Begin typing your search above and press return to search.

లంగా వోణిలో బలగం పాప మైండ్ బ్లాక్

నిత్యం గ్లామరస్ ఫోటో షూట్స్ తో నెటిజన్స్ ని తన వైపు తిప్పుకుంటోంది. ఎప్పుడూ తన హాట్ లుక్స్ తో నెట్టింట రచ్చ చేసే కావ్య కళ్యాణ్ రామ్ తాజాగా లంగా వోని లో దర్శనమిచ్చింది.

By:  Tupaki Desk   |   20 Nov 2023 1:18 PM GMT
లంగా వోణిలో బలగం పాప మైండ్ బ్లాక్
X

టాలీవుడ్ లో అగ్ర హీరోల సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన కావ్య కళ్యాణ్ రామ్ 'బలగం' సినిమాతో బ్లాక్ బాస్టర్ సక్సెస్ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో హీరో మరదలిగా తెలంగాణ యాసలో డైలాగ్స్ అదరగొట్టింది. జబర్దస్త్ కమెడియన్ వేణు డైరెక్ట్ చేసిన ఈ మూవీ 100కు పైగా అవార్డులు అందుకుంది. ఈ సినిమాతో హీరోయిన్ గా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది కావ్య కళ్యాణ్ రామ్.


బలగం సక్సెస్ తో ఈ హీరోయిన్ కి బాగానే అవకాశాలు వచ్చాయి. బలగం కంటే ముందు మసూద్ అనే హారర్ సినిమాలో హీరోయిన్ గా నటించింది. సినిమా మంచి విజయం అందుకున్నా అందులో తన పాత్రకి ప్రాముఖ్యత లేకపోవడంతో పెద్దగా గుర్తింపు రాలేదు. ఇక బలగంతో హీరోయిన్ గా లైమ్ లైట్ లోకి వచ్చిన కావ్య కళ్యాణ్ రామ్ సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది.


నిత్యం గ్లామరస్ ఫోటో షూట్స్ తో నెటిజన్స్ ని తన వైపు తిప్పుకుంటోంది. ఎప్పుడూ తన హాట్ లుక్స్ తో నెట్టింట రచ్చ చేసే కావ్య కళ్యాణ్ రామ్ తాజాగా లంగా వోని లో దర్శనమిచ్చింది. తన నడుమ అందాలు హైలైట్ అయ్యేలా లంగా వోని ధరిస్తూ రకరకాల ఫోజుల్లో ఫోటోలు దిగింది. దీంతో ప్రస్తుతం ఆ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. లేత గులాబీ ఆకుపచ్చ రంగులో ఉన్న లంగా వోణి ధరించిన కావ్య కళ్యాణ్ రామ్ ని చూసి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.


ఈమె లేటెస్ట్ పిక్స్ చూసిన కొందరు నెటిజన్స్ లంగా వోణీలో కావ్య కళ్యాణ్ రామ్ అదిరిపోయిందని, జీన్స్ టాప్స్ కంటే లంగా వోణిలోనే చాలా బాగున్నావని, లంగా వోణిలో ఎంతో పద్ధతిగా ఉందంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఇక కెరీర్ పరంగా కావ్య కళ్యాణ్ రామ్ చివరగా 'ఉస్తాద్' మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.


శ్రీసింహ హీరోగా నటించిన ఈ మూవీ డిఫరెంట్ సబ్జెక్ట్ తో ఆడియన్స్ ముందుకు రాగా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. 'మసూద', 'బలగం' తో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ అందుకున్న కావ్య కళ్యాణ్ రామ్ హ్యాట్రిక్ 'ఉస్తాద్' తో ఎలాగైనా హ్యాట్రిక్ హిట్ అందుకోవాలని అనుకుంది. కానీ ఉస్తాద్ ప్లాప్ అవ్వడంతో చివరికి ఆమెకి నిరాశే ఎదురయింది.