కయాదు బ్యూటీతో పాగల్ పనులా?
అయితే తదుపరి రిలీజ్ అయ్యే ట్రైలర్ లో హీరో-హీరోయిన్ మధ్య రొమాంటిక్ యాంగిల్ ని కూడా హైలైట్ చేస్తాడు? అన్నది తాజా సమాచారం.
By: Tupaki Desk | 11 Oct 2025 12:52 PM IST`జాతిరత్నాలు` ఫేం అనుదీప్ .కె.వి సినిమాలు ఎలా ఉంటాయన్నది చెప్పాల్సిన పనిలేదు. `పిట్టగోడ`, `జాతిరత్నాలు` లాంటి చిత్రాలు ఆద్యంతం వినోదాత్మకంగా తెరకెక్కినవే. వాటిలో వినోదం మాత్రమే ప్రధానంగా హైలైట్ అయింది. యూత్ పుల్ కామెడీతో ప్రేక్షకుల్ని అలరించాడు. అటుపై `ప్రిన్స్`తో రొమాంటిక్ కామెడీ జానర్ ని టచ్ చేసాడు. అయితే అందులో రొమాంటిక్ డోస్ పెద్దగా హైలైట్ కాలేదు. ఈనేపథ్యంలో `ఫంకీ`లో కాస్త డోస్ పెంచాడు? అన్నది తాజా సమాచారం. ప్రస్తుతం విశ్వక్ సేన్, కయాదు లోహార్ జంటగా `ఫంకీ` తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే.
అనుదీప్ శైలి కామెడీ.. విశ్వక్ శైలి అల్లరి టీజర్ లో హైలైట్ అవుతుంది. అయితే తదుపరి రిలీజ్ అయ్యే ట్రైలర్ లో హీరో-హీరోయిన్ మధ్య రొమాంటిక్ యాంగిల్ ని కూడా హైలైట్ చేస్తాడు? అన్నది తాజా సమాచారం. సినిమాలో కయా దు లోహార్ నిర్మాత పాత్ర పోషిస్తుంది. ఆ లేడీ నిర్మాతతో ప్రేమాయణం నడిపే క్రమంలో విశ్వక్ సేన్ లో పాగల్ వేశాలకు పెద్ద పీట వేస్తున్నాడుట. కొన్ని సీన్స్ లో డబుల్ మీనింగ్ డైలాగులతో పాటు, ఓలిప్ లాక్ సన్నివేశం కూడా ఉంటుందని లీకులందుతున్నాయి. మనస్పూర్తిగా నవ్వుకునే హాస్యంతో పాటు, ఉత్సాహంగా కనిపింరచే జంట మధ్య రొమాంటిక్ యాంగిల్ ని టచ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
మరి వీటిని అనుదీప్ ఎంత అందంగా మలుస్తాడు? అన్నది చూడాలి. వినోదం మాత్రమే గుర్తొచ్చే అనుదీప్ లో కొత్త యాంగిల్ ని కూడా తట్టిలేపుతున్నట్లు ఫంకీ ప్రూవ్ చేయబోతుంది. అనుదీప్-విశ్వక్ సేన్ లకు ఈ సినిమా విజయం కూడా కీలకమైంది. రొమాంటిక్ సన్నివేశాల పరంగా విశ్వక్ ఎక్కడా తగ్గే నటుడు కాదు. గతంలో యూత్ టార్గెట్ గా విశ్వక్ సినిమాలు ఎలా ఉంటాయి? అన్నది ఓ ఐడియా ఉంది. అతడిలో బోల్డ్ యాంగిల్ కొన్ని విమర్శలకు కూడా దారి తీసింది. అలాగే కయాదు లోహర్ కి యూత్ లో మంచి క్రేజ్ ఉంది.
డ్రాగన్ సినిమాతో తానేంటో నిరూపించింది. అందులో కనిపించింది కాసేపే అయినా కుర్రాళ్లను ఊపేసే పాత్రలో అలరించింది. రొమాంటిక్ సన్నివేశాల పరంగా కయాదు కూడా వెనకడుగు వేసే నటి కాదు. తాను కూడా దర్శకుల హీరోయిన్నే. మరి విశ్వక్- కయాదు లోహర్ మాధ్య రొమాంటిక్ సన్నివేశాలను అనుదీప్ ఎలా బ్యాలెన్స్ చేస్తాడు? అన్నది చూడాలి. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది.
