Begin typing your search above and press return to search.

కేసీఆర్​ టైటిల్.. జబర్దస్త్ కమెడియన్ సర్ ప్రైజ్!

తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్​ అండ్ టైటిల్​ పోస్టర్​ను విడుదల చేసింది మూవీ టీమ్​. తెలంగాణ మంత్రి సి. మల్లా రెడ్డి దీన్ని రిలీజ్ చేశారు.

By:  Tupaki Desk   |   13 Oct 2023 4:42 PM GMT
కేసీఆర్​ టైటిల్.. జబర్దస్త్ కమెడియన్ సర్ ప్రైజ్!
X

జబర్దస్త్‌ షోతో పాపులర్‌ అయిన హాస్యనటుడు రాకింగ్‌ రాకేశ్‌. తనని తాను ప్రూవ్ చేసుకుంటూ బుల్లితెర ప్రేక్షకుల్లో పాపులారిటీ సంపాదించుకున్న ఆయన కెరీర్​లో మరో అడుగు వేసి హీరోగా మారబోతున్నారు. ఆయన కథానాయకుడిగా ఓ చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. తెలంగాణలోని బంజారా బ్యాక్​డ్రాప్​లో సినిమా రూపుదిద్దుకుంటోంది. గరుడవేగ అంజి డీఓపీ అందించడంతో పాటు దర్శకత్వం వహిస్తున్నారు.


తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్​ అండ్ టైటిల్​ పోస్టర్​ను విడుదల చేసింది మూవీ టీమ్​. తెలంగాణ మంత్రి సి. మల్లా రెడ్డి దీన్ని రిలీజ్ చేశారు. సినిమాకు కేసీఆర్​(కేశవ చంద్ర రామ్​వత్​) అనే టైటిల్​ను ఖరారు చేశారు మేకర్స్​. పోస్టర్​లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ కటౌట్​ ముందు ఓ బాలుడు నిల్చొని తదేకంగా చూస్తున్నట్లు చూపించారు.

అలానే పోస్టర్​ బ్యాక్​గ్రౌండ్​లో రైతులు, బంజారా మహిళలు, గొర్రెలు, పచ్చనీ పొలాలు.. ఇలా చాలా కనిపిస్తున్నాయి. మొత్తంగా గ్రామీణ వాతావరణం, తెలంగాణ సంస్కృతి పోస్టర్​లో ఉట్టిపడుతోంది.

సీఎం కేసీఆర్ అడ్వైసర్ దేశపాటి శ్రీనివాస్, పెద్దింటి అశోక్​.. సినిమాకు కొన్ని కీలక సన్నివేశాలను అందించారు. నవీన్ కోలా - రాకింగ్ రాకేశ్​ సినిమాకు స్క్రిప్ట్​ రైటర్స్​గా కూడా వ్యవహరించారు. కుశుమ రాజ్​కుమార్​ - ఉండ్రవెల్లి నాగరాజ్​ డైలాగ్స్ అందించారు. పాపులర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్​ సత్య కృష్ణ కూతురు అనన్య మేనన్ హీరోయిన్​గా ఈ చిత్రంతో అరంగేట్రం చేస్తోంది. ఇంకా సినిమాలో తనికెళ్ల భరణి, కృష్ణ భగవాన్, జోర్దార్ సుజాత, ధనరాజ్​, తాగుబోతు రమేశ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్​ - విభూది ఎంటర్​టైన్మెంట్స్ - గరుడవేగ మేకింగ్స్​.. ​ కలిసి సంయుక్తంగా సినిమాను నిర్మిస్తున్నాయి. రాకింగ్ రాకేశ్ నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. సినిమాకు తెలంగాణ మ్యాస్ట్రో చరణ్ అర్జున్ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. బలగం మధు ఎడిటర్​గా వ్యవహరిస్తున్నారు. కాశర్ల శ్యామ్​, గోరేటి వెంకన్న, చరణ్ అర్జున్ పాటలకు లిరిక్స్ అందిస్తున్నారు. చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి రిజల్ట్​ను అందుకుంటుందో....