బిగ్‌బికి ఏమైంది! KBC కోసం కొత్త హోస్ట్?
కేబీసీ అంటే అమితాబ్.. అమితాబ్ అంటే కేబీసీ. అంతగా ఆ రెండూ విడదీయలేని పదాలు. బుల్లితెర హోస్ట్ గా అమితాబ్ సాధించినది శిఖరం ఎత్తు.
By: Tupaki Desk | 23 May 2025 4:00 AM ISTకేబీసీ అంటే అమితాబ్.. అమితాబ్ అంటే కేబీసీ. అంతగా ఆ రెండూ విడదీయలేని పదాలు. బుల్లితెర హోస్ట్ గా అమితాబ్ సాధించినది శిఖరం ఎత్తు. కౌన్ బనేగా కరోడ్ పతి (కేబీసీ) హోస్ట్ గా అమితాబ్ ని తప్ప వేరొకరిని ఊహించుకోవడం కూడా కష్టం. అలాంటిది ఇప్పుడు అకస్మాత్తుగా రెండు దశాబ్ధాల తర్వాత అమితాబ్ కేబీసీ నుంచి తప్పుకుంటున్నారని కథనాలొస్తున్నాయి. దీనికి కారణాలు ఏమిటి? అన్నది తెలియడం లేదు కానీ, ఈసారి కేబీసీ కొత్త సీజన్ కోసం బిగ్ బి అందుబాటులో ఉండరని తెలుస్తోంది.
బాలీవుడ్ హంగామా కథనం ప్రకారం.. ఈసారి కేబీసీ కొత్త సీజన్ కి సల్మాన్ ఖాన్ హోస్టింగ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. నిజానికి కేబీసీ ఒక ఎపిసోడ్ కి కింగ్ ఖాన్ షారూఖ్ హోస్టింగ్ చేసారు. కానీ అమితాబ్ రేంజులో షో వర్కవుట్ కాలేదు. ఆ తర్వాత అమితాబ్ ని సోని టెలివిజన్ గ్యాప్ లేకుండా కొనసాగిస్తోంది. కానీ ఇప్పుడు అమితాబ్ ఎగ్జిట్ అయ్యే టైమ్ వచ్చిందని తెలిసింది. ఇది అభిమానులు జీర్ణించుకోలేనిది అయినా తప్పదు.
తాజాగా అందిన సమాచారం మేరకు.. కేబీసీ కొత్త సీజన్ కోసం నిర్వాహకులు సల్మాన్ ఖాన్ తో మంతనాలు సాగిస్తున్నారని తెలిసింది. సల్మాన్ బుల్లితెరపై గొప్ప సక్సెస్ రేటు ఉన్న స్టార్. అతడు దస్ కా దమ్, బగ్ బాస్ షోలను అత్యంత విజయవంతమైన భారతీయ టెలివిజన్ షోలుగా నిలబెట్టాడు. అందుకే తదుపరి కేబీసీని నడిపించే బాధ్యత అతడికి సోని నెట్ వర్క్ అప్ప జెబుతుందని భావిస్తున్నారు. అయితే దీనిని అధికారికంగా సదరు సంస్థ ప్రకటించాల్సి ఉంటుంది. మొత్తం 16 సీజన్లలో 15 సీజన్లను అమితాబ్ నడిపించగా, ఒక సీజన్ ని షారూఖ్ నడిపించారు. ఇప్పుడు కేబీసీ 17వ సీజన్ ని సల్మాన్ ఖాన్ హోస్టింగ్ చేస్తారనే వార్తలు ప్రకంపనాలు రేపుతున్నాయి.
