Begin typing your search above and press return to search.

వారిదో వింత సమస్య.. నెలలపాటు నిద్రలోనే జోగుతున్నారట?

రామాయణంలో కుంభకర్ణుడి గురించి అందరికి తెలుసు. అతడు ఆరు నెలలు తిండి ఆరు నెలలు నిద్రపోయేవాడని చెబుతారు

By:  Tupaki Desk   |   25 March 2024 10:31 AM IST
వారిదో వింత సమస్య.. నెలలపాటు నిద్రలోనే జోగుతున్నారట?
X

రామాయణంలో కుంభకర్ణుడి గురించి అందరికి తెలుసు. అతడు ఆరు నెలలు తిండి ఆరు నెలలు నిద్రపోయేవాడని చెబుతారు. అలా నిద్రలో ఉండగా అతడిని లేపడానికి ఏనుగులు, పెద్ద పెద్ద శబ్దాలు చేసినా లేచేవాడు కాదట. అది అతడి వరం. కానీ అలాంటి వారు ఈ రోజుల్లో ఉన్నారంటే అతిశయోక్తే అనుకోవచ్చు. వారు కూడా నిద్ర వచ్చిందంటే చాలు అది ఏ చోటైనా చూసుకోవడం లేదు. నిద్రలోకి జారుకోవడమే. అది కూడా గంటలు కాదు నెలలే.

కజకిస్తాన్ లోని కలాచి గ్రామంలో ఈ వింత అలవాటు వారిని బాధిస్తోంది. అక్కడ విద్యార్థులు సైతం నెలల తరబడి పాఠశాలలోనే నిద్రపోతున్నారట. అది కూడా మామూలు నిద్ర కాదు. నెలల తరబడి కుంభకర్ణుడి మాదిరి నిద్ర పోవడమే వింతగా అనిపిస్తోంది. ఒకసారి పడుకుంటే నెలల పాటు నిద్రలోనే ఉంటున్నారు. పెద్ద డీజే శబ్ధం వినిపించినా నిద్ర లేవడం లేదట.

అక్కడ వారు అంత బాగా నిద్ర పోవడానికి కారణాలు ఏంటనే విషయం కూడా అంతుచిక్కడం లేదు. శాస్త్రవేత్తలు కూడా తలలు పట్టుకుంటున్నారు. దీనికి కారణం కలుషిత నీరు తాగడమే అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. ఊరు ఊరంతా నిద్ర మత్తులోనే జోగుతోంది. నెలల పాటు నిద్రలోకి జారుకోవడంతో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు.

ఆ గ్రామ సమీపంలో యురేనియం గనులు ఉన్నాయి. వాటి నుంచి వెలువడే నీటిలో కార్బన్ మోనాక్సైడ్ కలిసి ఉండటం వల్ల ఆ నీరు తాగిన వారికి మైకం కమ్ముకొస్తుందట. ఉన్నట్లుండి నిద్రలోకి జారుకుంటున్నారు. ఏదో మైకం కమ్మిన ఫీలింగ్ వచ్చి ఉన్నట్లుండి పడుకోవడమే. ఈ వింత అలవాటు అక్కడ చర్చనీయాంశంగా మారింది. అందరు ఇలా పడుకోవడం వల్ల పనులు మందగిస్తున్నాయి.

నిద్ర లేచాక వారికే ఆశ్చర్యం వేస్తోందట. తానేమిటి ఇన్ని రోజులు నిద్రలో ఉండటమేమిటనే కోణంలో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారట. ఎవరో చేతబడి చేసిన చందంగా వారి కళ్లు బైర్లు కమ్మినిద్ర దేవత ఆవహించిన ఫీలింగ్ కలుగుతుందట. ఇలా ఆ ఊరుకు ఊరే నిద్ర మత్తులోనే జోగుతోంది. దీనిపై శాస్త్రవేత్తలు కూడా పరిశోధనలు చేస్తున్నారు.