డ్రాగన్ బ్యూటీ.. అగ్గిరాజేసే అందం..!
ఒక్క సినిమా హిట్టు పడితే చాలు సినీ పరిశ్రమలో తమ ఫేట్ మారిపోతుంది. అప్పటిదాకా సినిమాలు చేసినా కూడా ఒక్క హిట్ సినిమా వల్ల డజన్ల కొద్దీ ఛాన్స్ లు వస్తుంటాయి.
By: Tupaki Desk | 18 July 2025 9:03 PM ISTఒక్క సినిమా హిట్టు పడితే చాలు సినీ పరిశ్రమలో తమ ఫేట్ మారిపోతుంది. అప్పటిదాకా సినిమాలు చేసినా కూడా ఒక్క హిట్ సినిమా వల్ల డజన్ల కొద్దీ ఛాన్స్ లు వస్తుంటాయి. ప్రస్తుతం ఇలాంటి ఫేజ్ లోనే ఉంది డ్రాగన్ బ్యూటీ కయదు లోహర్. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఇప్పటికే సినిమాలు చేస్తున్నా కూడా అమ్మడు అంతగా పాపులర్ అవ్వలేదు. తెలుగులో ఆల్రెడీ శ్రీవిష్ణుతో అల్లూరి సినిమా చేసింది కయదు లోహార్.
ఆ టైంలో అమ్మడిని అసలు ఎవరు పట్టించుకోలేదు. కానీ ప్రదీప్ రంగనాథ్ డ్రాగన్ సినిమా రిలీజైన దగ్గర నుంచి కయదు కనిపిస్తే చాలు హడావిడి చేస్తున్నారు. కయదుకి వచ్చిన ఈ క్రేజ్ ఆమెకు వరుస అవకాశాలు వచ్చేలా చేస్తున్నాయి. డ్రాగన్ సినిమాలో కయదు గ్లామర్ షో కుర్రాళ్లని ఎట్రాక్ట్ చేసింది. కయదు తెలుగులో కూడా మంచి క్రేజ్ సంపాదించింది.
ప్రస్తుతం అమ్మడు మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తో ఫంకీ సినిమాలో నటిస్తుంది. రవితెజ అనార్కలిలో కూడా ఉందని టాక్. ఐతే ఎలాగు సినిమా ఆఫర్లతో సూపర్ జోష్ లో ఉన్న కయదు అది చాలదు అన్నట్టుగా తన సోషల్ మీడియా ఫోటో షూట్స్ తో కూడా అదరగొట్టేస్తుంది. అమ్మడి ఫోటో షూట్స్ ఇలా షేర్ చేస్తే అలా వైరల్ అవుతున్నాయి.
లేటెస్ట్ గా కయదు లోహర్ చంకీల డ్రెస్ లో తళతళ మెరుస్తుంది. ఈ ఫోటో షూట్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అగ్గి రాజేస్తున్న అందం.. గుండెల్ని గుచ్చేసే చూపులతో కయదు హృదయాలను మెలిపెట్టెస్తుందని చెప్పొచ్చు. డ్రాగన్ ఒక్క హిట్ తోనే అమ్మడు ఈ రేంజ్ పాపులారిటీ సంపాధించగా ఇక నెక్స్ట్ అమ్మడి ఖాతాలో మరో హిట్ పడితే మాత్రం ఇక తిరుగు లేని క్రేజ్ తెచ్చుకునేలా ఉంది. తెలుగులో మాత్రం కయదుకి మంచి బజ్ ఏర్పడింది. విశ్వక్ సేన్ తో ఫంకీ సినిమాలో ఆమె స్పెషల్ ఎట్రాక్షన్ అవుతుందని చెప్పొచ్చు. అనుదీప్ డైరెక్షన్ లో వస్తున్న ఫంకీతో కయదు టాలీవుడ్ కి మరోసారి రీ ఎంట్రీ ఇస్తుంది.
తనకు వచ్చిన ఈ క్రేజ్ ని ఎంజాయ్ చేస్తున్న కయదు రెగ్యులర్ ఫోటో షూట్స్ తో ఫాలోవర్స్ ని ఎంటర్టైన్ చేస్తుంది. కయదు గ్లామర్ షోకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. చూస్తుంటే అమ్మడు సౌత్ లో టాప్ రేంజ్ కి వెళ్లేలా ఉందని చెప్పొచ్చు.
