అనుష్కను ఫాలో అవుతున్న అసోం బ్యూటీ?
మన టైమ్ వచ్చేవరకు ఎందులోనూ రాణించలేమని పెద్దలు ఊరికే అనరు. ఫిల్మ్ ఇండస్ట్రీలోని నటీనటులు కూడా అందుకు అతీతులు కాదు.
By: Tupaki Desk | 15 July 2025 4:00 PM ISTమన టైమ్ వచ్చేవరకు ఎందులోనూ రాణించలేమని పెద్దలు ఊరికే అనరు. ఫిల్మ్ ఇండస్ట్రీలోని నటీనటులు కూడా అందుకు అతీతులు కాదు. ఇండస్ట్రీలో ఒక్క సక్సెస్ చాలు కెరీర్ ను మార్చేయడానికి. అలా ఒకే సక్సెస్ తో ఓవర్ నైట్ స్టార్లు అయిన వాళ్లెంతో మంది ఉండగా అందులో అసోం బ్యూటీ కయాదు లోహర్ కూడా ఒకరు. కయాదు తెలుగు ప్రేక్షకులకు అల్లూరి సినిమాతోనే పరిచయమయ్యారు.
కానీ ఆ సినిమా ఫ్లాపవడంతో ఎవరూ ఆమెను పట్టించుకోలేదు. దీంతో కోలీవుడ్ లో సినిమాలు చేస్తున్న కయాదుకు ప్రదీప్ రంగనాథన్ తో చేసిన డ్రాగన్ సినిమా సక్సెస్ మంచి ఊరటనిచ్చింది. ఆ సినిమాలో అమ్మడిని చూసి అంతా ఫ్లాటైపోయారు. డ్రాగన్ సక్సెస్ తో అమ్మడుకి మళ్లీ టాలీవుడ్ నుంచి ఆఫర్లు వెళ్లాయి. ఆల్రెడీ విశ్వక్సేన్ ఫంకీ సినిమాలో కయాదు లోహర్ హీరోయిన్ గా నటిస్తున్నారు.
ఇప్పుడు కయాదుకు మరో బంపరాఫర్ వచ్చింది. అదే నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ సినిమా. వీరిద్దరి కాంబినేషన్ లో దసరా అనే సినిమా వచ్చి అది బ్లాక్ బస్టర్ గా నిలవడంతో ది ప్యారడైజ్ పై ముందు నుంచి అందరికీ భారీ అంచనాలున్నాయి. దానికి తోడు ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన గ్లింప్స్ సినిమాపై ఆసక్తిని పెంచేసింది.
ఈ సినిమాలో నానికి జోడీగా కయాదు లోహారు ఎంపికైందని తెలుస్తోంది. అంతే కాదు, ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ పై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ది ప్యారడైజ్ లో హీరోయిన్ సెక్స్ వర్కర్ గా కనిపించనుందని తెలుస్తోంది. మామూలుగా ఎవరైనా అయితే వేశ్య పాత్ర అనగానే కాస్త ఆలోచిస్తారు కానీ కయాదు మాత్రం అవేమీ ఆలోచించకుండా ఓకే చెప్పినట్టు తెలుస్తోంది.
వేశ్య పాత్ర అంటే మామూలుగానే గ్లామర్ షో చేయాల్సి ఉంటుంది దాంతో పాటూ బోల్డ్ సీన్స్ కూడా చేయాలి. అయినప్పటికీ కయాదు ఏ మాత్రం లెక్క చేయకుండా ది ప్యారడైజ్ ను ఓకే చేసిందంటే ఆ కథ అమ్మడిని ఎంతగా ఎగ్జైట్ చేసిందో అర్థమవుతుంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ పాత్రపై మేకర్స్ నుంచి మాత్రం ఎలాంటి ప్రకటనా వచ్చింది లేదు. ఒకవేళ హీరోయిన్ పాత్రపై వస్తున్న వార్తలు నిజమే అయి, కయాదు ఆ పాత్రలో ఆకట్టుకుంటే మాత్రం ఆమె కెరీర్ నెక్ట్స్ లెవెల్ కు వెళ్లడం ఖాయం. గతంలో వేదం సినిమాలో అనుష్క కూడా వేశ్య పాత్రలో కనిపించి ఆడియన్స్ ను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు కయాదు కూడా ఆమె దారిలోనే వెళ్లి అనుష్కలానే సక్సెస్ అవుతారేమో చూడాలి.
