Begin typing your search above and press return to search.

కీర‌వాణికి ఇంకా రాజ‌మౌళి మాటివ్వ‌లేదా?

సూప‌ర్ స్టార్ మ‌హేష్ క‌థానాయ‌కుడిగా రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో పాన్ ఇండియా చిత్రానికి రంగం సిద్ద‌మ‌వుతోన్న సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   9 Jan 2024 5:27 AM GMT
కీర‌వాణికి ఇంకా రాజ‌మౌళి మాటివ్వ‌లేదా?
X

సూప‌ర్ స్టార్ మ‌హేష్ క‌థానాయ‌కుడిగా రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో పాన్ ఇండియా చిత్రానికి రంగం సిద్ద‌మ‌వుతోన్న సంగ‌తి తెలిసిందే. జ‌క్క‌న్న య‌ధావిధిగా త‌న పాత టీమ్ తోనే ఈ పాన్ ఇండియా చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నారు. అందులో ఎలాంటి డౌట్ లేదు. న‌టీన‌టులు మారుతారు తప్ప‌..టెక్నీషియ‌న్లు వాళ్లే ఉంటారు. ఇంకా అద‌నంగా అంత‌ర్జాతీయ సాంకేతిక నిపుణులు యాడ్ అవుతారు త‌ప్ప‌! పాత టీమ్ అన్న‌ది త‌ప్ప‌నిస‌రిగా ఉండాల్సిందే.

జ‌క్క‌న్న అంత గొప్ప సినిమాలు తీస్తున్నాడు అంటే? వెనుక వాళ్లంతా అంత క‌ష్ట‌ప‌డుతున్నారు కాబ‌ట్టే. ఇక స్టోరీ ఎలాగూ విజ‌యేంద్ర ప్ర‌సాద్ స‌మ‌కూరుస్తారు. ఆయ‌న విజ‌న్ కి రాజ‌మౌ ళి ఐడియాలు జ‌త చేసి త‌యారు చేస్తుంటారు. అలాగే రాజ‌మౌళి ఏ సినిమా డైరెక్ట్ చేసినా సంగీత ద‌ర్శ‌కు డిగా మాత్రం కీర‌వాణినే ప‌నిచేస్తారు. ఆ కాంబినేష‌న్ అంటే ప్రేక్ష‌కుల్లో ప్ర‌త్యేక‌మై అంచ‌నాలు.. అభిమానం కొన్నాళ్ల‌గా కొనసాగుతూ వ‌స్తోంది. మ‌రి మ‌హేష్ సినిమాకి రాజ‌మౌళి మ్యూజిక్ డైరెక్ట‌ర్ ని మార్చే ఆలోచ‌న‌లో ఏమైనా ఉన్నారా? అలాగే క‌నిపిస్తుంది స‌న్నివేశం.

ఈ సినిమా సంగీతం ప‌నులు ఎంత‌వ‌ర‌కూ వ‌చ్చాయ‌ని కీర‌వాణిని అడిగితే? నాకేం తెలియ‌ద‌న్న‌ట్లే స‌మాధానం ఇచ్చారు. ఆ సినిమా గురించి తెలుసుకోవాలంటే రాజ‌మౌళి కి ఫోన్ చేసి అడ‌గాలి. త‌నుకు ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ వ‌స్తుంది(న‌వ్వుతూ) అంటే వ‌ర్క్ ఇంకా నా వ‌ర‌కూ రాలేద‌ని అర్దం. అంటే ఆ సినిమాకి సంబంధించి మ్యూజిక్ ప‌నులు ఇంకా మొద‌లు కాలేద‌ని తెలుస్తోంది. జ‌క్క‌న్న ప్ర‌తీ ప‌నిలోనూ క‌ల్పించుకుంటారు. ప్ర‌స్తుతం స్టోరీకి సంబంధించిన ప‌నుల్లో క్ష‌ణం తీరిక లేకుండా బిజీగా ఉన్నార‌ని తెలుస్తోంది.

ఆయ‌న ఫోన్ స్విచ్చాఫ్ వ‌స్తుందంటే? ఎలాంటి డిస్ట‌బెన్స్ లేకుండా ఆ క‌థ ప‌నుల్లో నిమ‌గ్న‌మైన‌ట్లు తెలు స్తోంది. కొన్ని రోజులుగా ఆయ‌న సోష‌ల్ మీడియాలో కూడా యాక్టివ్ గా లేరు. ఏ సినిమా గురించి కూడా కామెంట్లు పెట్టింది లేదు. స్టోరీ ప‌నులు ముగించి ఆ త‌ర్వాత కీర‌వాణి ద‌గ్గ‌ర‌కు వ‌స్తారు. అటుపై న‌టీన‌టులు ఇత‌ర విష‌యాల‌పై దృష్టి పెడ‌తార‌ని తెలుస్తోంది.