Begin typing your search above and press return to search.

కీడా కోలా ట్రైలర్‌.. క్రైమ్ లో తరుణ్ భాస్కర్ గోల

'పెళ్లి చూపులు', 'ఈ నగరానికి ఏమైంది' చిత్రాలు(ఐదేళ్ల తర్వాత) తరుణ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'కీడా కోలా'

By:  Tupaki Desk   |   18 Oct 2023 8:51 AM GMT
కీడా కోలా ట్రైలర్‌.. క్రైమ్ లో తరుణ్ భాస్కర్ గోల
X

'పెళ్లి చూపులు', 'ఈ నగరానికి ఏమైంది' చిత్రాలు(ఐదేళ్ల తర్వాత) తరుణ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'కీడా కోలా'. క్రైమ్ కామెడీ థ్రిల్లర్‌గా రానున్న ఈ చిత్రం నుంటి ఆ మధ్యలో టీజర్ రిలీజై బాగా ఆకట్టుకుంది. తాజాగా ఇప్పుడు ట్రైలర్​ను రిలీజ్ చేశారు మేకర్స్​. ఎనిమిది ప్రధాన పాత్రల చుట్టూ ఈ కథ తిరగనుంది. వీరిలో ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం కూడా ఉన్నారు.

ఓ వైపు టురెట్ సిండ్రోమ్‌ అనే వింత జబ్బుతో బాధపడే ఓ వ్యక్తి... కోట్లు విలువ చేసే బొమ్మను రూ.100లకు కూడా కొనుక్కోడానికి వీలులేకుండా చేయడం, దీనిపై కోర్టులో వాదన జరగడం మొదట చూపించారు. ఆ తర్వాత మరోవైపు తనవల్లే రాజన్న కార్పోరేటర్ అయ్యాడని అనుకునే జీవన్‌ పొగరు దించడానికి.. ఆ కార్పోరేటర్‌ ఓ వింత పని చేస్తాడు. అది చూసి ఫీల్​ అయిన జీవన్‌.. తనకు బాగా కావాల్సిన వ్యక్తి నాయుడు అలీయాస్‌ తరుణ్‌ భాస్కర్‌తో కలిసి రాజన్నను చంపి, కార్పోరేటర్ అవ్వాలని ప్రణాళిక రచిస్తాడు.

అదే సమయంలో మరో విలన్ల గ్యాంగ్‌ కోట్లు విలువ చేసే బొమ్మను దక్కించుకోవడానికి ఏం చేయడానికైనా సిద్ధం అవుతుంది. ట్రైలర్‌ చివర్లో బొమ్మ కోసం జరిగే వైలెన్స్​కు ఫన్నీ ఫన్నీగా చూపించారు. ఫైటింగ్​లు, గన్స్‌తో ఛేజింగ్, యాక్షన్ సీన్లను సరదా సరదాగా చూపించారు. మొత్తానికి ట్రైలర్‌ అయితే మంచిగా ఎంటర్‌టైన్​ చేస్తుంది.

కానీ తరుణ్​.. స్టోరీ గురించి క్లారిటీ ఇవ్వకుండా మళ్లీ కాస్త కన్ఫ్యూజన్ చేశాడు. అసలు ఆ బొమ్మలో బొమ్మలో ఏముంది? బొమ్మ కోసం ఎందుకు అంతమంది కోట్లాడుకుంటున్నారు? చంపుకునేంత వరకు ఎందుకు వెళ్లారు? వంటి పలు ప్రశ్నలతో ట్రైలర్​ను కట్​ చేశారు. ఇందులో తరుణ్​ భాస్కర్​ నెగెటివ్ షేడ్స్​ ఉన్న క్యారెక్టర్ పోషించినట్టు అర్థమవుతోంది.

వీటిలో పాటే ట్రైలర్‌ ప్రారంభంలోనే కోలాలో ఉన్న బొద్దింకను కాస్త హైలైట్ చేశారు. అది కూడా సినిమాలో కీలకం కానున్నట్లు తెలుస్తోంది. వీటన్నిపై ఓ స్పష్టత రావాలంటే.. నవంబర్ 3న సినిమా రిలీజ్‌ అయ్యేవరకు వేచి ఉండాల్సిందే. కాగా, ఈ చిత్రాన్ని వివేక్ సుదాన్షు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్ నండూరి, శ్రీపాద్ నందిరాజ్, ఉపేంద్ర వర్మ కలిసి సంయుక్తంగా నిర్మించారు. సురేశ్​ ప్రొడక్షన్స్‌ సినిమాను డిస్ట్రిబ్యూట్‌ చేయనుంది.