Begin typing your search above and press return to search.

కీడా కోలా.. ఇంత కాన్ఫిడెన్స్ గా చెబుతున్నారంటే..!

టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్స్ లో ఒకరైన తరుణ్ భాస్కర్ లేటెస్ట్ గా కీడా కోలా అనే సినిమా చేశారు. ఈ సినిమాను తన స్నేహితులు నిర్మించగా సురేష్ ప్రొడక్షన్ సమర్పిస్తుంది.

By:  Tupaki Desk   |   30 Oct 2023 6:11 AM GMT
కీడా కోలా.. ఇంత కాన్ఫిడెన్స్ గా చెబుతున్నారంటే..!
X

టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్స్ లో ఒకరైన తరుణ్ భాస్కర్ లేటెస్ట్ గా కీడా కోలా అనే సినిమా చేశారు. ఈ సినిమాను తన స్నేహితులు నిర్మించగా సురేష్ ప్రొడక్షన్ సమర్పిస్తుంది. నవంబర్ 3న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం జరిగింది. ఈవెంట్ లో భాగంగా తరుణ్ భాస్కర్ స్పీచ్ ఆడియన్స్ ని అలరించింది. నేను చాలా మందికి థ్యాంక్స్ చెప్పాలి. సినిమా సక్సెస్ అయ్యాక థ్యాంక్స్ కార్యక్రమం పెట్టుకుంటానని అన్నారు.

పెళ్లిచూపులు, ఈ నగరానికి ఏమైంది సినిమాల రిలీజ్ టైం లో భయపడుతూ ఉన్నా.. సినిమా రిలీజ్ టైంలో థియేటర్ బయట తిరిగేవాడిని నా డైలాగులు నేను చూసి చిరాకు వచ్చేది. ఎవరైనా సినిమా చేశాక వారి సినిమా వాళ్లకు నచ్చదు. కానీ కీడా కోలా సినిమా చూశాకా నాకు చాలా నమ్మకం కలిగింది. ఐ హావ్ కాన్ఫిడెన్స్ అని చెప్పారు తరుణ్ భాస్కర్. ఇలా చెబితే బలుపుతో చెప్పారని అనుకుంటారేమో సినిమా రిజల్ట్ ఏమైనా కానీ నేను ఈ సినిమా తీసినందుకు చాలా గర్వంగా ఉందని అన్నారు.

నా సపోర్ట్ సిస్టం గా ఉన్నందుకు నా స్నేహితులకు థ్యాంక్స్ చెప్పారు. నా వెనుక ఇన్విజిబుల్ సపోర్ట్ గా నిలిచిన వారికి థ్యాంక్స్ అని అన్నారు. ఈరోజు వాళ్ల పేర్లు పోస్టర్స్ మీద ఉన్నా కానీ నాకు వాళ్లంతా చాలా లాంగ్ టైం నుంచి సపోర్ట్ చేస్తున్నారని అన్నారు. ఈ సినిమా ఆడుతుందా లేదా.. 3వ సినిమా సస్టైన్ అవుతాడా లేదా ఇవన్ని కాదు.. కొత్తవాళ్ల ఫేస్ లు చూస్తారా చూడరా.. ఇవన్ని అవసరం ఏమున్నా ఏవి లేకపోయినా ఈ సినిమా మీ గురించి.. స్పెషల్ గా మీ గురించే డిజైన్ చేశానని ఆడియన్స్ ని ఉద్దేశించి అన్నారు తరుణ్ భాస్కర్.

లైఫ్ లో ప్రతి స్టేజ్ లో ప్రాబ్లెంస్ ఉంటాయి. కానీ లాస్ట్ టైం మనం నవ్వుకున్నప్పుడు అవే ప్రాబ్లమ్స్ మన జీవితంలో ఉన్నాయి. కానీ నవ్వుకున్నాం.. ఆ నవ్వు మీకు కలిగించాలనే ప్రయత్నమే ఈ సినిమా అని అన్నారు తరుణ్ భాస్కర్. నవంబర్ అంతా మీరు నవ్వుకోవచ్చు. ఒకటి గుర్తు పెట్టుకోండి డైరెక్షన్ పరంగా కష్టపడ్డా.. రైటింగ్ పరంగా కష్టపడ్డా.. కావాలంటే నేను ఈ నగరానికి ఏమైంది సెకండ్ పార్ట్ తీసి ఉండొచ్చు దానికి మార్కెట్ కూడా ఉంది. కానీ అలా నేను చేయను ఆడియన్స్ కి కొత్త కామెడీ అందిస్తానని అన్నారు తరుణ్ భాస్కర్. కాన్షియస్ గా ఒక తెలుగు సినిమాను మనం రిప్రజెంట్ చేస్తున్నాం భయం భక్తితో చేసిన సినిమా ఇది.

ఇవన్ని మీరు పట్టించుకోకండి నవంబర్ లో మీ దగ్గర థియేటర్ లో కీడా కోలా సినిమా ఉంటుంది. మీ సమస్యలన్నిటినీ మర్చిపోతారు. మీరంతా తప్పకుండా నవ్వుతారని అన్నారు. మీరు నవ్వితే చాలు దానికి బ్రహ్మానందం సార్ ఎక్సాంపుల్. ఆయన ఎంతమందిని నవ్వించాడో అందరికీ తెలుసు. అందుకే ఆయన మంచి ఫ్యామిలీని కలిగి ఉన్నారు.

నేను ఎవరికి లైఫ్ ఇవ్వలేదు. రైట్ టైం రైట్ ప్లేస్ వచ్చిన వాళ్లకే అది వస్తుంది. విజయ్, వివేక్ సాగర్, తాను ఇలా రైట్ టైం రైట్ ప్లేస్ లో అలా కుదిరిందని అన్నారు. అంతేకాదు తనకు వచ్చిన ఈ క్రేజ్ ఏరోజు ఈగోకి తీసుకోలేదు. అలా తీసుకుంటే ఆరోజే తాను ఆగిపోతానని తెలుసని అన్నారు తరుణ్ భాస్కర్.