Begin typing your search above and press return to search.

ఐదేళ్లలో ఒక్కటే హిట్‌... ఐనా ఆమె చేతి నిండా సినిమాలే!

నార్త్‌ ఇండియా బ్యూటీ కయాదు లోహర్‌ సౌత్‌ ఇండియాలో 2021లో కన్నడ మూవీ ముగిల్‌పేట్ తో అడుగు పెట్టింది.

By:  Ramesh Palla   |   26 Sept 2026 10:44 AM IST
ఐదేళ్లలో ఒక్కటే హిట్‌... ఐనా ఆమె చేతి నిండా సినిమాలే!
X

నార్త్‌ ఇండియా బ్యూటీ కయాదు లోహర్‌ సౌత్‌ ఇండియాలో 2021లో కన్నడ మూవీ ముగిల్‌పేట్ తో అడుగు పెట్టింది. మొదటి సినిమా కమర్షియల్‌గా ఆశించిన స్థాయిలో గుర్తింపు దక్కించుకోలేక పోయింది. అయినా కూడా ఆఫర్లు తలుపు తట్టాయి. ఇండస్ట్రీలో అడుగు పెట్టిన రెండో ఏడాదిలోనే ఈమె మలయాళం, తెలుగు సినిమాల్లోనూ నటించే అవకాశం దక్కించుకుంది. 2022లో ఈమె టాలీవుడ్‌లో 'అల్లూరి' అనే సినిమాతో అడుగు పెట్టిన విషయం తెల్సిందే. ఆ సినిమా సైతం కమర్షియల్‌గా పెద్ద హిట్‌గా నిలవలేక పోయింది. దాంతో టాలీవుడ్‌ నుంచి ఆఫర్లు రాలేదు. సౌత్‌ లో ఆఫర్లు లేని సమయంలో వచ్చిన మరాఠీ మూవీలో కయాదు నటించింది. ఆ సినిమా కూడా ఫెయిల్‌ కావడంతో ఒక ఏడాది గ్యాప్‌ వచ్చింది. 2024లో ఈమె నటించిన సినిమాలు ఏమీ రాలేదు. 2025లో కయాదు 'డ్రాగన్‌' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఒక్కసారిగా బిజీ హీరోయిన్‌గా కయాదు మారింది.

కయాదు లోహర్‌ నటించిన డ్రాగన్‌...

2021 నుంచి కయాదు పలు సినిమాల్లో నటించినా రాని గుర్తింపు ఒక్క డ్రాగన్‌ మూవీతో వచ్చింది. ఆ సినిమా హిట్‌ కావడంతో వచ్చిన గుర్తింపు కారణంగా కయాదుకు పదుల సంఖ్యలో సినిమా ఆఫర్లు వచ్చాయి. అందులోంచి బెస్ట్‌ ఆఫర్లను సెలక్ట్‌ చేసుకుని కయాదు కెరీర్‌ను నిర్మించుకునే పనిలో ఉంది. డ్రాగన్‌ సినిమా తర్వాత కయాదు ఇప్పటి వరకు దాదాపుగా పది సినిమాలకు కమిట్‌ అయింది. ఏడాది కాలంలో ఆమె ఏకంగా పది కొత్త సినిమాలకు సైన్ చేసిందంటూ వార్తలు వస్తున్నాయి. కయాదు లోహర్‌ టాలీవుడ్‌లో ఫంకీ సినిమాలోనూ నటించింది. డ్రాగన్‌తో వచ్చిన గుర్తింపు కారణంగా ఫంకీ సినిమాతో టాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇచ్చింది. కానీ ఫలితం తారుమారు అయింది. ఆ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్‌ కాలేదు. అయినా కూడా నాని 'ది ప్యారడైజ్‌' మూవీలో నటించే అవకాశాన్ని దక్కించుకుని కెరీర్‌ బెస్ట్‌ ఛాన్స్ ను కొట్టేసింది.

ది ప్యారడైజ్‌ మూవీలో హీరోయిన్‌గా...

కయాదు 2026లో ఇప్పటి వరకు ఆరు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరో నాలుగు సినిమాల్లోనూ ఈమె నటిస్తోంది. ఈ ఏడాదిలో మరో రెండు మూడు సినిమాలతో కయాదు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఇదే సమయంలో కయాదు ఏకంగా తమిళ స్టార్‌ హీరోలు సూర్య, శివ కార్తికేయన్‌లతోనూ సినిమాలు చేసేందుకు సైన్‌ చేసింది. ఆ రెండు సినిమాలు వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ముఖ్యంగా సూర్య హీరోగా టి జె జ్ఞానవేల్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సూర్య48 సినిమాలో కయాదు లోహర్‌ హీరోయిన్‌గా ఎంపిక అయింది. ఇప్పటికే షూటింగ్‌ సైతం ప్రారంభించినట్లు తమిళ మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. తాజాగా తమిళ యంగ్‌ స్టార్‌ శివ కార్తికేయన్‌ తో కలిసి ఎస్‌కే27 సినిమాలోనూ నటించేందుకు రెడీ అయింది. ఈ రెండు సినిమాలు ఈమె కోలీవుడ్‌ కెరీర్‌ను డిసైడ్‌ చేస్తాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

తమిళ హీరోలు సూర్య, శివ కార్తికేయన్‌లకు జోడీగా కయాదు..

ఇండస్ట్రీలో అడుగు పెట్టి కయాదు అయిదు ఏళ్లు అవుతున్నా ఇప్పటి వరకు ఒకే ఒక్క కమర్షియల్‌ బ్లాక్‌ బస్టర్‌ దక్కించుకుంది. అయినా కూడా చేతి నిండా ఆఫర్లు ఉన్నాయి. టాలీవుడ్‌లో ది ప్యారడైజ్‌ సినిమాతో మూడో సారి తన అదృష్టంను పరీక్షించుకున్న కయాదుకు నిరాశే మిగిలిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సినిమా ఫలితం విషయం పక్కన పెడితే సినిమాలో ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యత దక్కలేదు అనేది సినిమా చూసిన వారి అభిప్రాయం. కయాదు లక్‌తో వరుసగా ఆఫర్లు అయితే దక్కించుకుంటుంది. కానీ ఆ ఆఫర్లు హిట్స్‌గా మారితేనే ఇండస్ట్రీలో ఎక్కువ కాలం నిలదొక్కుకోగలదు. హిట్స్ లేకుండా ఇండస్ట్రీలో ఎక్కువ కాలం మనుగడ సాధ్యం కాదు. కనుక కయాదు కాస్త సీరియస్‌గా సినిమాలను ఎంపిక చేసుకుంటే ఉత్తమం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కయాదుకు వచ్చే ఏడాదిలో అయినా డ్రాగన్‌ రేంజ్‌ కమర్షియల్‌ హిట్‌ పడేనా చూడాలి.