Begin typing your search above and press return to search.

పవన్ మీద కీరవాణికి ఇంత అభిమానమా?

టాలీవుడ్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను అభిమానించే వాళ్లు చాలామందేే ఉన్నారు. రాజమౌళి కుటుంబంలో ప్రతి ఒక్కరూ ఆయన మీద అభిమానం చూపిస్తుంటారు.

By:  Tupaki Desk   |   22 July 2025 1:19 PM IST
పవన్ మీద కీరవాణికి ఇంత అభిమానమా?
X

టాలీవుడ్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను అభిమానించే వాళ్లు చాలామందేే ఉన్నారు. రాజమౌళి కుటుంబంలో ప్రతి ఒక్కరూ ఆయన మీద అభిమానం చూపిస్తుంటారు. విజయేంద్ర ప్రసాద్, రాజమౌళి పలు సందర్భాల్లో పవన్ మీద తమకున్న ప్రత్యేక అభిమానాన్ని చాటుకున్నారు. ఆయనకు అదిరిపోయే ఎలివేషన్లు ఇచ్చారు. ఇప్పుడు ఆ కుటుంబం నుంచి లెజెండరీ సంగీత దర్శకుడు కీరవాణి సైతం పవన్ మీద తనకెంత ప్రేమ ఉందో చాటి చెప్పారు. తొలిసారిగా పవన్ సినిమా ‘హరిహర వీరమల్లు’కు సంగీతం అందించిన కీరవాణి.. పవర్ స్టార్ కోసం ప్రత్యేకంగా స్వరపరిచిన ఒక పాటను ఈ చిత్ర ప్రి రిలీజ్ ఈవెంట్లో తన టీంతో పెర్ఫామ్ చేయించి ఆశ్చర్యపరిచారు. పవన్ కళ్యాణ్‌తో పాటు నిర్మాత ఏఎం రత్నంకు కూడా ఈ పాట కంపోజ్ చేసిన విషయమే తెలియదట. తనకు, తన టీంకు మాత్రమే ఈ పాట గురించి తెలుసంటూ స్టేజ్ మీద లైవ్ పెర్ఫామెన్స్ మొదలుపెట్టాడు కీరవాణి. పవన్ సినిమా పేర్లన్నీ కలిసి వచ్చేలా ఈ పాటను రాయించడం విశేషం.

ఇంతకీ ఆ పాట ఎలా సాగిందంటే..

గోకులంలో సీత వెతికింది అత్తారింటికి దారేదని..

అక్కడ అమ్మాయికి ఇక్కడ అబ్బాయి దొరికితే

ఖుషి ఖుషి ఖుషి ఖుషి ఖుషి ఖుషి ఖుషి ఖుషి..

తమ్ముడు హేయ్ తమ్ముడు ఎక్కడున్నాడు కాటమరాయుడు..

ఆ అజ్ఞాతవాసిని వెతికి పట్టుకో నేడు

పులి పంజాకైనా దొరకని గబ్బర్ సింగ్ వాడు.. సర్దార్ గబ్బర్ సింగ్ వాడు

బెదిరిస్తే వస్తడా.. నెవర్.. హీ ఈజ్ గుడుంబా శంకర్..

పెరిగిపోతుందిక్కడ ఫీవర్.. కొట్టుకో కొట్టుకో తీన్ మార్..

బ్రో బ్రో బ్రో బ్రో.. మా బంగారానికి నీపై తొలి ప్రేమ పుట్టింది బ్రో..

ఇది వకీల్ సాబ్ తన లైఫ్‌లోన జాలీ అంటుంది బ్రో..

ఈ బాలుని.. ఈ బద్రిని.. ఈ భీమ్లా నాయక్‌ని..

గోపాల గోపాల మాంగల్య మంత్రాన అన్నవరంలోన పెళ్లాడు జల్సాగా..

ఈ వేదికకి సుస్వాగతం.. ఆ సునామికి సుస్వాగతం..ఇది అరాచకం.. ఇది అరాచకం..

రాంబాబు రెడీ అయిపో.. నీ కెమెరాతో నువ్ రెడీ అయిపో.. ఆ గంగతో ఇక రెచ్చిపో..

వస్తున్నాడొస్తున్నాడొస్తున్నాడో.. వచ్చేశాడొచ్చేశాడొచ్చేశాడో.. ఎవడు?

..ఇలా సాగిన ఈ పాట చివర్లో ‘హరిహర వీరమల్లు’ టైటిల్‌తో ముగిసింది. పవన్ అభిమానులకు తెగ నచ్చేస్తున్న ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.