 'బింబిసార' కూడా గ్రాండ్ స‌క్సెస్.

ప్ర‌స్తుతం మెగాస్టార్ 156వ చిత్రం 'విశ్వంభ‌ర‌'కు ఆయ‌నే సంగీతం స‌మ‌కూర్చుతున్నారు. అలాగే ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌థానాయకుడిగా న‌టిస్తోన్న 'హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు' చిత్రానికి కీర‌వాణినే బాధ్య‌త‌లు తీసుకున్నారు. ఆ ర‌కంగా అన్న‌ద‌మ్ముల సినిమాల‌కు ఒకేసారి సంగీతం అందించ‌డం విశేషం. ఇంత వ‌ర‌కూ కీర‌వాణి పీకేతో ప‌నిచేసింది లేదు. ఆ ర‌కంగా పీకే తో మొద‌టి అనుభ‌వంగా చెప్పొచ్చు. అలాగే మ‌హేష్ పాన్ ఇండియా సినిమా బాధ్య‌త‌లు కూడా కీర‌వాణికే అప్ప‌గించాడు జ‌క్క‌న్న‌. అటు త‌మిళ్ లోనూ కొన్ని సినిమాల‌కు సంగీతం అందిస్తున్నారు. 'జెంటిల్మెన్' సీక్వెల్ కి ఆయ‌నే సంగీతం అందిస్తున్నారు.