20 లక్షల నుంచి 2 కోట్లు.. ఇది సూపర్ మాస్..!
హీరోయిన్ గా ఫేట్ మారాలంటే ఒక్క సినిమా చాలని అందరికీ తెలుసు కానీ అలాంటి ఛాన్స్ వచ్చినప్పుడు దాన్ని గుర్తించి అందుకోవడంలోనే అసలైన మజా ఉంటుంది.
By: Tupaki Desk | 24 May 2025 10:00 PM ISTహీరోయిన్ గా ఫేట్ మారాలంటే ఒక్క సినిమా చాలని అందరికీ తెలుసు కానీ అలాంటి ఛాన్స్ వచ్చినప్పుడు దాన్ని గుర్తించి అందుకోవడంలోనే అసలైన మజా ఉంటుంది. అలాంటి అవకాశాన్ని అందుకుని ఇప్పుడు వరుస సినిమాలతో బిజీ అవుతుంది యువ హీరోయిన్ కయదు లోహర్. అంతకుముందు కూడా సినిమాల్లో నటించిన ఈ అమ్మడు ఈమధ్యనే ప్రదీప్ రంగనాథ్ తో డ్రాగన్ సినిమాలో చేసింది. ఈ సినిమా వల్ల అమ్మడికి సూపర్ క్రేజ్ ఏర్పడింది. తన క్యూట్ లుక్స్ మాత్రమే కాదు గ్లామర్ షోకి కుర్రాళ్లు పిచ్చెక్కిపోతున్నారు.
డ్రాగన్ హిట్ తో తెలుగు, తమిళ్ లో వరుస ఆఫర్లు అందుకుంటుంది కయదు లోహార్. తెలుగులో విశ్వక్ సేన్ తో ఫంకీ సినిమా ఛాన్స్ అందుకున్న అమ్మడు తమిళ్ లో శింబు తో జత కడుతుంది. అంతేకాదు మరో రెండు సినిమాలు కూడా లైన్ లో ఉన్నాయని తెలుస్తుంది. ఐతే తనకు వచ్చిన ఈ పాపులారిటీ తో అమ్మడు డిమాండ్ కూడా పెరిగిందని తెలుస్తుంది. మొన్నటిదాకా సినిమాకు 20 లక్షలకు అటు ఇటుగా మాత్రమే రెమ్యునరేషన్ గా తీసుకున్న కయదు లోహర్ ఇప్పుడు సినిమాకు 2 కోట్ల దాకా డిమాండ్ చేస్తుందని తెలుస్తుంది.
కయదు లోహార్ నెక్స్ట్ చేయబోతున్న సినిమాలన్నీ కూడా ఆమె కోరినంత రెమ్యునరేషన్ ఇచ్చి తీసుకోవాల్సిందే. తెలుగులో అమ్మడు ఇదివరకే శ్రీవిష్ణుతో అల్లూరి సినిమా చేయగా అప్పుడు అసలు ఆమెను ఎవరు పట్టించుకోలేదు. కానీ డ్రాగన్ సినిమా తర్వాత తెలుగు ఆడియన్స్ కూడా కయదు మాయలో పడిపోయారు. ఆమె చేస్తున్న ఫంకీ సినిమాపై సూపర్ బజ్ ఏర్పడేలా చేశారు.
ఫంకీ మాత్రమే కాదు కయదు ఇంకా వరుస తెలుగు సినిమాలు చేయాలని కోరుతున్నారు. డ్రాగన్ తర్వాత అమ్మడి సోషల్ మీడియా ఫాలోవర్స్ సంఖ్య కూడా పెరిగింది. మొత్తానికి సినిమాకు 20 లక్షల రెమ్యునరేషన్ తీసుకునే రేంజ్ నుంచి 2 కోట్ల దాకా తీసుకునే స్థాయికి చేరుకుంది కయదు. డ్రాగన్ లాంటి హిట్ మరోటి పడితే మాత్రం తప్పకుండా అమ్మడికి స్టార్ స్టేటస్ వచ్చి తీరుతుందని చెప్పొచ్చు. కయదు లోహర్ క్రేజ్ చూసి మిగతా హీరోయిన్స్ అంతా కూడా షాక్ అవుతున్నారు. తెలుగులో ఫంకీతో పాటు మరిన్ని సినిమాలు చేసేలా అమ్మడి ఫాలోవర్స్ జోష్ కనబరుస్తున్నారు.
