Begin typing your search above and press return to search.

ఆ ముగ్గురు భామ‌ల‌కు డిమాండ్!

హీరోయిన్లు ఎంతో మంది వ‌స్తుంటారు. వెళ్తుంటారు. కానీ కొంద‌రు మాత్రమే ఫేమ‌స్ అవుతుంటారు చేసింది ఒక్క సినిమా అయినా ఓ వైబ్ క్రియేట్ చేస్తుంటారు.

By:  Tupaki Desk   |   18 May 2025 2:00 AM IST
ఆ ముగ్గురు భామ‌ల‌కు డిమాండ్!
X

హీరోయిన్లు ఎంతో మంది వ‌స్తుంటారు. వెళ్తుంటారు. కానీ కొంద‌రు మాత్రమే ఫేమ‌స్ అవుతుంటారు చేసింది ఒక్క సినిమా అయినా ఓ వైబ్ క్రియేట్ చేస్తుంటారు. ఈ మ‌ధ్య కాలంలో అలాంటి వైబ్ తెచ్చింది ఎవ‌రంటే? కయాదు లోహ‌ర్, ఇవానా, మ‌మ‌తా బైజ్ అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. `డ్రాగ‌న్` సినిమా తో క‌యాదు లోహార్ ఏ రేంజ్ లో ఫేమ‌స్ అయిందో తెలిసిందే. అమ్మ‌డు హాట్ అప్పిరియ‌న్స్ తోనే రీచ్ అయిపోయింది.

త‌మిళ అనువాద చిత్రంతోనే తెలుగులో ఫ్యాన్స్ ని సంపాదించుకుంది. అటుపై సోష‌ల్ మీడియా లో మ‌రింత ఫేమ‌స్ అయింది. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ త‌మిళ్ లోనే మూడు సినిమాలు చేస్తోంది. తెలుగులోనూ అవ‌కాశాలు వ‌స్తున్నాయి. మైత్రీ మూవీ మేక‌ర్స్ లో ఓ సినిమాకి అగ్రిమెంట్ చేసుకున్న‌ట్లు స‌మాచారం. ఇంకా న‌వ‌త‌రం ద‌ర్శ‌కులు అమ్మ‌డికి క‌థ‌లు వినిపిస్తున్నారు. అమ్మ‌డికి ఉన్న యువ క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని ఛాన్స‌లిస్తున్నారు.

కేర‌ళ కుట్టి ఇవానా క‌యాదు కంటే ముందే కోలీవుడ్ లో ఫేమ‌స్ అయింది. `ల‌వ్ స్టోరీ` సినిమాతో తెలుగు ఆడియ‌న్స్ కు బాగా రీచ్ అయింది. `డ్రాగ‌న్` లో క్లైమాక్స్ ఎంట్రీలోనూ అదర‌గొట్టింది. ఇవానా రాక‌తో థియేట‌ర్లు ద‌ద్ద‌రిల్లాయి. దీంతో అమ్మ‌డు టాలీవుడ్ కి ఏ రేంజ్ లో క‌నెక్ట్ అయిందో అర్ద‌మైంది. ప్రస్తుతం తెలుగు సినిమాల్లో కూడా అవకాశాలు అందుకుంటుంది. ఇటీవ‌లే రిలీజ్ అయిన సింగిల్ లో లీడ్ రోల్ పోషించి అల‌రించింది.

ఈ సినిమా మంచి విజ‌యం సాధించ‌డంతో మ‌రోసారి అమ్మ‌డి పేరు హైలైట్ అవుతుంది. అమ్మ‌డి ట్యాలెంట్ కి మ‌రిన్ని తెలుగు సినిమా ఛాన్సులు ఖాయం. `ప్రేమ‌లు` చిత్రంతో ఇలాగే సంచ‌ల‌నం మైంది మ‌మ‌తా బైజు. ప్ర‌స్తుతం కోలీవుడ్ లో బిజీగా ఉంది. తెలుగులోనూ అవ‌కాశాలు వ‌స్తున్నాయి. కానీ స‌రైన క‌థ‌లైతే త‌ప్ప క‌మిట్ అవ్వ‌నంటోంది. వీళ్లంతా ఒకే ఒక్క సినిమాతో ఫేమ‌స్ అయిన బ్యూటీలే.