ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్.. మ్యాజిక్ రిపీట్ చేస్తుందా?
రీసెంట్ గా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ గా నిలిచిన డ్రాగన్ మూవీతో అసోం బ్యూటీ కాయదు లోహర్ స్టార్ అయిపోయిందని చెప్పాలి.
By: Tupaki Desk | 10 May 2025 11:00 PM ISTకొందరు హీరోయిన్లు.. ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్స్ గా మారిపోతుంటారు. సూపర్ క్రేజ్ దక్కించుకుని పాపులర్ అయిపోతుంటారు. రీసెంట్ గా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ గా నిలిచిన డ్రాగన్ మూవీతో అసోం బ్యూటీ కాయదు లోహర్ స్టార్ అయిపోయిందని చెప్పాలి. కుర్రకారు మతులు పోగొట్టిన ఆమెకు మంచి ఫ్యాన్ బేస్ సొంతమైంది.
ఇప్పుడు వరుస అవకాశాలు దక్కించుకుని కాయదు దూసుకుపోతుందని చెప్పాలి. కోలీవుడ్ లో పలు సినిమాల్లో నటిస్తున్న అమ్మడు.. తెలుగులో వివిధ ప్రాజెక్టుల్లో హీరోయిన్ గా ఎంపికైంది. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఫంకీలో ఫిమేల్ లీడ్ రోల్ పోషిస్తున్న బ్యూటీ.. ప్యారడైజ్ లో నానితో జతకట్టనున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.
అయితే కోలీవుడ్ లో శింబు STR 49లో యాక్ట్ చేస్తున్న కాయదు లోహర్.. జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా తెరకెక్కుతున్న ఇమ్మోర్టల్ లో నటిస్తున్నారు. మరియప్పన్ చిన్నా దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రమోషన్స్ లో భాగంగా మేకర్స్.. రీసెంట్ గా కాయదు ఫస్ట్ లుక్ పోస్టర్ ను నెట్టింట రిలీజ్ చేశారు.
పోస్టర్ తో కాయదు హీట్ పుట్టించారనే చెప్పాలి. ఓ పోస్టర్ లో రొమాంటిక్ గా చూస్తున్న అమ్మడు.. మరో పోస్టర్ లో బాత్ టబ్ లో కనిపించారు. దీంతో అవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పోస్టర్స్ సూపర్ గా ఉన్నాయని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. వరుస హిట్స్ అందుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.
అయితే కోలీవుడ్ లో డ్రాగన్ తో మ్యాజిక్ చేసిన కాయదు.. ఇప్పుడు ఇమ్మోర్టల్ తో ఏం చేస్తుందన్నది హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే జీవీ ప్రకాష్ కుమార్.. కొంత కాలంగా సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నారు. పలు సినిమాల్లో నటించినా అనుకున్న స్థాయిలో ఆడియన్స్ ను మెప్పించలేకపోయారు. హిట్స్ అందుకోలేకపోయారు.
ఇప్పుడు ఇమ్మోర్టల్ తో అలరించాలని చూస్తున్నారు. అయితే కాయదు ఫ్యాక్టర్ జీవీకి యూజ్ అయ్యే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో ఆమె యాక్ట్ చేసిన మరో తమిళ చిత్రం ఇదియమ్ మురళి రిలీజ్ కు సిద్ధంగా ఉంది. మరి వరుస ప్రాజెక్టులతో కాయదు లోహర్.. సినీ ప్రియులను ఎలా మెప్పిస్తుందో.. ఎలాంటి హిట్స్ అందుకుంటారో వేచి చూడాలి.
