Begin typing your search above and press return to search.

మళ్ళీ స్పీడ్ పెంచిన కీరవాణి

అయితే కేవలం రాజమౌళి సినిమాలకి మాత్రమే పరిమితం కాకుండా ఇప్పుడు ఇతర ప్రాజెక్ట్స్ కూడా కీరవాణి చేయడానికి సిద్ధమయ్యారు.

By:  Tupaki Desk   |   22 Aug 2023 4:27 AM GMT
మళ్ళీ స్పీడ్ పెంచిన కీరవాణి
X

టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంఎం కీరవాణి తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. ఆస్కార్ అవార్డు సొంతం చేసుకున్న ఇండియన్ మ్యూజిక్ డైరెక్టర్స్ లలో ఒకరుగా రెహమాన్ తర్వాత, కీరవాణి ఉన్నారు. అయితే రెహమాన్ హాలీవుడ్ మూవీస్ తో ఆస్కార్ అందుకుంటే కీరవాణి మాత్రం ఇండియన్ సినిమాతో ఆస్కార్ గెలుచుకున్న మొట్టమొదటి వ్యక్తిగా నిలిచారు.

నాటునాటు సాంగ్ ప్రపంచం మొత్తం ఇప్పుడు ఉర్రుతలూగిస్తోంది. ఈ సాంగ్ ఆస్కార్ గెలుచుకున్న కూడా ఎప్పటిలాగే తనపని తాను చేసుకుంటూ వెళ్లిపోతున్నారు. అయితే ఈ మధ్యకాలంలో కీరవాణి కేవలం రాజమౌళి సినిమాలకి మాత్రమే ఎక్కువగా మ్యూజిక్ అందిస్తున్నారు. గతంలో రాఘవేంద్రరావు సినిమాలంటే కీరవాణి అనే మాట వినిపించేది. తరువాత ఆ స్థానంలోకి రాజమౌళి వచ్చారు.

లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్న కీరవాణి చాలా లిమిటెడ్ గా మాత్రమే సినిమాలు చేస్తూ ఉంటారు. అతను కావాలని ఏరికోరి వెళ్లేవారికి, కథకి బాగా కనెక్ట్ అయితేనే మ్యూజిక్ అందింస్తూ ఉంటారు. అయితే కేవలం రాజమౌళి సినిమాలకి మాత్రమే పరిమితం కాకుండా ఇప్పుడు ఇతర ప్రాజెక్ట్స్ కూడా కీరవాణి చేయడానికి సిద్ధమయ్యారు. అవన్నీ కూడా క్రేజీ సినిమాలే కావడం విశేషం.

లారెన్స్, కంగనా రనౌత్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న చంద్రముఖి 2 మూవీకి కీరవాణి మ్యూజిక్ అందించారు. ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కి రెడీ అవుతోంది. అలాగే జెంటిల్మెన్ 2 చిత్రానికి కూడా మ్యూజిక్ అందించడానికి కీరవాణి కమిట్ అయ్యారు. అయితే ఈ చిత్రంలో హీరో ఎవరనేది ఇంకా ఖరారు కాలేదు. దిల్ రాజు ప్రొడక్షన్ నుంచి ఆశీష్ హీరోగా రానున్న మూడో చిత్రానికి కీరవాణి స్వరాలుఅందించబోతున్నారు .

అలాగే నాగార్జున కొత్త మూవీ నా సామి రంగాకి కూడా కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్ గా ఖరారైనట్లు తెలుస్తోంది. రెండు, మూడు రోజుల్లో ఈ సినిమాపై అధికారిక ప్రకటన రానుంది. వశిష్ఠ మల్లిడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా యూవీ క్రియేషన్స్ నిర్మించబోతున్న సోషియో ఫాంటసీ చిత్రానికి ఎంఎంకీరవాణి మ్యూజిక్ అందించబోతున్నారు. ఇలా చేతిలో ఆయన చేతిలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా ఐదు ప్రాజెక్ట్స్ ఉండటం విశేషం.