ఒక్క హిట్ తో అంత పెంచేసిందా?
అలా తెలుగులో అల్లూరి, మరాఠి భాషలో ఓ సినిమా చేసింది కానీ అవేమీ అమ్మడికి క్రేజ్ ను తెచ్చిపెట్టలేదు.
By: Tupaki Desk | 17 May 2025 11:25 AM ISTఇండస్ట్రీలో అన్నీ అనుకున్నంత ఈజీగా రావు. చూడ్డానికి, చెప్పడానికే రంగుల ప్రపంచం కానీ సినీ ఇండస్ట్రీలో ఉన్నన్ని ఇబ్బందులు, సమస్యలూ ఎందులోనూ ఉండవనిపిస్తుంది అందులో ఉండేవారికి. చిత్ర పరిశ్రమలో ఎవరెప్పుడు సక్సెస్ అవుతారో ఎవరూ చెప్పలేం. కొంతమందికి ఎన్నో ఏళ్లుగా దొరకని స్టార్‌డమ్ ఒక్క సినిమాతో వచ్చేస్తుంది.
ఇప్పుడు హీరోయిన్ కయ్యదు లోహర్ ది కూడా ఇదే సిట్యుయేషన్. ముకిల్ పేట్ అనే కన్నడ సినిమాతో 2021లో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కయ్యదు, ఆ సినిమాతో మంచి రిజల్ట్ ఏమీ అందుకోలేదు. ఆ తర్వాత మలయాళంలోకి వెళ్లి అక్కడ పత్తొండదామ్ నూట్రాండు అనే మూవీతో తన లక్ ను టెస్ట్ చేసుకుంది కానీ అది కూడా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది.
అలా తెలుగులో అల్లూరి, మరాఠి భాషలో ఓ సినిమా చేసింది కానీ అవేమీ అమ్మడికి క్రేజ్ ను తెచ్చిపెట్టలేదు. అలా అని అమ్మడికి ఆఫర్లు రావట్లేదా అంటే వస్తున్నాయి. సినిమాలు ఆడకపోయినా తన లక్ తో అవకాశాలను అందుకున్న కయ్యదు రీసెంట్ గా తమిళంలో చేసిన డ్రాగన్ సినిమా మంచి హిట్ ను అందించింది.
డ్రాగన్ తర్వాత అమ్మడి లక్ కు సక్సెస్ కూడా తోడవడంతో దర్శకనిర్మాతలు ఇప్పుడు కయ్యదు వెనుక పడుతున్నారు. ఇప్పటికే పలు సినిమాలకు సైన్ చేసిన అమ్మడు తన డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని పారితోషికాన్ని పెంచిందని తెలుస్తోంది. డ్రాగన్ సినిమాకు రూ.30 లక్షలు మాత్రమే తీసుకున్న కయ్యదు ఆ సినిమా హిట్ తర్వాత మరో రూ.70 లక్షలు అందుకుందని సమాచారం.
ఇప్పుడు తన రాబోయే సినిమాలకు కయ్యదు తన రెమ్యూనరేషన్ ను రూ. 2 కోట్లకు పెంచిందని తెలుస్తోంది. దానికి కారణం శింబు, ధనుష్ లాంటి స్టార్ హీరోల సరసన అమ్మడు నటిస్తుండటమే. ప్రస్తుతం అధర్వతో ఇదయం మురళితో పాటూ, జీవీ ప్రకాష్ కుమార్‌తో ఇమ్మార్టల్ సినిమా చేస్తున్న కయ్యదు, మరోవైపు శింబుతో సినిమాకు రెడీ అవుతోంది. ఇవి కాకుండా ధనుష్- విఘ్నేష్ రాజా కాంబోలో వచ్చే సినిమాతో పాటూ తమిళరసన్-ధనుష్ కలయిక లో తెరకెక్కే సినిమాలో కూడా కయ్యదును తీసుకోవాలని అనుకుంటున్నారట. అన్నీ కుదిరి ధనుష్ తో కూడా నటిస్తే కయ్యదు తన రెమ్యూనరేషన్ ను మరింత పెంచినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మొత్తానికి డ్రాగన్ సినిమా అమ్మడి జీవితాన్ని ఒక్కసారిగా మార్చేసింది.
