అప్పుడే ఆ భామలిద్దరి మధ్య కుమ్ములాట!
ఒకరి అవకాశాలు మరొకరు తన్నుకుపోవడం సహజం. హీరోయిన్ల మధ్య ఈ పోటీ కనిపిస్తుంటుంది.
By: Tupaki Desk | 18 July 2025 4:00 AM ISTఒకరి అవకాశాలు మరొకరు తన్నుకుపోవడం సహజం. హీరోయిన్ల మధ్య ఈ పోటీ కనిపిస్తుంటుంది. ఆ పోటీ ఇద్దరి మధ్య వేడి వాతావరణానికి దారి తీస్తుంటుంది. హీరోయిన్ల మధ్య ఈ వైరం అన్నది ప్రకృతి ధర్మం లాంటింది. అవకాశాల కోసం విరోధులైన నటీమణులు ఎంతో మంది ఉన్నారు. అప్పటి వరకూ స్నేహి తులుగా కొనసాగిన వారు? ఛాన్సుల దగ్గరకొచ్చే సరికి పోటీ వాతావరణం వస్తే నువ్వెంత అంటే నువ్వెంత అనుకునే పరిస్థితి తలెత్తుతుంది. తాజాగా అస్సాం-కేరళ బ్యూటీ మధ్య ఇలాంటి వివాదమే మొదలైనట్లు కనిపిస్తుంది.
'డ్రాగన్' సినిమాతో అస్సాం బ్యూటీ కయాదు లోహర్ తెలుగింట ఎంత ఫేమస్ అయిందో చెప్పాల్సిన పనిలేదు. 'డ్రాగన్' హిట్ తో నటిగా బిజీ అయింది. ఒక్కసారిగా నాలుగు సినిమాలకు సైన్ చేసింది. అందులో మూడు తమిళ సినిమాలు కాగా, ఒక మలయాళ చిత్రం. తెలుగులో కూడా అమ్మడికి మంచి అవ కాశాలు వస్తున్నాయి. స్టార్ హీరోలతోనే ఛాన్సులందుకుంటుంది. కయాదు కంటే కాస్త సీనియర్ మమితా బైజు. ఇంత వరకూ ఒక్క తెలుగు సినిమా కూడా చేయలేదు. కానీ అమ్మడికి యువతలో మంచి ఫాలోయింగ్ ఉంది.
కయాదు హాట్ బ్యూటీగా ఫేమస్ అయితే? మమితా క్యూట్ బ్యూటీగా వెలుగులోకి వచ్చింది. ఇద్దరికి తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది. ఈనేపథ్యంలో భామా మణులిద్దరి మధ్‌య అవకాశాల కోసం పోటీ మొదలైనట్లు కనిపిస్తుంది. కయాదు లోహార్ కు వచ్చిన అవకాశాలన్నింటిని మమితా బైజ్ లాగేసుకుంటుం దని కోలీవుడ్ లో వార్తలొస్తున్నాయి. శింబు హీరోగా నటించనున్న ఓ చిత్రంలో అవకాశం ముందుగా కయాదు లోహార్ కు వచ్చిందిట.
కానీ చివరి నిమిషంలో ఆ ఛాన్స్ మమితానే వరించిందిట. అలాగే ధనుష్ తో మరో సినిమా విషయంలో కూడా కయాదు కు ఇలాంటి పరిస్థితే ఎదురైందని సమాచారం. ఈ రెండు కూడా కయాదు చేతి వరకూ వచ్చిన అవకాశాలేనట. సైన్ చేయడం ఒక్కటే బ్యాలెన్స్ అనుకుంటోన్న సమయంలో మమితా బైజు లాగేసుకున్నట్లు వినిపిస్తుంది. దీంతో మమితాపై కయాదు రుసరుసలాడుతోందని కోలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది.
