టాలీవుడ్ లో తనదైన రోజు కోసం!
ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోయిన్ల మధ్య ఎలాంటి పోటీ వాతావరణం నెలకొంటుందో చెప్పాల్సిన పనిలేదు.
By: Srikanth Kontham | 6 Feb 2026 1:00 AM ISTప్రస్తుతం టాలీవుడ్ లో హీరోయిన్ల మధ్య ఎలాంటి పోటీ వాతావరణం నెలకొంటుందో చెప్పాల్సిన పనిలేదు. ఫాంలో ఉన్న భామల మధ్య ఓ రకమైన పోటీ కనిపిస్తే? కొత్త అవకాశాల కోసం పోటీ పడే వారి మధ్య పోటీ మరో రకంగా ఉంటుంది. సక్సస్ ల్లో ఉన్న భామలంతా నటించని హీరో ఛాన్స్ కోసం పాకులాడుతున్నారు. దీంతో స్టార్ హీరోయిన్ల మధ్య నువ్వా? నేనా? అన్న రేంజ్ లో పోటీ వాతావరణం కనిపిస్తుంది. కొత్త భామల పరంగా చూస్తే? వీళ్లంతా లక్ అనే బేస్ మీద నడుస్తోంది. ఛాన్స్ అందుకున్న వాళ్లు లక్కీ భామలుగా ప్రొజెక్ట్ అవుతున్నారు.
అయితే ఈ ముగ్గురు భామల వ్యధ మాత్రం మరోలా ఉంది. వారే కయాదు లోహార్, మాళవికా మోహనన్, రుక్మిణీ వసంత్. ముగ్గురు పరిచయం అవసరం లేని పేర్లు. `డ్రాగన్` తో వెలుగులోకి వచ్చిన అస్సాం బ్యూటీ కయాదు లోహార్ ఆ విజయం త తర్వాత టాలీవుడ్ లో తిరుగులేదనుకున్నారు. మాలీవుడ్, కోలీవుడ్ ఇమేజ్ తో టాలీవుడ్ లో ఛాన్సులు సులభంగా అందుకుంది. అందుకు తగ్గట్టు సోషల్ మీడియా ఫాలోయింగ్ చూసి కయాదు తెలుగులో తిరుగులేని నటి అవుతుందనుకున్నారు. కానీ వాస్తవం మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఈ బ్యూటీ చేతిలో `ఫంకీ` సినిమా తప్ప మరో ప్రాజెక్ట్ లేదు.
ఈ సినిమా విజయం సాధిస్తే తప్ప కయాదుకు కొత్త అవకాశాలు వచ్చే సన్నివేశం కనిపించలేదు. `ఫంకీ` ఇదే నెలలో రిలీజ్ అవుతుంది. ఇందులో విశ్వక్ సేన్ కి జోడీగా నటిస్తోంది. ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటుంది. ఈ నేపథ్యంలోనే కయాదు ఫాలోయింగ్ టాలీవుడ్ లో సాధించింది ఏంటంటే? ఇదీ అని తేలింది. కేరళ బ్యూటీ మాళవిక మోహనన్ `ది రాజాసాబ్` విజయంతో టాలీవుడ్ లో పాగా వేయాలని చూసింది. కానీ అమ్మడిని డెబ్యూ తీవ్ర నిరాశపరిచింది. ఆ సినిమా రిలీజ్ ముందు వరకూ అమ్మడిపై ఓ రేంజ్ లో హైప్ క్రియేట్ అయింది. టాలీవుడ్ స్టార్ లీగ్ లో చేరడానికి ఎంతో సమయం పట్టదనుకున్నారంతా.
కానీ రాజాసాబ్ వైఫల్యంతో సీన్ రివర్స్ అయింది. త్వరలో `సర్దార్ 2` తో ప్రేక్షకుల ముందుకు రానుంది. కార్తీ హీరోగా నటించిన స్పై థ్రిల్లర్ ఇది. ఈ సినిమాపై అంచనాలు భాగానే ఉన్నాయి. ఈ సినిమాతోనైనా టాలీవుడ్ లో సరైన గుర్తింపు దక్కుతుందని ఆశీస్తోంది. మరో కన్నడ నటి రుక్మిణీ వసంత్ `కాంతార చాప్టర్ వన్` తో తెలుగులో సంచలనమైనా? అమ్మడు ఇంకా బిజీ నటి కాలేకపోతుంది. పాన్ ఇండియా లో గుర్తింపు దక్కినా? ఆ రేంజ్ లో అవకాశాలు మాత్రం అందుకోవడంలో వెనుకబడే ఉంది.
తెలుగులో ఎన్టీఆర్ సరసన ఓ సినిమాలో నటిస్తోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తోన్న చిత్రమిది. ఇందులో ఛాన్స్ రావడానికి కారణం నీల్. కన్నడ నటికే ప్రాధాన్యత ఇవ్వాలి అన్న కోణంలో ఆమెను తీసుకున్నారు. ఆమె ప్రతిభను గుర్తించి ఇచ్చిన అవకాశంగా ఫోకస్ అవ్వడం లేదు. తన నుంచి రుక్మిణీ వసంత్ ఇలా కోరుకోవడం లేదు. తెలుగు పరిశ్రమలో ప్రతిభ ఆధారంగా అవకాశాలు అందుకోవాలని ఆశపడుతోంది. ఆ తరహా అవకాశాలనే కోరుకుంటోంది.
