Begin typing your search above and press return to search.

స్కై ఈజ్ లిమిట్.. దూసుకెళుతున్న యంగ్ బ్యూటీ!

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఒక యంగ్ బ్యూటీ పేరు మార్మోగిపోతోంది. తక్కువ కాలంలోనే క్రేజీ ప్రాజెక్టులను దక్కించుకుంటూ స్కైలోకి దూసుకెళుతున్న ఈ నటి ఎవ‌రో కాదు.. యంగ్ బ్యూటీ కయాదు లోహర్.

By:  Sivaji Kontham   |   1 July 2026 8:00 AM IST
స్కై ఈజ్ లిమిట్.. దూసుకెళుతున్న యంగ్ బ్యూటీ!
X

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఒక యంగ్ బ్యూటీ పేరు మార్మోగిపోతోంది. తక్కువ కాలంలోనే క్రేజీ ప్రాజెక్టులను దక్కించుకుంటూ స్కైలోకి దూసుకెళుతున్న ఈ నటి ఎవ‌రో కాదు.. యంగ్ బ్యూటీ కయాదు లోహర్. ఇప్ప‌టికిప్పుడు ఈ భామ‌ చేతిలో దాదాపు అరడజను సినిమాలు ఉన్నాయి. మాలీవుడ్ స్టార్ టొవినో థామస్ సరసన `పల్లి చట్టంబి`, విశ్వ‌క్ సేన్ `ఫంకీ` వంటి చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ, కోలీవుడ్‌లో జీవీ ప్రకాష్ సరసన ఓ భారీ చిత్రం `ఇమ్మోర్ట‌ల్‌`లో నటిస్తోంది. అలాగే అధర్వ మురళి, ఫహాద్ ఫాజిల్‌ల కాంబినేషన్‌లో వస్తున్న `ఇదయం మురళి` చిత్రం ఈ నెలలోనే గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. వీటన్నింటితో పాటు నేచురల్ స్టార్ నాని సరసన `ది ప్యారడైజ్` చిత్రంలో సుబ్బు పాత్రలో నటిస్తూ టాలీవుడ్‌లోనూ హాట్ టాపిక్‌గా మారింది.

ఇలాంటి క్రేజీ లైనప్‌లో ఉన్న ఈ ముద్దుగుమ్మకు కెరీర్‌లోనే బిగ్గెస్ట్ జాక్‌పాట్ ఆఫర్ లభించింది. స్టార్ హీరో సూర్య సరసన ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ `హోంబలే ఫిలిమ్స్` నిర్మిస్తున్న పాన్-ఇండియా సినిమాలో కయాదు లోహర్ కథానాయికగా ఎంపికైంది. ఈ భారీ ఆఫర్ల నేపథ్యంలో కయాదు లోహర్ ఒక్కో సినిమాకి ఎంత పారితోషికం తీసుకుంటోంది? ఇప్పుడు పెద్ద బ్యానర్ల సినిమాల కోసం రెమ్యునరేషన్ పెంచిందా? అనే చర్చ ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. పరిశ్రమ సమాచారం ప్రకారం.. ఈ యంగ్ బ్యూటీ ఇప్పటివరకు మీడియం బడ్జెట్- రీజినల్ (మలయాళం, కన్నడ) సినిమాలకు రూ.40 లక్షల నుండి రూ.60 లక్షల వరకు పారితోషికం అందుకుంది. కెరీర్ ప్రారంభంలో ఉన్న హీరోయిన్లకు ఇది ప్రామాణిక పారితోషికం.

అయితే నాని సరసన `ది ప్యారడైజ్`, సూర్య సరసన హోంబలే ఫిలిమ్స్ వంటి పాన్-ఇండియా రేంజ్ ప్రాజెక్టులు చేతికి రావడంతో క‌యాదు డిమాండ్ మార్కెట్లో ఒక్కసారిగా పెరిగింది. ఈ క్రేజ్.. స్టార్ హీరోల సరసన అవకాశాల నేపథ్యంలో కయాదు తన పారితోషికాన్ని భారీగా పెంచేసిందని గుస‌గుస వినిపిస్తోంది. ప్రస్తుతం పెద్ద బ్యానర్లు , మల్టీ-లాంగ్వేజ్ సినిమాల కోసం ఏకంగా రూ.80 లక్షల నుండి రూ.1.2 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. చేతిలో అరడజను సినిమాలు ఉండటం... మార్కెట్ వాల్యూ పెరగడంతో మునుముందు ఈ యంగ్ బ్యూటీ స్టార్ హీరోయిన్ల సరసన `కోటి క్లబ్‌`లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది.

వెండితెరపైనే కాకుండా డిజిటల్ వేదిక‌ల‌పైనా కయాదు లోహర్ హవా నడుస్తోంది. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో 31 లక్షల మంది (3.1 మిలియన్లు) ఫాలోవర్స్ ఉన్నారు. ఈ భారీ ఫాలోయింగ్ - రీచ్‌ను బట్టి సోషల్ మీడియా ప్రమోషన్ల కోసం బ్రాండ్ల నుండి ఈ బ్యూటీ గట్టిగానే వసూలు చేస్తోందిట‌. ఇన్‌స్టాలో ఒక్కో పోస్ట్ లేదా రీల్ ప్రమోషన్ కోసం బ్రాండ్ విలువ, కాంట్రాక్ట్‌ను బట్టి 2 లక్షల నుండి 4 లక్షల వరకు అందుకుంటోంద‌ని స‌మాచారం. కేవలం 24 గంటలు మాత్రమే అందుబాటులో ఉండే ఇన్‌స్టా స్టోరీ ప్రమోషన్ కోసం రూ.75,000 నుండి రూ.1.5 ల‌క్ష‌ల‌ వరకు చార్జ్ చేస్తూ డిజిటల్ మార్కెట్లో తన బ్రాండ్ పవర్‌ను నిరూపించుకుంటోంది.

దీనికి అదనంగా ఎక్స్ - ట్విట్టర్ ప్లాట్‌ఫార్మ్‌పై సినిమా ప్రమోషన్లు లేదా బ్రాండ్ హాష్‌ట్యాగ్ ట్రెండింగ్ కోసం చేసే ఒక్కో ప్రమోషనల్ ట్వీట్ లేదా రీట్వీట్ కోసం కయాదు రూ.50,000 నుండి 1 లక్ష వరకు పారితోషికం అందుకునే ఛాన్సుంద‌ని విశ్లేషిస్తున్నారు. అలాగే పెద్ద కార్పొరేట్ కంపెనీల కోసం `ప్యాకేజీ డీల్స్` కూడా ఆస్కారం ఉంది. ఒకేసారి ఒక రీల్, రెండు స్టోరీలు, ఒక ఎక్స్ పోస్ట్ కలిపి ఇచ్చే కంబైన్డ్ ప్యాకేజీల కోసం కయాదు 4 లక్షల నుండి 6 లక్షల వరకు డిమాండ్ చేసే వీలుంద‌ని సోషల్ మీడియా అన‌లిస్టులు విశ్లేషిస్తున్నారు. ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్న ఈ బ్యూటీ సోష‌ల్ మీడియా ఆదాయంపైనా దృష్టి సారిస్తోంద‌ని స‌మాచారం.