Begin typing your search above and press return to search.

బెల్లంకొండ కావ్య ఏం చేస్తోందో తెలుసా.. సాయి శ్రీనివాస్ కి ఇక భయం లేదండోయ్!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బడా నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న సురేష్ వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్.

By:  Madhu Reddy   |   7 May 2026 9:54 AM IST
బెల్లంకొండ కావ్య ఏం చేస్తోందో తెలుసా.. సాయి శ్రీనివాస్ కి ఇక భయం లేదండోయ్!
X

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బడా నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న సురేష్ వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. అల్లుడు శీను సినిమా ద్వారా ప్రేక్షకులను పలకరించిన ఈయన మొదటి సినిమాతోనే తన నటనతో అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో అప్పటికే స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న సమంత నటించడం ఈ సినిమాకు మరింత ప్లస్ అయింది. అలా మొదటి సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఆ తర్వాత స్పీడున్నోడు, జయ జానకి నాయక, సాక్ష్యం, కవచం, సీత, రాక్షసుడు ఇలా పలు చిత్రాలు చేసి ప్రేక్షకులను మెప్పించారు.

ఇక చివరిగా భైరవం, కిష్కింధపురి సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈయన సడన్ గా తాను రెండు సంవత్సరాలుగా ఒక అమ్మాయిని ప్రేమించానని, ఆ అమ్మాయితో పెళ్లికి సిద్ధం అవుతున్నాను అంటూ ప్రీ ఎంగేజ్మెంట్ జరుపుకొని అభిమానులను సర్ప్రైజ్ చేశారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులు , సన్నిహితుల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. 2026 ఏప్రిల్ 29 బుధవారం రాత్రి 11:05 గంటల సమయంలో కుటుంబ సభ్యులు, సినీ, రాజకీయ ప్రముఖులు సన్నిహితుల సమక్షంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి సాక్షిగా కావ్య రెడ్డి మెడలో మూడు ముళ్ళు వేశారు.

ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అంతేకాదు మే 1వ తేదీన సినీ, రాజకీయ ప్రముఖుల కోసం హైదరాబాద్ వేదికగా రిసెప్షన్ కూడా నిర్వహించారు.. దీంతో ఈ పెళ్లి ఫోటోలు, రిసెప్షన్ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవ్వడంతో కావ్య రెడ్డి గురించి మరొకసారి సోషల్ మీడియాలో చర్చ మొదలయింది. ఈమె ఏం చేస్తుంది? ఎక్కడ ఉంటుంది? ఈమె వృత్తి ఏంటి ఇలా కొన్ని విషయాలు తెరపైకి వచ్చాయి.

కావ్య రెడ్డి విషయానికి వస్తే.. ఈమెది సినిమా నేపథ్యం ఉన్న కుటుంబం కాదు .ఈమె తాత జడ్జి కాగా, ఈమె తండ్రి లాయర్ సినిమా ఇండస్ట్రీకి పూర్తిగా దూరం. అయితే కామన్ ఫ్రెండ్ ద్వారా కావ్య రెడ్డితో పరిచయం ఏర్పడి, ఆ పరిచయం ప్రేమగా మారి ఇప్పుడు పెళ్లి వరకు వెళ్ళింది. ఇకపోతే కావ్యా రెడ్డి ఒకవైపు లాయర్ గా పనిచేస్తూనే జర్నలిజంలో ప్రొఫెషనల్ కూడా. అంతేకాదు ఈమె తన ప్యాషన్ ను బిజినెస్ గా కూడా మార్చుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కి ఇక భయం లేదు.. మంచి బిజినెస్ ఉమెన్ భార్యగా వచ్చింది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ భార్య కావ్య రెడ్డి టాలెంట్ కి అభిమానులు ఫిదా అవుతున్నారు.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం టైసన్ నాయుడు, హైందవ సినిమా షూటింగ్లలో బిజీగా ఉన్నారు.