Begin typing your search above and press return to search.

క‌రోనా రాక‌పోతే హీరోయిన్ ఛాన్స్ వ‌చ్చేది కాదా!

భ‌విష్య‌త్ లో పూర్తి మాస్ యాక్ష‌న్ సినిమా చేయాల‌ని ఉంది. అలాగే సూప‌ర్ నేచుర‌ల్ చిత్రాలు చేయాల‌ని ఉంది.

By:  Tupaki Desk   |   7 Feb 2024 5:30 PM GMT
క‌రోనా రాక‌పోతే హీరోయిన్ ఛాన్స్ వ‌చ్చేది కాదా!
X

`ఏక్ మినీ క‌థ‌`..`బిచ్చ‌గాడు -2` చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల్ని మెప్పించిన కావ్యాథాప‌ర్ సుప‌రిచిమ‌తే. అమ్మడు ఐదేళ్ల క్రిత‌మే జ‌ర్నీ ప్రారంభించినా ఫేమ‌స్ అవుతుంది ఈ మ‌ధ్య కాలంలోనే. తాజాగా మాస్ రాజా ర‌వితేజ హీరోగా న‌టించిన `ఈగ‌ల్` చిత్రంలోనూ న‌టించింది. కావ్యా ధాప‌ర్ కెరీర్ లో టాలీవుడ్ లో ఇదే అతి పెద్ద ఛాన్స్. దీంతో ఈ సినిమాపై ఆశ‌లు భారీగానే పెట్టుకుంది. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాల‌తో సినిమాకి మంచి హైప్ క్రియేట్ అవుతోంది.


ఈ నేప‌థ్యంలో అమ్మ‌డు కెరీర్ జ‌ర్నీ గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. దేవుడు ద‌యవ‌ల్ల కోవిడ్ లాక్ డౌన్ విరామం మంచి మేలు చేసిందంటోంది.` ఆ స‌మ‌యంలోనే `ఏక్ మినీ క‌థ‌`..`ప‌ర్జీ` లాంటి చాత్రాలు చేయ‌గ‌లిగాను. లాక్ డౌన్ కార‌ణంగా కుటుంబంతో గ‌డిపే స‌మ‌యం కూడా దొరికింది. అప్ప‌టి వర‌కూ ఏదో ప‌ని అంటూ బ‌య‌టే తిరిగే దాన్ని. కానీ వైర‌స్ కార‌ణంగా ఇంట్లోనే కూర్చున్నాను. అప్పుడే కుటుంబంతో ఎంతో విలువైన స‌మ‌యాన్ని మిస్ అయ్యాను ఇంత కాలం అనిపించింది.

భ‌విష్య‌త్ లో పూర్తి మాస్ యాక్ష‌న్ సినిమా చేయాల‌ని ఉంది. అలాగే సూప‌ర్ నేచుర‌ల్ చిత్రాలు చేయాల‌ని ఉంది. ప్ర‌స్తుతం రామ్ తో డ‌బుల్ ఇస్మార్ట్ చేస్తున్నా. అలాగే గోపీచంద్ హీరోగా న‌టిస్తోన్న `విశ్వం`లోనూ న‌టిస్తున్నా. రెండు మంచి సినిమాలు` అని తెలిపింది. ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడించిన కోవిడ్ లాక్ డౌన్ స‌మ‌యాన్ని చాలా మంది స‌ద్వినియోగం చేసుకున్నారు. నిత్యం సినిమాల‌తో బిజీగా ఉన్న హీరో-హీరోయిన్లు అంతా త‌మకిష్ట‌మైన ప‌నులు చేసారు.

చాలా మంది పుస్త‌కాలు ఎక్కువ‌గా చ‌ద‌వి నాలెడ్జ్ పెంచుకున్నారు. ఇన్ స్టాలో రీల్స్ చేసి సంపాద‌న చేసుకున్న వారు హీరోయిన్లు మ‌రికొంత మంది. గ‌ర్బిణీలంతా బేబి ప్రొడ‌క్ట్ ల‌ను ఎండార్స్ చేసి ఖాళీ స‌మ‌యంలోనూ ఎలా సంపాదించాలి ? అన్న‌ది నిరూపించారు. ఇన్ స్టా రీల్స్ తో హీరోయిన్ గా ఛాన్సుల అందుకున్న వారు ఎంతో మంది. అదే సమ‌యంలో వెబ్ సిరీస్ ల‌తోనూ పులువురు కొత్త భామ‌లు ప‌రిచ‌మ‌య్యారు.